Friday, May 31, 2013

Hysterectomy

గర్భాశయము - కాన్సేర్ భయము



వరంగల్లు ఓ చారిత్రాత్మక నగరము.  ఈ మధ్యె టూరిజమ్ శాఖా ప్రత్యేకంగా
గుర్తించింది కూడ.  ఈ నగర చరిత్ర, ఇక్కడ పోరాట స్ఫూర్తి తలచుకుంటె
నాకెంతో గర్వంగా ఉంటుంది.  కాని ఈ మధ్య ఈ పట్టణం ఖ్యాతి మరో రకంగ
ఛానల్లకు, పత్రికలకు ఎక్కటం బాగానే కలవర పరచింది.
ఈ జిల్లాలో 6 సం. లోపు పిల్లలో అబ్బాయిల కంటె అమ్మాయిలు చాలా
తక్కువ ఉన్నారని, దానికి స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు కారణమని, కొన్ని
స్కానింగ్ సెంటర్లను మూసివేయటము, ఆ తరువాత కొద్ది రోజులకె అవి
తిరిగి తెరుచుకొని పని చేయటము జరిగింది.  భ్రూణ హత్యలు కొంచెం
తగ్గాయని వింటున్నాము.  జిల్లా వైద్యాధికారి చొరువతో, చర్యలతో స్కానింగ్
సెంటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవడము, భయానికి, అదివరకు అతిగా అబార్షనులు
చేసె డాక్టర్లు వాటిని కాస్త తగ్గించటము జరుగుతుంది.
ఇంతలోనె మళ్ళి మరో కథనం -" గర్భసంచులు-కాసుల సంచులని".  ఇక్కడె కాదు.
రాష్ట్రములో మరికొన్ని చోట్ల కూడ జరుగుతున్నాయి.  హిస్టరెక్టమి లేదా గర్భాశయము
తీసివేసె ఆపరెషన్ పట్టణాల్లో కంటే పల్లెల్లో, తాండాల్లో ఎక్కువగ జరుగుతున్నాయి.  వీటికి
కారణాలు, అవగాహనారాహిత్యము, కాన్సేర్ ఫోబియా - కాన్సేర్ వస్తుందనె భయము.
ఆ భయముతోనె కదా హాలివుడ్ ఆక్టరమ్మ ఒకరు రెండు వక్షోజాలు - మాస్టేక్టమి, 36 సం.కె,
ఆపరెషన్ చేయించుకుంది.  తొందర్లోనె హిస్టరెక్టమి +ఊఫొరెక్టమి (అండాశయలు తీసివెయటము)
ఆపరేషను కూడా చేసుకుంటానని చెపుతుంది.
ప్రతి ఒక్కరికి కాన్సెర్ అంటె భయమే కద.  తెల్లబట్ట  అవుతుందంటె స్త్రీలు డాక్ట్రర్ దగ్గరకు వెళ్తారు.
"ఇట్లా అయితె కాన్సేర్ వస్తుందంట కదా," అని భయాన్నీ వెళ్ళబుచ్చుతారు.  గైనకాలజిస్టులు చూస్తె , తగు
పరీక్షలు చేసి సామాన్యంగా అంతా బాగుంటె ధైర్యం చెప్పి మందులు రాసి పంపించేస్తారు.
ఇతర స్పెషలిస్టులు చూస్తె, ఒకసారి లేడి డాక్ట్రర్ దగ్గర పరీక్ష చేయించుకోమని పంపించేస్తారు.  నిజాయితి
తక్కువ వున్నవాళ్ళైతె , ఆ స్త్రీకి ఇద్దరు పిల్లలు వున్నారు, ఇంకా సంతానము అవసరము లేదనుకుంటే
"ఏమో, ముందు ముందు ఎట్లుంటదో ఏమి చేప్తం.  ఊరికె మందులు వాడె బదులు ఆపరేషను
చేసుకుంటే పని వొడుస్తది కద" అని అనొచ్చు.  అలాగె కాస్త అటు ఇటుగా రక్తస్రావము అయినా, పొత్తి
కడుపు నొప్పి వచ్చినా ఇట్లాగె మాట్లాడొచ్చు.  స్త్రీలు,  కొన్నిసార్లు వాళ్ళకు తెలిసినవాళ్ళు ఎవరైన ఇలాంటి
