ఇవాల్టితో ఎలెక్షన్ ప్రచారము ముగుస్తుంది. ఇక ప్రజలకు నాయకుల
విపరీతమైన మాటలు వినే అవస్థ వుండదు. ఈ పదిహేను రోజులు అన్నీ పార్టీల నాయకులు ఒకరిపై
ఒకరు బురుద చల్లుకోవడము, ఒకరు మాట్లాడినదాంట్లో విపరీతార్థాలు తీసి మాట్లాడటము
బంద్ అవుతుంది. జాతీయ పార్టీలు వాళ్ళ పార్టీ
అధికారములోకి వస్తే దేశములో ఏమి చేస్తుందో, రాష్ట్రానికి ఏమి
ఇస్తుందో చెప్పకపోవడము దురదృష్టము. అద్భుతాలు
చేస్తమంటారుకాని అది ఏంటో చెప్పారు. మొత్తానికి
అన్నీ పార్టీలు వారి పార్టీ కాక వేరే పార్టీని ఎన్నుకుంటే ఇక దేశములో సామాన్యుని మనుగడకు
ముప్పని భయపెట్టినాయి. ఎప్పుడైనా ఏ పార్టీ
ఎన్నికైనా సామాన్యుని బతుక ఏమైనా మరిందా, పేదరికము తగ్గిందా, జీవన ప్రమాణము ఏమైనా పెరిగిందా? పెద్దవారికి బేలౌట్లు, పేద, మధ్యతరగతి వారికి బెల్టుటైట్లు. నా
దేశము, రాష్ట్రమూ ధనికమైనవే. అయినా రైతు మరణాలు, ఆకలి మరణాలు
మాత్రము అవుతూనేవున్నాయి.
ప్రచారము ముగిసినంత మాత్రాన ఇక పార్టీలన్నీ విశ్రాంతిగా వుంటాయని
కాదు. ఇప్పుడు తమ పార్టీకే వోటు వేయడానికి
ప్రలోభాల పెట్టె కార్యక్రమము షురూ అవుతుంది. వొట్లకు ఒకటి-రెండు రోజుల ముందే అంతా వారి వారి సొంతూరికి
చేరుకుంటరు. ఊర్లల్లో, పట్టణాలలో కొన్నికొన్ని ఏరేయాలలో పంపకాలు మొదలు అయితాయి. ఆడ, మొగా, ఓటు కింతా అని డబ్బు పంపకాలు, డ్రింక్ వంటివి అందివబడుతాయి.
ఇదివరకే నాయకులంతా ‘ఎవరెంత
డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రము మాకే వేయండి’ అని అన్నారు కాబట్టి పేద ప్రజలు కూడా మొహమాటము లేకుండా డబ్బు తీసుకుంటరు.
తీసుకోకపోతే నాయకులకు అనుమానము ‘మాకు ఓటు వేయవా’ అని నిలదీస్తారు కూడా. ఆ భయానికి
కూడా డబ్బు, ఇంకా ఏమైనా ఇస్తే అదీ తీసుకుంటరు. తర్వాత వారికి నచ్చిన వారికి వోటు వేస్తరు. కుటుంబములో నలుగురు వుంటే నచ్చిన వారికి ఓ ఓటు ఎక్కువ
మరొకరికి ఒకటి తక్కువ పడుతుంది. డబ్బు తీసుకున్నందుకు
ఇచ్చిన వాడికి ఎంతో కొంత న్యాయము చేయాలనుకుంటరు. ఈ మాత్రము నిజాయితీ నాయకులకు వుంటే దేశము ఎంతో ముందికు
పోయెదనుకుంట.
ప్రజా నిర్ణయము ఎలావుంటోందో వేచి చూడాలి మరి.

No comments:
Post a Comment