ఆకాశ వీధుల్లో |
పై నుండి చూస్తే షికాగో నగరము
షికాగో లేక్ |
షికాగో నదిలో షికారు చేస్తూ తీసినది కార్ పార్కింగ్ భవనాలు |
| షికాగో భవనాలు (డౌన్ టౌన్ ) |
షికాగో భవనాలు (డౌన్ టౌన్ ) ఎదురు భావనల నీడలను
అద్దాలలో చూడవచ్చు
ఇక్కడ ప్రతి ఏడు ఒక కొత్త విగ్రహము పెడతారు 2012 లో మార్లిన్ మన్రో వుంది |
2012 మే మొదటి వారములో షికాగోలో రాత్రి పావు తక్కువ 8గం. లకు సూర్యాస్తమయ దృశ్యం |
హాలివుడ్ తారల నివాస స్థలము
బివర్లి హిల్స్
హాలివుడ్ వీఢులో - చైనా థియేటర్
చైనా థియేటర్ ద్వారము
హాలివుడ్ వీధుల్లో - దూరంగ కనిపించేది రూస్వెల్ట్ హోటల్.
మార్లిన్ మన్రో మొదటి ఫోటో షూట్ ఇక్కడె స్విమ్మింగ్ పూల్
దగ్గర జరిగిందట.
బైట దేశములో వున్నప్పుడు ఇండియ పేరు చూస్తె ఎంత
ఆత్మీయంగా అనిపిస్తుందో !
ఇక్కడ హాలివుడ్ తారలు ఎక్కువగా షాపింగ్ చేస్తారట.
ఆక్కడ ఏదో ఫొటొ షూట్ అవుతుంటే త్రాలిలో కూర్చున్న అందరు
క్లిక్ మనిపించారు. నేను కుడా ...
Santa - Monica వెళ్ళే దారిలొ..
Santa Monica దగ్గర, ఆ రాతి మీద ఆ బొమ్మ నాకు నచ్చింది
Santa -Monica బీచ్ వెళ్తు |
నయాగర జలపాతము, ఒక్కసారైనా చూడవలసినది
ఎన్ని ఇంద్ర ధనస్సులో
ఆ జలపాత హోరు ఎంతనో
జీతం ఎంత వున్నా 'గీతం' అంటె ఆశే కదా |
USAలో జన సాంద్రత తక్కువ. జనాభ తక్కువ, వైశాల్యం ఎక్కువ,
ప్రకృతి వనరులుఎక్కువ, వాటి సద్వినియోగము ఆ దేశాన్ని సంపన్న
దేశంగా చేసింది. అక్షరాస్యత శాతం ఎక్కువ వుండి, ప్రజల్లో ఆరోగ్యం
పట్ల అవగాహన బాగా వుంటుంది. పరిశుభ్రత బాగా పాటిస్తారు. ఎటు
దారిలో వెళ్ళినా, ఏ సంస్థల్లోనైన చెత్త చేదారము బూజులు వెలాడుతు కనబడదు.
రహదారుల్లో ఎప్పుడైన కనబడె చెత్త ఎదైన వుందంటె, అది ఎండుటాకులు, రాలిన
పూలు మాత్రమే. జనాలు నడుస్తు రోడ్ల మీద చాల తక్కువ చూస్తాము.
మనుషులను చూడాలంటె, అది మార్కెట్టో, టూరిస్ట్ ప్లేసో, ట్రాన్స్పోర్ట్
స్టేషనో, రెస్టారెంటో అయి వుండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటె, కార్లె కనబడ
తాయి. అక్కడ పెద్ద, పెద్ద కార్లు చూసినా, వాళ్ళు వాడే డిస్పోసబల్స్,
టిష్యూస్ చూస్తె, ఈ భూమి మీద వాళ్ళు పర్యావరణానికి కలిగించె నష్టం
అత్యధికమని అర్థమైతుంది. అయినా, వాళ్ళు అహారం ఖరిదైందంటె,
భారతీయులు ఈ మధ్య ఎక్కువ తింటున్నారని, పెట్రోల్ ధర పెరిగిందంటె
చైనీస్,ఇండియన్స్ కార్లు ఎక్కువగా కొంటున్నందువలనే పెట్రోల్ ధర
పెరుగుతుందని, ఒజోన్ పొర నాశనమౌతుందని మనల్ని అంటారు.
అక్కడ కంటె ఉన్నతంగ మన దేశమును అభివృధ్ది చేయలేమా?
మనకున్న ప్రకృతి, మానవవనరులను సక్రమంగా వాడుకుంటే, మనము
అంత కంటే గొప్పగ బ్రతకవచ్చు. మన రాజకీయనాయకులు అవినీతిని
ఒక 50% తగ్గించుకున్నా, విదేశి బాంకుల్లో ధనాన్ని మురుగబెట్టే బదులు
దేశ మౌళిక అవసరాల కోసము ఖర్చు పెడ్తె గర్వంగా మనం ప్రపంచాన్ని
శాసించె స్థాయికి చేరుకోవటానికి ఒక దశాబ్దము చాలు.
No comments:
Post a Comment