బాధలే పడి చనిపోయినట్టు వినటము జరిగితే,  ఆ పరిస్థితులలో, భయానికి లోనై ఆపరేషను సిద్ధ
పడటము జరుగుతుంది.  చిన్న వయస్సు, నలభైలోపు వాళ్ళకు, అంతా బాగుంటె నిజాయితి అయిన
గైనాకాలజిస్టులు వాళ్ళను సమాధానపరచి పంపించేస్తారు .  ఆ స్త్రీలు వినకపోవచ్చు.  కొన్నిసార్లు
డాక్టరు తను చేయకపోతె ఆ స్త్రీ మరెవరి దగ్గరకైన పోయి ఆపరేషను చేసుకుంటుందని భావించి తానే ఆపరేషను
చేయవచ్చు.
ఏ వయస్సులోనైన అనవసర ఆపరేషను తప్పె.  కాని మూడు పదులు కూడా దాటని స్త్రీలకు హిస్టరెక్టమి
చేయటము వలన వారి మానసిక, శారీరక, లైంగిక ఆరోగ్యము కొంత బలహీన పడె అవకాశము వుంది.
అండాశయాలు తీసివేయకపోయినా తొందరలోనె వాటి పనితనము తగ్గి ముట్లు ఆగిపోయినప్పుడు కలిగె
బాధలు మొదలు కావచ్చు.  ఐదు పదులకు అటు ఇటుగ హిస్టరెక్టమి చేసినప్పుడు అండాశయాలు
కూడా సమాన్యంగ తీసెస్తారు, అండాశయ కాన్సేర్ ముప్పు తగ్గించాలని (అందుకె ఏ.జొ ఆపరేషను
చెసుకోబోతుంది).  ముట్లు క్రమంగ తగ్గిపోతున్నపుడు వచ్చె మార్పులు చాలవరకు నిదానంగా వస్తాయి
కాబట్టి స్త్రీకి తట్టుకోవడము తేలిక అవుతుంది, మరీ కష్టమనిపించదు.  కాని ఆపరేషను అప్పుడు
అండాశయాలు తీసివేయటము వలన కలిగె మార్పులు ఆకస్మికము కాబట్టి తట్టుకోవడము కష్టము
కష్టమనిపిస్తుంది .  కొద్ది రోజులపాటు హార్మోనలు తీసుకోవలసి వస్తుంది .  ఏ వయస్సులో హిస్టరెక్టమి ఆపరేషన్
చేసుకున్న ముదిమి కొంచెం ముందె వస్తుంది.
తప్పనిసరి అయినప్పుడు ఏ వయస్సులోనైన హిస్టరెక్టమి చేసుకోవలసిందే - ముఖ్యంగా కాన్సేర వ్యాధి
వున్నప్పుడు.  వస్తుందనె భయానికి మాత్రం కాదు.
హిస్టరెక్టమి తప్పనిసరిగ చేసుకొవలసిన పరిస్థితులు:
  - గర్భాశయ కాన్సెర్, పాప్ స్మియర్ టెస్టులో ముందుముందు కాన్సేర్ వచ్చె సూచనలు
   కనబడినప్పుడు.
 - గర్భాశయములో కణతులు వుండి అధిక రక్తస్రావము అయితున్నప్పుడు
 -ఎలాంటి కణితులు లేకున్నా, దీర్ఘకాలము మందులు సక్రమపద్దతిలో వాడిన అధిక రక్తస్రావమై
   స్త్రీని రక్తహీనతకు, అనారోగ్యానికి గురిచేస్తున్నప్పుడు
 -‘ఎండొమెట్రియొసిస్’తో పాటు కణితులు వున్నప్పుడు
  - పొత్తి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి గర్భాశయము దాని చుట్టు కణితులు ఏర్పడటము, ఎప్పుడు
    పొత్తికడుపులో నొప్పివుండటము
  - గర్భాశయము మొత్తంగా యోని బైటకు జారినప్పుడు
  - అండాశయాలకు కాన్సేర్ వచ్చినప్పుడు వాటితో పాటు తీసెవేయల్సిందె.

