Saturday, May 25, 2013

Heat Wave

మండే కాలం
"Heat waves tend to be the silent and invisible
killers of silent and invisible people".

ఎండలు మండుతున్నాయ్.  ఎన్నో జీవితాలను బుగ్గి
చేస్తున్నాయ్.  ధనాశతో, దురాశతో, తమ సౌఖ్యం కోసం
పర్యావరణాన్ని నాశనం చేసేది బడాబాబులు.  దాని వలన
వచ్చె అనర్థాలకు బలి అయ్యేది బడుగు జీవితాలు.  ప్రభుత్వానికి
కావలసింది సామాన్య ప్రజల సంక్షేమమా లెక ధనవంతుల/
పారిశ్రామిక/వ్యాపారవెత్తల ప్రాపకమా?  ప్రగతి, అభివృద్ధి
పేరుతో ఎక్కువగ లాభం పొందేది ధనిక/రాజకీయ/
పారిశ్రామిక వ్యాపార వర్గమే.  సంక్షేమ పథకాలకు డబ్బు కావలంటె
దానికి అతి సులువైన మార్గము మద్యపానము ప్రోత్సహించటమైతె,
అది ఏ ప్రజల అభివృద్దికి దోహదం అవుతుంది?
ప్రతి  యేడు ఎండలు కనీసము అదివరకంటె ఓ రెండు డిగ్రీలు
అధికంగా నమోదు అవుతున్నాయ్.  ఓ యేడుకు మించి
మరో యేడు జనం వడదెబ్బకు చనిపోతున్నారు.  అయిన
ప్రభుత్వము ప్రజల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న
దాఖలాలు ఏమి లేవు.  సామాన్యంగ పైకి/ప్రపంచమంతటికి
కనిపించే  ప్రకృతి వైపరిత్యాలు - వరదలు, భూకంపము వంటివి ఎక్కువగ
పేద, మధ్యతరగతుల వారిని కొంతవరకు, తక్కువసార్లు ‘ఉన్నత’
వర్గాలను కూడ నష్ట పరుస్తుంది.  ఈ వడగాలుల వలన మాత్రం
పేదవారె సామాన్యంగ మరణించటము జరుగుతుంది.  రాష్ట్రములో
వడదెబ్బకు రోజుకు వందల్లో జనము చనిపోతున్నా రాజకీయనాయకులు
దీని గురించి ప్రభుత్వం పై ఎలాంటి వత్తిడి తీసుకురాక పోవటము వారికి
ప్రజల పట్ల, వారి సంక్షేమము పట్ల వున్న శ్రద్ధను తెలియ జెస్తుంది. 
ఇది ఒక ఆరోగ్య ఆత్యవసర పరిస్థితిగా గుర్తించి, ప్రజలు ఎండల్లో
బైటకు రావద్దని, పొరపాటున బైటకు వస్తె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో
రేడియో, టివి, వార్తా పత్రికలు, SMSల ద్వార విస్తృత ప్రచారం చేయలి.
వడ దెబ్బకు మరణించిన కుటుంబాలకు, ప్రకృతి వైపరిత్యాలుకు గురి అయిన
వారికి సహాయము చేసినట్లే సహాయము అందించాలి.


*తప్పనిసరి అయితె తప్ప ఎవరు, ఇప్పటి పరిస్థుతుల్లో ఉదయం పది
నుండి సాయంత్రము ఐదు గంటలవరకు అసలే బైటకు వెళ్ళొద్దు. 
*బైటకు వెళ్ళాల్సి వస్తె, తేలికైన సరైన ఆహారము తీసుకొని, నీళ్ళు తాగె
వెళ్ళాలి.  లేత రంగు వదులైన పూర్తి నూలు దుస్తులే వేసుకోవాలి.
చలువ కంటి అద్దాలు వుంటె పెట్టుకోవాలి.  టోపి పెట్టుకోవాలి.  గొడుగు,
లేత రంగుదైతె మరీ మంచిది.
*మంచినీళ్ళ  బాటిల్ 700-800mlది దగ్గర పెట్టుకొని మాటి మాటికి
నీళ్ళు తాగాలి.  నిమ్మరసం లాంటివి వున్నా మంచిదే. 
రుమాలు తడి చేసుకొని, మధ్య మధ్యలో ముఖము చేతులు తుడుచు
కుంటుండాలి.

*ఇంట్లో వున్నా పిల్లలకు, బలహీనంగా లేదా జబ్బుతో వున్న వృద్ధులకు
వడదెబ్బ తగలొచ్చు.  వారు పలచటి, వదులు నూలు దుస్తులు ధరించి
మాటి మాటికి  నీళ్లు తాగటము, తడి గుడ్డతో ఒళ్ళు తుడుచుకోవటము

చేయాలి.  ACలు, air coolers ఉన్నవాళ్ళు ఏలాగు వాటిని
సద్వినియోగం చేసుకుంటారు.  వాళ్ళకు ఈ బాధ సామాన్యంగా వుండదు.

*వడదెబ్బకు తొలి సూచన ఒళ్ళు బాగా వేడెక్కటమెకాక, కాస్త పరాకు కూడ
మొదలౌతుంది.  వడదెబ్బ అనుమానం రాగానె, ఆ వ్యక్తి బట్టలన్ని తీసేసి
ఎత్తు తక్కువ ఉన్న నీటి తొట్టిలో పడుకొబెట్టాలి.  తల, మోచేతుల నుండి
అరచేతులు, మోకాళ్ళనుండి పాదాల వరకు మాత్రమే బైట వుండాలి.  మిగిలిన
శరీరమంతా నీటిలో మునిగి వుండాలి
.  అలా కుదరని పక్షంలో వడదెబ్బ తగిలిన
వ్యక్తి మీద నీళ్ళు పోస్తు ఫాన్ గాలి తగిలెటట్టు పెట్టడమో, గాలి బాగా ఊపడమో
చేయాలి.  లేదా కుదిరితె ఐసు ముక్కలనుగుడ్డలొ చుట్టి చంకలో, గజ్జలలో పెట్టి,
పొట్ట వెన్నలో ఐసుతో రుద్దటము చేయాలి
.  శరీర వేడి కొంత తగ్గాక డాక్టర్ దగ్గరకు
తీసుకెళ్ళాలి.

ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటె వడదెబ్బ వలన ప్రాణాపాయము జరగకుండా
చూసుకోవచ్చు.
 

No comments:

Post a Comment