ఎన్నికలలు
మండె ఎండలు ఇప్పుడిప్పుడె తగ్గు ఓ దిక్కు తగ్గు ముఖం
పడుతుంటె ఎన్నికల వేడి మెల్లమెల్లగా ఎక్కువైతుంది.
ఆంధ్రప్రదేశ్‍లో పార్లమెంటు,అసెంబ్లి ఎన్నికలకు ఎక్కువలో
ఎక్కువగ ఒక యేడాది వుంటె, తక్కువలోతక్కువగా అర్నెల్లు
వుంటుంది. ఈ మధ్యలో బలాబలాలు తెలుసు(తేల్చు)
కోవడానికి పంచాయతి, స్థానిక సమరము షురు కానున్నది. పార్టిలన్ని
ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలకి సిద్ధమౌతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్ల్లో, తెలంగాణ రాష్ట్రము
అతి ముఖ్యఎన్నికల అంశము కానున్నది.
తెరాస, తెలంగాణ రాష్ట్ర ఎర్పాటే ఎకైక లక్ష్యంగా ఉద్యమము/పని చేస్తున్న
పార్టిగాతెలంగాణ ప్రజల గుర్తింపు పొందిన తెలంగాణ పార్టి.
ఈ పార్టి తెలంగాణ ప్రజాసమస్యల గురించి ఎక్కువగా ఉద్యమించక
పోయినా, తెలంగాణ వనరుల గురించి, హక్కుల గురించి
అసెంబ్లిలో మాట్లాడె ఎకైక పార్టి. తెలంగాణా ప్రజలకు కెసిఆర్, తెరాస
పట్ల ఎంతఅసంతృప్తి ఉన్నా, తెలంగాణా ఏర్పాటుకు దానిని నమ్మక
తప్పట్లేదు. సమస్య సాధనకు యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి
ఎదగటము తప్పనిసరె. అందుకని అయిష్టంగానైన ఎన్నికల్లో తెరాసకు
ఇతర పార్టీల కంటె ఎక్కువ శాతం ఓట్లు వస్తాయి. కాని నిలబడ్డ
అభ్యర్థిని బట్టి గెలవటము వుంటుంది. ఇది ఎమ్మెల్సి ఎన్నికల్లో
అనుభవమైన విషయమే.ఇక బిజెపి, కాంగ్రెస్ - దొందొ దొందె.
ఆ రెండిటి ధ్యేయం కేంద్రములో అధికారాన్ని కైవసముచేసుకోవటమే.
ఆ రెండు పార్టిల స్టాండ్ వాటికున్న మెజారటి బట్టి వుంటుంది.
ప్రస్తుత పరిస్థితిలోఏ ఒక్క పార్టికి ప్రభుత్వాన్ని ఒంటరిగ ఏర్పర్చ
గలిగినంత మెజార్టి రావటము సాధ్యపడని కలే.ఇప్పుడు యుపియె
ఉన్న స్థితి మళ్ళి యుపియె వచ్చినా ఎన్డెయె వచ్చినా వుంటె కథ మళ్లి
మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిలో తెరాసకు అత్యధిక ఎమ్మ్లెలె, ఎమ్పి
సీట్లు వుంటె, కింగ్మేకర్‍గా కెసిఆర్, టి.అర్.ఎస్‍కు బేరసారాలకు అవకాశము
వుంటుంది. ముల్లెల సంగతి పక్కనపెడితె, తెలంగాణ అంశము తేల్చేటట్లు
(రాష్ట్ర ఏర్పాటుకు) కట్టుబడి వుంటే, కెసెఆర్ స్థానంతెలంగాణ ప్రజల గుండెల్లో
ఓ ప్రజా నాయకుడుగా, తెలంగాణ సాధకుడిగా స్థిరపడుతుంది.