ఏ కాన్సెర్ గురించి భయపడి గర్భాశయము తీసుకోవాలనుకుంటారో - అది గర్భాశయ ముఖద్వార
కాన్సేర్.  ఇది రావాడానికి కొన్ని ఏళ్ళ ముందె మనము పాప్ స్మెయర్ ద్వారా తెలుసుకోవచ్చు.
శృంగార, వైవాహిక జీవతము మొదలు పెట్టిన స్త్రీలు 25వ ఏటి నుండి మాములుగ ప్రతి రెండేళ్ళ
కొకసారి ఈ పరీక్ష చేసుకోవాలి.  రిపోర్ట్లులను బట్టి కొన్నిసార్లు కాస్త ముందు లేదా కాస్త లేటుగ
డాక్టరు సలహాను బట్టి చేసుకోవాలి.  దానివలన కాన్సెర్ సూచన ఏ కొద్దిగ వున్న ఆపరేషను
చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ గర్భాశయ ముఖద్వార కాన్సేర్ తగ్గించడానికి టీకా కూడ వచ్చింది.  శృంగార జీవతము
మొదలు పెట్టకముందే, కుదరకపోతె, 40 ఏళ్ళ వరకు కూడా డాక్టరు సలహా ప్రకారము ఆ టీకా వేసు
కోవడము మంచిది.
 ఏదైన ఆపరేషను చేసి జబ్బు వున్న భాగాన్ని తీసివేసాక తప్పనిసరిగ దానిని పరీక్షకు (బయాప్సి) పంపిస్తె
అసలు జబ్బు విషయము, ముందు ముందు తీసుకొవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కూడ
వస్తుంది.

