ఒకప్పుడు US వెళ్ళటము మధ్యతరగతి వారికి తీరని కల.
కంప్యూటర్ యుగము వచ్చాక, మధ్య తరగతి కుటుంబాలనుండి
అబ్బాయిలు, అమ్మాయిలు, ఇంజనీరింగ్ కోర్స్ తరువాత MS
చేయాడానికి అక్కడికి వెళ్ళటం చాల సాధారణ విషయమైంది.
ఎక్కువ మంది ఏదొ విధంగ అక్కడ ఉద్యోగం కూడ సంపాదించుకొని
స్థిరపడ్డారు, పడుతున్నారు. దానితో వారి తల్లిదండ్రులు అక్కడకు
వెళ్ళి చూసి రావటము చాల మామూలు విషయం.
నేను అక్కడకు వెళ్ళినప్పుడు కేవలము పది రోజులు మాత్రమే
వున్నాను. ఆ వున్నకొద్ది రోజులు కొన్ని ప్రదేశాలు చూసాను.
నాకైతె అక్కడ ప్రజలు ఇతరులతో వ్యవహరించే తీరు నచ్చింది. వారి
వృత్తిని, బాధ్యతను చిత్తశుధ్దితో నిర్వహిస్తారని అనిపించింది. ఏదైన
enquiry చేసినప్పుడు ఒపిగ్గా సమాధానము చెప్పుతారు. Technical
కారణాలవల్ల ఒకసారి మా flight ఆలస్యమై, మరో connecting
flight అందకపోతే, ఆ airlines వాళ్ళు ఒపిగ్గ అందరికి వారి వారి
అవసరాలని బట్టి చర్యలు చేపట్టారు. మాకు వెంటనె వెళ్లె వీలు లేనందున
ఆ రాత్రికి ఒక చక్కటి హోటల్లో బస ఏర్పాటు చేసి, ఆ రాత్రికి, మరుసటి
ఉదయానికి ఎక్కడైన తినడానికి కూపన్లు ఇచ్చారు. అప్పుడు మాకు సహాయము
చేసినావిడా, ఆమె డ్యూటి అయిపోయినా, దాదాపు అరగంట కంటే ఎక్కువసేపె
వుండి కావలసిన ఏర్పాట్లు చేసారు. మాకు కావలసిన ఆహారాన్ని మేముండె హోటల్లో
కాక బైట ఎక్కడైన తీసుకుంటె తక్కువ ఖరీదుకు వస్తుందని సలహా కూడ ఇచ్చారు.
ఇండియాకు వచ్చెటప్పుడు ఇలాంటి పరిస్ఠితే వచ్చింది. ఇండియన్ ఎయిర్ లైన్స్ల్ లో
ఒక తెలుగు ఆవిడె వున్నారు. అప్పుడు strike వల్ల ప్లేన్స్ సరిగ నడవట్లేదు.
check-in అంత అయ్యెవరకు flight position చెప్పలేదు. అయ్యాక
చెప్పింది, "పొద్దుట పది గంటలది రాత్రి పది గంటలకు వుందని, మా లగేజ్ అక్కడ
పెట్టి మేము ఎటైన వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల వరకు రావచ్చ"ని. "మాకు ఎటూ
వేళ్లె పరిస్థితి లేద"ని చెప్పాము. "ఐతె ఇక్కడె వుంటారా", అని అడిగారు. అవునంటె,
"సరే, ఈ కుపన్లు తీసుకొని తిని ఇక్కడె airport లో వుండ"మని చెప్పింది. అన్ని
గంటలు అలా airportలో ఎదురుచూస్తు కూర్చోవటము ఎంత కష్టమో! ఢిల్లీలో
కూడ, అలస్యము వల్ల రాత్రి 7-8 గంటలు అవస్థపడాల్సి వచ్చింది. సమాచారం కూడ
చక్కగ ఇవ్వరు. ఒక అధికారి వెక్కిరింతగ, "మీలాంటి వాళ్ళంత అక్కడ గుంపున్నరు.
మీరు వాళ్ళని కలవండి", అని వెళ్ళిపొయాడు.
అక్కడ యునివర్స్తిటి ఆఫీసులో కూడ అవసరమైన సమాచారము ఇవ్వడానికి ఒకావిడ
తీసుకున్న శ్రద్ధ నేను మర్చిపోను. తన దగ్గర సమాచారము పూర్తిగ లేకపోతె, వేరె ఒక
రిద్దరికి ఫోన్ చేసి కనుక్కొని మరీ చెప్పింది. ఎప్పుడు ముఖంలో చికాకు లేదు. చక్కటి
చిరునవ్వు. మన దగ్గర ఎన్నోసార్లు నేను పనిమీద ఆఫీసులకు వెళ్ళాను. వాళ్ళ
స్థానంములో, వాళ్ళసమయములో వుండరు. వున్నా, సమాధానము సరిగ్గా ఇవ్వరు.
మళ్ళి రమ్మంటారు.లేదా ఇంకెక్కడికో వెళ్ళాలని చెప్పుతారు. మరి ఆక్కడైన పని
అవుతుందా అంటె నాకెం తెలుసని విసుక్కుంటారు. వాళ్ళ ఉద్యోగము ఆ పని
చేయటానికేనని మర్చి, చేసె పనికివచ్చినవాళ్ళు ఏమి ముట్టచెప్పాలో నిర్మొహమాటంగ
వినిపిస్తారు. ఎక్కడో ఒక్కరు ఉద్యోగ నిబద్ధులు వుంటారు. అదృష్టముంటే తటస్థ పడుతారు.
మర్యాదగ పక్కవాళ్ళతో వ్యవహరించె తీరు అక్కడ నేర్చుకోవల్సిందే. మన పక్కవాడు
మన కంటే తక్కువకాదని తెలుసుకుంటే మనము కూడ చక్కగానె ప్రవర్తిస్తాము. కాక
పోతే మనలో ప్రతి ఒక్కడు ఏదో కారణంగ తను మాత్రమే ఘనుడని, చట్టానికి అతీతుడని,
లేదా పరిస్థితులను manage చేయగలననే భావము ఎక్కువేమో. అందుకు పక్క
వాడిని తక్కువగ చూడటం.
సరే. ఆ విషయం ఇక వదిలేస్తాను. అక్కడ Hollywoodలో Universal
Studiosలో తీసుకున్న కొన్ని ఫోటోలు మీ ముందు పెడుతాను.
| Internal bus for the tourists |
| Cartoon character entertaining the visitors Another Wizard helping a tourist in the wheel chair. |
| Water settings, river, lake... |
| Plane crash and ruins |
|
|
| Jurassic park |
Presenting picturisation |
| Enacting a scene from 'Psycho' |
| Home in a forest or along side the sea. Behind the green screen they create water settings |
| Fairy land |
No comments:
Post a Comment