కేవలం ముల్లెలు మూటకట్టుకోవటములో తెలంగాణా సాధన పక్కన పెడితే
ప్రజలు అతను మరో చెన్నారెడ్డిగా గుర్తుపెట్టుకొని రాజకీయ జీవితానికి,
తెరాసకు సమాధి కడతారు.కమ్యూనిస్ట్ పార్టిల గురించి ప్రస్తుతము
ఎవరు పట్టించుకోరనె అనిపిస్తుంది. తెలుగుదేశంపార్టి - చంద్రబాబు,
తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిపోయింది. తాను గెలిస్తె ముఖ్యమంత్రిగా
తాను మొదట చేసె పని అసెంబ్లిలో తెలంగాణ బిల్లు పెడ్తానని స్వయంగా
చెప్పినా బాబును ఎవరునమ్మరు. ఎన్టిఆర్ పెట్టిన పథకాల పేరు చెప్పి
అధికారములోకి వచ్చి, ఆ పథకాల పేరుతో పన్నులు కూడా పెంచి,
ఆ తరువాత కూల్‍గా అన్ని పథకాలకు తిలోదకాలు ఇచ్చాడు.
తెలంగాణ విషయములో కూడా పూటకో మాట మార్చేవాడిని ప్రజలు
ఎట్లా నమ్ముతారు? చివరాఖరకు తెలంగాణ వాదము వినిపించాలన్నా,
తెలంగాణ సాధనలో ఓ అడుగు ముందుకు పడాలన్న తెరాసను
గెలిపించాల్సిన అవసరము, బాధ్యత తెలంగాణ ప్రజల పైన వుంది.
*************************************
కెసిఆర్‍కు ఉద్యమము పట్ల నిబద్ధత లేదు, కేవలము రాజకీయ లాభం,
కుటుంబ స్వార్థం కోసమేప్ర్జజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, లేని
ఉద్యమము పేరుతో వసూళ్ళకు పాలుపడుతున్నాడని
ఇతర రాజకీయ పార్టిలు, కొన్ని ప్ర్జజా సంఘాలు కెసిఆర్‍ను విమర్శిస్తున్నాయి.
కాని తెలంగాణకు సంబంధించిన ఆయా పార్టినేతలు, ప్రజాసంఘాల నేతలు
ఎప్పుడైన తెలంగాణ కోసం స్వంతంగా ఉద్యమము చేసాయా? కెసిఆర్/తెరాస
ఉద్యమము చేస్తుంటె మమ్మల్ని కలుపుకోవట్లేదని అంటాయి.
వాళ్ళకై వాళ్ళు స్వంత ఉద్యమ కార్యాచరణ చేసి విజయవంతము
ఎందుకు చేయలేక పోతున్నరు? ఒక ఆశయముతో పార్టి పెట్టి, దానిని
నడిపిస్తు, తన వ్యూహా శక్తితో ముందుకు తీసుకొని వెళ్ళుతున్న
వ్యక్తి తనకు నచ్చిన వాళ్ళనే కలుపుకుంటాడు కద! అతని పంథా నచ్చి
అతనివల్ల వాళ్ళకు లబ్ధి చేకూరుతుందని ఆశ పడె వాళ్ళు అతనితో
కల్సి నడుస్తారు. నచ్చని వాళ్ళు, వాళ్ళ అనుకున్న ఫలితము రాకపోతె
బైటకు వచ్చెస్తారు. అన్ని పార్టీల్లో జరిగేది అదె కాదా? అన్ని పార్టీలు
కూడా
ఖుల్లంఖుల్ల్లాగా ఎమ్మెల్యె సీటుకు ఎంత కావాలో, ఎమ్పికి ఎంత
డబ్బు కావాలో ముందే చెప్పట్లేదా?డబ్బువున్నవాళ్ళకు, పారిశ్రామిక
ధనసామ్యవాదులకు రాజ్యసభ సీట్లు కట్టబెట్టడము, పార్టి నడిపించా
లంటే డబ్బు కావాలి కాబట్టి ఇది తప్పదని ఒక పార్టి అధినేత స్పష్టంగా
చెప్పాడు. ఆ పార్టీలకు అవసరమైనట్టు తెరాసాకు కూడ అవసరమె కదా.
మళ్ళి మాట్లాడితే తెరాసకు డబ్బు అవసరము
ఎక్కువె. ఎందుకంటె, ఉద్యమము చేయడానికి, పార్టి శ్రేణులను
కదిలించటానికి, ఉద్యమములో అరెస్ట్ అయితె విడిపించటానికి
డబ్బు చాలానె కావాలి.