*ఇది సాధారణ అవగాహన కోసం క్లుప్తంగా రాసినది.  మీకు సమస్య వున్నప్పుడు మీకు నమ్మకము
వున్న డాక్టరును సంప్రదించి చికిత్స చేసుకోవాలి.

Monday, May 27, 2013

Sacrifice

బాధ్యత
"A man who lives by the sword dies by the sword"
.
ఛత్తీస్ గఢ్ లో జరిగింది ఘోరమే.  కాని దానికి కారణాలేంటి?   ఆదివాసుల జీవితాలు
బాగుపడితె, అభివృద్ధి ఫలాలు వారికి అందితె ఇలాంటి ఘటనలు తగ్గవా?  వారి
సంపదను - అడవి, అటవీ సంపదను కొల్లగ్గొట్టి వారిని నిర్వాసితులను, జీవనాధారము
లెకుండా చేస్తె వారు ఏం కావాలి.  వారి నిస్సహాయ స్థితిని ఆసరా చేసుకొని, వారికి
ఆయుధాలను ఇచ్చి తిరుగుబాటు చేయించె శక్తులు ఎంత వరకు వాళ్ల బ్రతుకులను
బాగుపర్చ గలవు.  మరణము ఒక వ్యక్తి జీవితానికి ముగింపె కాని తత్కారణ పరిస్థితులకు
కాదు.  ప్రతి మనిషిలో కాస్త నిజాయితి వుండి ‘బతుకు - బతకనివ్వు’ అనె సూత్రాన్ని
పాటిస్తె ఈ లోకంలో దారుణాలు, క్రూరత్వము తగ్గుతుంది కద.  మొన్నటి నరమేధంలో
ఒక్ సెక్యూరుటి అఫీసరు, ఒక డ్రైవరు చివరి బుల్లెట్లతో తమను తామే కాల్చుకొని
చనిపోయారట.  ‘క్షమించండి.  మా దగ్గర బుల్లెట్లు లేవు.  మిమ్మల్ని రక్షిండములో
విఫలమైయ్యాము’, అని తమను కాల్చుకొని చనిపోయారు.  వీరికి వారి బాధ్యత
పట్ల వున్న నిబద్ధత మన రాజకీయనాయకులకు వుంటె, మన దేశములో నక్సలిజము
ఇలా పెరిగేది కాదు కద. 
ఈ లోకంలో ఎవరము శాశ్వతము కాదు.  కూడబెట్టిన సంపదలు అవసరానికి అక్కరకు
వస్తాయో లేదో తెలవదు.  అయినా వీలైనంత దోచుకొని దాచుకోవాలనె దురాశ అందరి
జీవితాలను ఆగం చేస్తుంది.  మన చుట్టు వాళ్ళు బాగుంటే మన జీవితము కూడ
ప్రశాంతంగా వుంటుందనె అవగాహన ప్రతి ఒక్కరిలో వుంటె ఈ ప్రపంచములో అందరి
జీవితాలు సుఖశాంతులతో వుంటాయి.www.sankalini.orgchattisgarh

Saturday, May 25, 2013

Heat Wave

మండే కాలం
"Heat waves tend to be the silent and invisible
killers of silent and invisible people".

