Sunday, May 5, 2013

Graduation ceremony





Administration Building UIC 
90 దశకము తర్వాత నుండి, మన దేశము నుండి అమెరిక వెళ్ళె
వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది.  ఐ.టి రంగంలో వచ్చిన విప్లవము
వల్ల ఇంజనీరింగ్ చదివిన చాల మంది యువకులు, ఐటి విద్య నేర్చిన
ఇతర డిగ్రీలు చదివిన వారు కూడ అమేరికాకు వలస వెళ్ళారు. ఈ
సహస్రాబ్ధి తొలి నాటి నుండి అమ్మాయిలు కూడా వెళ్తున్నారు.  అక్కడ
మంచి అవకాశాలు రావాలని, అక్కడి మాస్ట్ర్ ర్స్ డిగ్రీకి ప్రాముఖ్యత
పెరిగి, ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత మాస్ట్ ర్స్ కు అక్కడకు పోవడం
చాలా సామాన్య విషయంగా మారింది.  మధ్యతరగతిలో, కిందా
మీదా పడి, ఏదో ఒక విధంగ అమెరి్కాకు పిల్లలను పంపితే ఆ తర్వాత
భవిష్యత్తు బంగారుమయమనె భావం స్థిరపడింది.  లోన్లు తీసుకొని
వారిని అక్కడకు పంపటము, ఆ తర్వాత పిల్లలు అక్కడ చదువుకుంటు
ఎంతో కొంత సంపాదిస్తు, వారి లోన్లు తీర్చెసుకోవటమేకాక తల్లిదండ్రులుకు
కుటుంబానికి అర్థికంగ కూడా సహాయ పడుతున్నారు.  అక్కడ ఉద్యోగం
సంపాదించి స్థిరపడ్డ పిల్లల తలిదండ్రుల ఆర్థికంగ ఉన్నత స్థాయి చేరుకున్నారు.
కాని, పిల్లలు చదివుకునే రోజుల్లొ ఎంత కష్టపడుతున్నారో చూస్తె అలా పంపి
స్తారో లేదో.  ముగ్గురు, నలుగురు కల్సి ఒక అపార్ట్ మెంటులో వుంటు, మంచాలు,
సరైన పరుపులు లేక వుండటము, కుర్చీలు, బల్లలు లేక గోడలకు చేరబడి
చదవడం చూస్తె తప్పక బాధ కలుగుతుంది.  ఇక్కడ నామోషిగా భావించే పనులు,
ఆదాయం కోసం అక్కడ సంతోషంగా చేస్తారు.  పెద్ద పెద్ద డిగ్రీలు చదివి పెట్రోల్ బంకులో
పనిచేయటము, హోటల్ లో వెయిటర్ గా/వెయిట్రెస్ గా పనిచేయటము ఎంత సాధారణ
విషయమో.  ఒక రకంగ బాధ అనిపించినా, అలోచిస్తె ఇది మంచిదె అనిపిస్తుంది.
సొంత కాళ్ళమీద నిలబడి వారి సంపాదనతో చదువుకోవటం మంచి పనే కదా.
 శ్రమశక్తిని గౌరవించటము, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించటము నేర్చుకుంటారు.  జీవితము
అంటె కర్మ అని, శక్తి వుండి పని చేయనివాడు బ్రతకడానికి అనర్హుడనె ఙ్ఞానమ అక్కడ
వారికి బాగానె తలకెక్కుతుంది.  ఇంత కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకోవడము గొప్ప
 విషయమే కదా!  అందుకనే అక్కడ డిగ్రీ ప్రధానోత్సవాన్ని చాలా ఘనంగ జరుపుకుంటారు.
 మామూలుగ అమెరిక వెళ్ళెందుకు్ వీసా దొరకటము కష్టమైనా, ‘గ్రాడ్యుయెషన్ సెరిమొని’
అప్పుడు మాత్రం అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్ర్లులు ఏ దేశము వారైన వీసా
 ఇచ్చెస్తారు.  అక్కడ వారి తల్లిదండ్రులు ఎలాగు ఆ ఉత్సవానికి వస్తారు.  వారి సంస్కృతిలో
 జీవిస్తు, వారి జీవితాలు స్వంత కాళ్ళ మీద బ్రతుకుతు డిగ్రీ పూర్తి చేయటం,ఘనమైన
 విషయమె.  నేను ఈ గ్రాడ్యుయెషన్ సరిమొనికి వెళ్ళాను.  ఒక విద్యార్థి తరఫున 8 మంది
కంటె ఎక్కువ రాకపోతె నయమని, అందుకు ఆడిటోరియం స్థలం సరిపోవక పోవచ్చని తెలిపారు.
 అక్కడి ఏర్పాట్లు, ఉత్సవము చూడవలసిందె.  డిగ్రి ప్రధానం తర్వాత అల్పాహార విందు ఏర్పాటు
భోజన ప్రియులకు మరో ఉత్సవంగా వుంటుంది.  ప్రతి ఏర్పాటులో శ్రద్ధ, క్రమశిక్షణ కనబడుతుంది. 
ఆ గ్రాడ్యుయెషన్ సెరిమొని నా జీవితములో ఒక మరపురాని మధుర ఘట్టము.
 
 







 UIC, Graduation Ceremony
         5-5-2012

 

No comments:

Post a Comment