ఏ రాజకీయ పార్టి అయినా ఎన్నికల్లో
నిలుచున్నపుడు గెలవాలని, అధికారంలోకి రావాలనె కోరుకుంటుంది.
ఇందుకు తెరాస మినహాయింపు కాదు. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టిలు,
మతమె పునాదిగ, ఒక వర్గానికుప్రతినిధిగా పార్ట్టీలు వున్నాయి.
తెలంగాణా ప్రజలకు ఒకటి వుంటె తప్పేంటి? ఏ పార్టీలో వున్నా పేదలు
బడుగలు జెండా మోసుడె. ఆ స్థితి పోవాలంటె మరో ఉద్యమము తప్పదు.
అంబేద్కర్, పూలే, కాన్షిరాంలాంటి నేతలు మళ్ళి రావలసిందె.
తెలంగాణ ఉద్యమములో బడుగుల రాజ్యధాకారము ఒక కోణమైన,
అది విభిన్నమైనది. దానికి తెలంగాణలోనె కాదు, దేశ వ్యాప్తతంగా
ఉద్యమించాల్సి వుంది. అది ప్రస్తుతము నిశబ్దంగా వుంది.
ఊపందుకునే సమయము దగ్గరలోనె వుంటుందని భావిస్తున్నాను.
తెలంగాణకు స్వంత రాజకీయ అస్తిత్వము, తెలంగాణలో ప్రజాస్వామిక
హక్కుల పరిరక్షణకు కట్టుబడి వుండె స్వతంత్ర రాజకీయనాయకుల
అవసరము ఎంతో వుంది. అది తెలంగాణ ప్రాంతీయ పార్టీ వల్లనే
సాధ్యపడుతుంది. జాతీయ పార్టీల అవసరాలు ప్రాంత ప్రజల అవసరలకు,
ప్రజాస్వామ్యబద్ధమైన విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ప్రాంతం
కోసమ్ ప్రాంతీయ పార్టీలు ముందు నిలిచి ప్రజాభిష్టాలకు అనుగుణంగా
నడవాల్సి వస్తుంది. ప్రస్తుతము తెలంగాణలో తెలంగాణ కోసం
తెలంగాణ కొరకు పనిచేస్తున్నపార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి.
అన్ని ఎన్నికల్లో ఈ పార్టీని గెలిపించి తెలంగాణ అస్తిత్వము చాటుకోవలసిన
అవసరము తెలంగాణ ప్రజలకు వుంది.
ఇది
‘ఇజ్జత్ కా సవాల్’.
**************************************************
రాజకీయనాయకుళ్ళలో అధికార కాంక్ష ఎక్కువె. అసలు రాజకీయల్లోకి
వచ్చేది అందుకు. ఒకప్పుడు ప్రతి పార్టికి కొన్ని ప్రాథమిక నియమ
నిబంధనలు, రాజ్యముకు సంబంధించిన వివిధ విషయాల గురించి
స్పష్టమైన విధానాలు వుండి దానికి కట్టుబడి సభ్యులందరు ప్రవర్తించెవారు.
ఇప్పుడు అన్ని పార్టీల విధానము అధికారానికి రావటమే. ఎన్నికల్లో
గెలవటము ప్రధానము. అధికారాన్ని చేజిక్కించుకోవటమే ఆశయము.
అందుకోసం గుండాలకు, రౌడి షీటర్లకు, ఒట్లు కొనగలిగిన ధనవంతులకు,
ఇతర పార్టిలనుండి బహిష్కృతులై వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారు.