ఎండలు మండుతున్నాయ్.  ఎన్నో జీవితాలను బుగ్గి
చేస్తున్నాయ్.  ధనాశతో, దురాశతో, తమ సౌఖ్యం కోసం
పర్యావరణాన్ని నాశనం చేసేది బడాబాబులు.  దాని వలన
వచ్చె అనర్థాలకు బలి అయ్యేది బడుగు జీవితాలు.  ప్రభుత్వానికి
కావలసింది సామాన్య ప్రజల సంక్షేమమా లెక ధనవంతుల/
పారిశ్రామిక/వ్యాపారవెత్తల ప్రాపకమా?  ప్రగతి, అభివృద్ధి
పేరుతో ఎక్కువగ లాభం పొందేది ధనిక/రాజకీయ/
పారిశ్రామిక వ్యాపార వర్గమే.  సంక్షేమ పథకాలకు డబ్బు కావలంటె
దానికి అతి సులువైన మార్గము మద్యపానము ప్రోత్సహించటమైతె,
అది ఏ ప్రజల అభివృద్దికి దోహదం అవుతుంది?
ప్రతి  యేడు ఎండలు కనీసము అదివరకంటె ఓ రెండు డిగ్రీలు
అధికంగా నమోదు అవుతున్నాయ్.  ఓ యేడుకు మించి
మరో యేడు జనం వడదెబ్బకు చనిపోతున్నారు.  అయిన
ప్రభుత్వము ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న
దాఖలాలు ఏమి లేవు.  సామాన్యంగ పైకి/ప్రపంచమంతటికి
కనిపించే  ప్రకృతి వైపరిత్యాలు - వరదలు, భూకంపము వంటివి ఎక్కువగ
పేద, మధ్యతరగతుల వారిని కొంతవరకు, తక్కువసార్లు ‘ఉన్నత’
వర్గాలను కూడ నష్ట పరుస్తుంది.  ఈ వడగాలుల వలన మాత్రం
పేదవారె సామాన్యంగ మరణించటము జరుగుతుంది.  రాష్ట్రములో
వడదెబ్బకు రోజుకు వందల్లో జనము చనిపోతున్నా రాజకీయనాయకులు
దీని గురించి ప్రభుత్వం పై ఎలాంటి వత్తిడి తీసుకురాక పోవటము వారికి
ప్రజల పట్ల, వారి సంక్షేమము పట్ల వున్న శ్రద్ధను తెలియ జెస్తుంది. 
ఇది ఒక ఆరోగ్య ఆత్యవసర పరిస్థితిగా గుర్తించి, ప్రజలు ఎండల్లో
బైటకు రావద్దని, పొరపాటున బైటకు వస్తె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
రేడియో, టివి, వార్తా పత్రికలు, SMSల ద్వార విస్తృత ప్రచారం చేయలి.
వడ దెబ్బకు మరణించిన కుటుంబాలకు, ప్రకృతి వైపరిత్యాలుకు గురి అయిన
వారికి సహాయము చేసినట్లే సహాయము అందించాలి.


*తప్పనిసరి అయితె తప్ప ఎవరు, ఇప్పటి పరిస్థుతుల్లో ఉదయం పది
నుండి సాయంత్రము ఐదు గంటలవరకు అసలే బైటకు వెళ్ళొద్దు. 
*బైటకు వెళ్ళాల్సి వస్తె, తేలికైన సరైన ఆహారము తీసుకొని, నీళ్ళు తాగె
వెళ్ళాలి.  లేత రంగు వదులైన పూర్తి నూలు దుస్తులే వేసుకోవాలి.
చలువ కంటి అద్దాలు వుంటె పెట్టుకోవాలి.  టోపి పెట్టుకోవాలి.  గొడుగు,
లేత రంగుదైతె మరీ మంచిది.
*మంచినీళ్ళ  బాటిల్ 700-800mlది దగ్గర పెట్టుకొని మాటి మాటికి
నీళ్ళు తాగాలి.  నిమ్మరసం లాంటివి వున్నా మంచిదే. 
రుమాలు తడి చేసుకొని, మధ్య మధ్యలో ముఖము చేతులు తుడుచు
కుంటుండాలి.

*ఇంట్లో వున్నా పిల్లలకు, బలహీనంగా లేదా జబ్బుతో వున్న వృద్ధులకు
వడదెబ్బ తగలొచ్చు.  వారు పలచటి, వదులు నూలు దుస్తులు ధరించి
మాటి మాటికి  నీళ్లు తాగటము, తడి గుడ్డతో ఒళ్ళు తుడుచుకోవటము

చేయాలి.  ACలు, air coolers ఉన్నవాళ్ళు ఏలాగు వాటిని
సద్వినియోగం చేసుకుంటారు.  వాళ్ళకు ఈ బాధ సామాన్యంగా వుండదు.

*వడదెబ్బకు తొలి సూచన ఒళ్ళు బాగా వేడెక్కటమెకాక, కాస్త పరాకు కూడ
మొదలౌతుంది.  వడదెబ్బ అనుమానం రాగానె, ఆ వ్యక్తి బట్టలన్ని తీసేసి
ఎత్తు తక్కువ ఉన్న నీటి తొట్టిలో పడుకొబెట్టాలి.  తల, మోచేతుల నుండి
అరచేతులు, మోకాళ్ళనుండి పాదాల వరకు మాత్రమే బైట వుండాలి.  మిగిలిన
శరీరమంతా నీటిలో మునిగి వుండాలి
.  అలా కుదరని పక్షంలో వడదెబ్బ తగిలిన
వ్యక్తి మీద నీళ్ళు పోస్తు ఫాన్ గాలి తగిలెటట్టు పెట్టడమో, గాలి బాగా ఊపడమో
చేయాలి.  లేదా కుదిరితె ఐసు ముక్కలనుగుడ్డలొ చుట్టి చంకలో, గజ్జలలో పెట్టి,
పొట్ట వెన్నలో ఐసుతో రుద్దటము చేయాలి
.  శరీర వేడి కొంత తగ్గాక డాక్టర్ దగ్గరకు
తీసుకెళ్ళాలి.

ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటె వడదెబ్బ వలన ప్రాణాపాయము జరగకుండా
చూసుకోవచ్చు.
 

Sunday, May 19, 2013

US Visit




ఆకాశ వీధుల్లో 
 
 
పై నుండి చూస్తే షికాగో నగరము 
 
 

షికాగో లేక్ 
 
 
 

షికాగో నదిలో షికారు చేస్తూ తీసినది
కార్ పార్కింగ్ భవనాలు 
 
 
 
షికాగో భవనాలు   (డౌన్ టౌన్  )
 
 
 
 
షికాగో భవనాలు (డౌన్ టౌన్ ) ఎదురు భావనల నీడలను 
అద్దాలలో చూడవచ్చు 
 

ఇక్కడ ప్రతి ఏడు ఒక కొత్త విగ్రహము పెడతారు
2012 లో మార్లిన్ మన్రో వుంది
              
 
 
 

2012 మే మొదటి వారములో  షికాగోలో  రాత్రి
పావు తక్కువ 8గం. లకు సూర్యాస్తమయ దృశ్యం  
 


 
పచ్చదనం ప్రతి చొట కనువిందు చేస్తుంది.  రోడ్ల పైన దుమ్ము 
కనిపించదు.  మట్టి ఎక్కడ కనిపించదు, కొండలు గుట్టలపైన తప్పితే . 
చక్కని లాన్లు maintain చేస్తారు.  ప్రతి ఇంటి ముందు, లాన్,
చిన్న చిన్న చెట్లు వుంటాయి. 
 
  

ఇది లాస్ అన్జేలేస్ లో మేమున్న లాడ్జ్ 
చక్కని విశాలమైన రూములు.  
దినమంతా సాఫ్ట్ beverages  ఫ్రీగా ఇస్తారు. 
వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ నాకు చాల నచ్చింది. 
5-6 రకాల ఐటమ్స్ వుండెవి.  ఇష్టము వచినన్ని తీసుకొని తినవచ్చు . 
వార్నర్ బ్రదర్ స్టూడియో ఇక్కడి నుండి 1కి. మీ . లోపు దూరములొనె వుంది. 
2-3 కి. మి. దూరములో యూనివర్సల్ స్టూడియో వుంటుంది 
 
హాలివుడ్ తారల నివాస స్థలము  
 

బివర్లి హిల్స్ 

 
హాలివుడ్ వీఢులో - చైనా థియేటర్  
 
  
చైనా థియేటర్ ద్వారము  
 
 
 హాలివుడ్  వీధుల్లో - దూరంగ కనిపించేది రూస్వెల్ట్ హోటల్. 
మార్లిన్ మన్రో మొదటి ఫోటో షూట్ ఇక్కడె స్విమ్మింగ్ పూల్ 
దగ్గర జరిగిందట.  
 
 
బైట దేశములో వున్నప్పుడు ఇండియ పేరు చూస్తె ఎంత 
ఆత్మీయంగా అనిపిస్తుందో ! 
 
 
ఇక్కడ హాలివుడ్ తారలు ఎక్కువగా షాపింగ్  చేస్తారట. 
ఆక్కడ ఏదో ఫొటొ షూట్ అవుతుంటే త్రాలిలో కూర్చున్న అందరు 
క్లిక్ మనిపించారు.  నేను కుడా ... 
 
 
Santa - Monica  వెళ్ళే దారిలొ.. 
 
 
 
Santa Monica  దగ్గర, ఆ రాతి మీద ఆ  బొమ్మ నాకు నచ్చింది 

 
 

Santa -Monica బీచ్ వెళ్తు 


 
నయాగర జలపాతము, ఒక్కసారైనా చూడవలసినది 
ఎన్ని ఇంద్ర ధనస్సులో 
ఆ జలపాత హోరు ఎంతనో 
 
 

జీతం ఎంత వున్నా 'గీతం' అంటె ఆశే కదా 
    

USAలో జన సాంద్రత తక్కువ.  జనాభ తక్కువ, వైశాల్యం ఎక్కువ,
ప్రకృతి వనరులుఎక్కువ,  వాటి సద్వినియోగము ఆ దేశాన్ని సంపన్న
దేశంగా చేసింది.  అక్షరాస్యత శాతం ఎక్కువ వుండి, ప్రజల్లో ఆరోగ్యం
పట్ల అవగాహన బాగా వుంటుంది.  పరిశుభ్రత బాగా పాటిస్తారు.  ఎటు
దారిలో వెళ్ళినా, ఏ సంస్థల్లోనైన చెత్త చేదారము బూజులు వెలాడుతు కనబడదు.
రహదారుల్లో ఎప్పుడైన కనబడె చెత్త ఎదైన వుందంటె, అది ఎండుటాకులు, రాలిన
పూలు మాత్రమే. జనాలు నడుస్తు రోడ్ల మీద చాల తక్కువ చూస్తాము. 
మనుషులను చూడాలంటె, అది మార్కెట్టో, టూరిస్ట్ ప్లేసో, ట్రాన్స్పోర్ట్
స్టేషనో, రెస్టారెంటో అయి వుండాలి.  పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటె, కార్లె కనబడ
తాయి.  అక్కడ పెద్ద, పెద్ద కార్లు చూసినా, వాళ్ళు వాడే డిస్పోసబల్స్,
టిష్యూస్ చూస్తె, ఈ భూమి మీద వాళ్ళు పర్యావరణానికి కలిగించె నష్టం
అత్యధికమని అర్థమైతుంది.  అయినా, వాళ్ళు అహారం ఖరిదైందంటె,
భారతీయులు ఈ మధ్య ఎక్కువ తింటున్నారని, పెట్రోల్ ధర పెరిగిందంటె
చైనీస్,ఇండియన్స్ కార్లు ఎక్కువగా కొంటున్నందువలనే పెట్రోల్ ధర
పెరుగుతుందని, ఒజోన్ పొర నాశనమౌతుందని మనల్ని అంటారు. 
అక్కడ కంటె ఉన్నతంగ మన దేశమును అభివృధ్ది చేయలేమా?
మనకున్న ప్రకృతి, మానవవనరులను సక్రమంగా వాడుకుంటే, మనము
అంత కంటే గొప్పగ బ్రతకవచ్చు.  మన రాజకీయనాయకులు అవినీతిని
ఒక 50% తగ్గించుకున్నా, విదేశి బాంకుల్లో ధనాన్ని మురుగబెట్టే బదులు
దేశ మౌళిక అవసరాల కోసము ఖర్చు పెడ్తె గర్వంగా మనం ప్రపంచాన్ని
శాసించె స్థాయికి చేరుకోవటానికి ఒక దశాబ్దము చాలు. 

Sunday, May 5, 2013

Graduation ceremony





Administration Building UIC 
90 దశకము తర్వాత నుండి, మన దేశము నుండి అమెరిక వెళ్ళె
వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది.  ఐ.టి రంగంలో వచ్చిన విప్లవము
వల్ల ఇంజనీరింగ్ చదివిన చాల మంది యువకులు, ఐటి విద్య నేర్చిన
ఇతర డిగ్రీలు చదివిన వారు కూడ అమేరికాకు వలస వెళ్ళారు. ఈ
సహస్రాబ్ధి తొలి నాటి నుండి అమ్మాయిలు కూడా వెళ్తున్నారు.  అక్కడ
మంచి అవకాశాలు రావాలని, అక్కడి మాస్ట్ర్ ర్స్ డిగ్రీకి ప్రాముఖ్యత
పెరిగి, ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత మాస్ట్ ర్స్ కు అక్కడకు పోవడం
చాలా సామాన్య విషయంగా మారింది.  మధ్యతరగతిలో, కిందా
మీదా పడి, ఏదో ఒక విధంగ అమెరి్కాకు పిల్లలను పంపితే ఆ తర్వాత
భవిష్యత్తు బంగారుమయమనె భావం స్థిరపడింది.  లోన్లు తీసుకొని
వారిని అక్కడకు పంపటము, ఆ తర్వాత పిల్లలు అక్కడ చదువుకుంటు
ఎంతో కొంత సంపాదిస్తు, వారి లోన్లు తీర్చెసుకోవటమేకాక తల్లిదండ్రులుకు
కుటుంబానికి అర్థికంగ కూడా సహాయ పడుతున్నారు.  అక్కడ ఉద్యోగం
సంపాదించి స్థిరపడ్డ పిల్లల తలిదండ్రుల ఆర్థికంగ ఉన్నత స్థాయి చేరుకున్నారు.
కాని, పిల్లలు చదివుకునే రోజుల్లొ ఎంత కష్టపడుతున్నారో చూస్తె అలా పంపి
స్తారో లేదో.  ముగ్గురు, నలుగురు కల్సి ఒక అపార్ట్ మెంటులో వుంటు, మంచాలు,
సరైన పరుపులు లేక వుండటము, కుర్చీలు, బల్లలు లేక గోడలకు చేరబడి
చదవడం చూస్తె తప్పక బాధ కలుగుతుంది.  ఇక్కడ నామోషిగా భావించే పనులు,
ఆదాయం కోసం అక్కడ సంతోషంగా చేస్తారు.  పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెట్రోల్ బంకులో
పనిచేయటము, హోటల్ లో వెయిటర్ గా/వెయిట్రెస్ గా పనిచేయటము ఎంత సాధారణ
విషయమో.  ఒక రకంగ బాధ అనిపించినా, అలోచిస్తె ఇది మంచిదె అనిపిస్తుంది.
సొంత కాళ్ళమీద నిలబడి వారి సంపాదనతో చదువుకోవటం మంచి పనే కదా.
 శ్రమశక్తిని గౌరవించటము, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించటము నేర్చుకుంటారు.  జీవితము
అంటె కర్మ అని, శక్తి వుండి పని చేయనివాడు బ్రతకడానికి అనర్హుడనె ఙ్ఞానమ అక్కడ
వారికి బాగానె తలకెక్కుతుంది.  ఇంత కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకోవడము గొప్ప
 విషయమే కదా!  అందుకనే అక్కడ డిగ్రీ ప్రధానోత్సవాన్ని చాలా ఘనంగ జరుపుకుంటారు.
 మామూలుగ అమెరిక వెళ్ళెందుకు్ వీసా దొరకటము కష్టమైనా, ‘గ్రాడ్యుయెషన్ సెరిమొని’
అప్పుడు మాత్రం అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్ర్లులు ఏ దేశము వారైన వీసా
 ఇచ్చెస్తారు.  అక్కడ వారి తల్లిదండ్రులు ఎలాగు ఆ ఉత్సవానికి వస్తారు.  వారి సంస్కృతిలో
 జీవిస్తు, వారి జీవితాలు స్వంత కాళ్ళ మీద బ్రతుకుతు డిగ్రీ పూర్తి చేయటం,ఘనమైన
 విషయమె.  నేను ఈ గ్రాడ్యుయెషన్ సరిమొనికి వెళ్ళాను.  ఒక విద్యార్థి తరఫున 8 మంది
కంటె ఎక్కువ రాకపోతె నయమని, అందుకు ఆడిటోరియం స్థలం సరిపోవక పోవచ్చని తెలిపారు.
 అక్కడి ఏర్పాట్లు, ఉత్సవము చూడవలసిందె.  డిగ్రి ప్రధానం తర్వాత అల్పాహార విందు ఏర్పాటు
భోజన ప్రియులకు మరో ఉత్సవంగా వుంటుంది.  ప్రతి ఏర్పాటులో శ్రద్ధ, క్రమశిక్షణ కనబడుతుంది. 
ఆ గ్రాడ్యుయెషన్ సెరిమొని నా జీవితములో ఒక మరపురాని మధుర ఘట్టము.
 