ఆయా వ్యక్తుల వ్యక్తత్వానికి, వ్యక్తిగత చరిత్రకి ఎలాంటి ప్ర్రాధాన్యము
వుండట్లేదు. పార్టీలన్ని కూడ ఇప్పుడు వ్యక్త్లులవి. మళ్ళి మాట్లాడితె
ఒక వర్గానికి చెందినవిగా ఉంటున్నాయి. భాజపాను, కమ్యూనిస్ట్ పార్టిలను
పక్కన పెడితె ఇప్పుడు దేశములో వున్న పార్టీలన్ని, నాకు తెలిసినంత
వరకు, ఒక వ్యక్తికి లేదా కుటుంబానికి చెంది, ఆ వ్యక్తి లేదా కుటుంబ
అజమాయిషిలో నడుస్తున్నవె. గొప్పగా చెప్పుకునె నేటి కాంగ్రేసు
ముఫ్ఫై ఏళ్ళ క్రితం అసలు కాంగ్రేసు నుండి చీలి ఇందిర కాంగ్రెసుగా ఏర్పడిందె.
ఇప్పుడున్నది ఇందిరా గాంధి కుటుంబ కాంగ్రేసె కాని అసలు సిసలు
జాతీయ కాంగ్రె సు కాదు. దానిపై ఆ కుటుంబ పెత్తనము ఎలాగు వుంటుంది.
మన రాష్ట్రములో వున్న పార్టీలు, దేశములో ఇతర రాష్టాల్లో వున్న
పార్టీలన్ని కూడా వ్యక్తులకు, కుటుంబాలకు చెందినవనికాస్తా ఆలోచిస్తె
అందరికి అర్థమౌతుంది. ఆయా పార్టీల్లో చేరిన వాళ్ళు ఆ వ్యక్తులకు,
కుటుంబాలకు అనుకూలంగా పనిచేయల్సిందే. లేదంటే బైటకు
వచ్చేయాలి. ధనము, దమ్ము వుంటె కొత్త పార్టి పెట్టి నడిపించాలి.
బడుగులెవ్వరు పార్టి పెట్టి నిలదొక్కుకోలేక పోవటము విచారకరము.
దీనికి కారణాలేంటో వారు విశ్లేషించుకొని ముందడగు వేయాలి.
********************************************
ఈ మధ్యే కొంతమంది జాతీయ పార్టీ గా గుర్తింపు వున్న కాంగ్రెసు నుండి
ప్రాంతీయ పార్టి అయిన తెరాసలో చేరారు.తెలంగాణా మీద ప్రేమతో
కాదు, వారి రాజకీయ భవిష్యత్తు కోసమేనని ప్రజలకు తెలుసు.
అందులోను ఒకరిద్దరు ‘తెలంగాణా తొలి ముఖ్యమంత్రి’ (అది
ఎన్నాళ్ళుంటుందో) పదవి కోసమే చేరారన్నది బహిరంగ రహస్యము.
(ఇంతకుతెలంగాణా వచ్చుడు ఖాయమా?). వాళ్ళలో ఒకరు చురుకుగ
తెరాస శిక్షణ శిబిరాల్లో పాల్గొంటున్నారు. కెసిఆర్‍ను మించి మాట్లాడాలనే
అత్యుత్సాహామేమో! తెలంగాణా ఇస్తె మెడ కోసుకుంటాడట!
నాయకులు ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడటము మానెయ్యాలి.
వాళ్లు ఏదో గొప్పగా మాట్లాడుతున్నామని దాని ప్రభావము మానసిక
పరిపక్వత లేని వారి మీద ఎలా వుంటుందో ఆలోచించకుండా
మాట్లాడుతారు. చివరకు వారిని నమ్మిన అమాయక యువకులు
ప్రాణాలు తీసుకుంటారు. ఇప్పటికె తెలంగాణా ఎంతోమంది అమాయక
యువకులను కోల్పోయింది. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టలి.
నాయకులెవ్వరు, ఎట్టి సందర్భములో కూడా ‘తలకాయ తీసుకుంటా,
మెడకాయ కోసుకుంటా’ మరే విధంగా `ప్రాణ త్యాగము' అన్న మాటే
తీసుకురావద్దు. జీవితములో ఏదైనా సాధించాలంటే కృషి,
పోరాటమే మార్గమని చెప్పాలి.
ప్రాణత్యాగముతో సమస్య పరిష్కారము కాదు.
కృషి, పోరాటాముతోనె జీవితములో ఏదైన సాధ్యము.