 







 UIC, Graduation Ceremony
         5-5-2012

 

Universal Studios




ఒకప్పుడు US వెళ్ళటము మధ్యతరగతి వారికి తీరని కల. 
కంప్యూటర్ యుగము వచ్చాక, మధ్య తరగతి కుటుంబాలనుండి
అబ్బాయిలు, అమ్మాయిలు, ఇంజనీరింగ్ కోర్స్ తరువాత MS
చేయాడానికి అక్కడికి వెళ్ళటం చాల సాధారణ విషయమైంది. 
ఎక్కువ మంది ఏదొ విధంగ అక్కడ ఉద్యోగం కూడ సంపాదించుకొని
స్థిరపడ్డారు, పడుతున్నారు.  దానితో వారి తల్లిదండ్రులు అక్కడకు
వెళ్ళి చూసి రావటము చాల మామూలు విషయం. 
నేను అక్కడకు వెళ్ళినప్పుడు కేవలము పది రోజులు మాత్రమే
వున్నాను.  ఆ వున్నకొద్ది రోజులు కొన్ని ప్రదేశాలు చూసాను. 
నాకైతె అక్కడ ప్రజలు ఇతరులతో వ్యవహరించే తీరు నచ్చింది.  వారి
వృత్తిని, బాధ్యతను చిత్తశుధ్దితో నిర్వహిస్తారని అనిపించింది.  ఏదైన
enquiry చేసినప్పుడు ఒపిగ్గా సమాధానము చెప్పుతారు.  Technical
కారణాలవల్ల ఒకసారి మా flight ఆలస్యమై, మరో connecting
flight అందకపోతే, ఆ airlines వాళ్ళు ఒపిగ్గ అందరికి వారి వారి
అవసరాలని బట్టి చర్యలు చేపట్టారు.  మాకు వెంటనె వెళ్లె వీలు లేనందున
ఆ రాత్రికి ఒక చక్కటి హోటల్లో బస ఏర్పాటు చేసి, ఆ రాత్రికి, మరుసటి
ఉదయానికి ఎక్కడైన తినడానికి కూపన్లు ఇచ్చారు.  అప్పుడు మాకు సహాయము
చేసినావిడా, ఆమె డ్యూటి అయిపోయినా, దాదాపు అరగంట కంటే ఎక్కువసేపె
వుండి కావలసిన ఏర్పాట్లు చేసారు.  మాకు కావలసిన ఆహారాన్ని మేముండె హోటల్లో
కాక బైట ఎక్కడైన తీసుకుంటె తక్కువ ఖరీదుకు వస్తుందని సలహా కూడ ఇచ్చారు.
ఇండియాకు వచ్చెటప్పుడు ఇలాంటి పరిస్ఠితే వచ్చింది.  ఇండియన్ ఎయిర్ లైన్స్ల్ లో
ఒక తెలుగు ఆవిడె వున్నారు.  అప్పుడు strike వల్ల ప్లేన్స్ సరిగ నడవట్లేదు.
check-in అంత అయ్యెవరకు flight position చెప్పలేదు.  అయ్యాక
చెప్పింది, "పొద్దుట  పది గంటలది రాత్రి పది గంటలకు వుందని, మా లగేజ్ అక్కడ
పెట్టి మేము ఎటైన వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల వరకు రావచ్చ"ని.  "మాకు ఎటూ
వేళ్లె పరిస్థితి లేద"ని చెప్పాము.  "ఐతె ఇక్కడె వుంటారా", అని అడిగారు.  అవునంటె,
"సరే, ఈ కుపన్లు తీసుకొని తిని ఇక్కడె airport లో వుండ"మని చెప్పింది.  అన్ని
గంటలు అలా airportలో ఎదురుచూస్తు కూర్చోవటము ఎంత కష్టమో!  ఢిల్లీలో
కూడ, అలస్యము వల్ల రాత్రి 7-8 గంటలు అవస్థపడాల్సి వచ్చింది.  సమాచారం కూడ
చక్కగ ఇవ్వరు.  ఒక అధికారి వెక్కిరింతగ, "మీలాంటి వాళ్ళంత అక్కడ గుంపున్నరు.
మీరు వాళ్ళని కలవండి", అని వెళ్ళిపొయాడు.
అక్కడ యునివర్స్తిటి ఆఫీసులో కూడ అవసరమైన సమాచారము ఇవ్వడానికి ఒకావిడ
తీసుకున్న శ్రద్ధ నేను మర్చిపోను.  తన దగ్గర సమాచారము పూర్తిగ లేకపోతె, వేరె ఒక
రిద్దరికి ఫోన్ చేసి కనుక్కొని మరీ చెప్పింది.  ఎప్పుడు ముఖంలో చికాకు లేదు.  చక్కటి
చిరునవ్వు.  మన దగ్గర ఎన్నోసార్లు నేను పనిమీద ఆఫీసులకు వెళ్ళాను.  వాళ్ళ
స్థానంములో, వాళ్ళసమయములో వుండరు.  వున్నా, సమాధానము సరిగ్గా ఇవ్వరు.
మళ్ళి రమ్మంటారు.లేదా ఇంకెక్కడికో వెళ్ళాలని చెప్పుతారు.  మరి ఆక్కడైన పని
అవుతుందా అంటె నాకెం తెలుసని విసుక్కుంటారు.  వాళ్ళ ఉద్యోగము ఆ పని
 చేయటానికేనని మర్చి, చేసె పనికివచ్చినవాళ్ళు ఏమి ముట్టచెప్పాలో నిర్మొహమాటంగ
వినిపిస్తారు.  ఎక్కడో ఒక్కరు ఉద్యోగ నిబద్ధులు వుంటారు.  అదృష్టముంటే తటస్థ పడుతారు.
మర్యాదగ పక్కవాళ్ళతో వ్యవహరించె తీరు అక్కడ నేర్చుకోవల్సిందే.  మన పక్కవాడు
మన కంటే తక్కువకాదని తెలుసుకుంటే మనము కూడ చక్కగానె ప్రవర్తిస్తాము.  కాక
పోతే మనలో ప్రతి ఒక్కడు ఏదో కారణంగ తను మాత్రమే ఘనుడని, చట్టానికి అతీతుడని,
లేదా పరిస్థితులను manage చేయగలననే భావము ఎక్కువేమో.  అందుకు పక్క
వాడిని తక్కువగ చూడటం. 
సరే.  ఆ విషయం ఇక వదిలేస్తాను.  అక్కడ Hollywoodలో Universal
Studiosలో తీసుకున్న కొన్ని ఫోటోలు మీ ముందు పెడుతాను.
  
 

 
 Internal bus for the tourists
 
Cartoon character entertaining the visitors
Another Wizard helping a tourist in the wheel chair.

Water settings, river, lake...



 
Plane crash and ruins



 
Jurassic park
 



Presenting picturisation
 

 
Enacting a scene from 'Psycho'
 
 
 
Home in a forest or along side the sea.  Behind the green screen they create water settings

 


Fairy land