ఈ కోవిడ్ కాలములో ఏ కాస్త జ్వరం వచ్చిన, దగ్గు వచ్చిన ‘అదేనా’ అని భయం. పక్కవాడు తుమ్మిన, దగ్గినా కోపము, భయం. ఇంత భయపడే వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారే అంటే తక్కువే. కోవిడ్ అతి సూక్షమాతిసూక్ష్మతర జీవికాని జీవి, గాలి ద్వారా వస్తుంది కాబట్టి అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
కోవిడ్ నిబంధనలు మన జీవితములో భాగం కావాల్సిందే. మొదటి సారి వచ్చినప్పుడు ‘ఇలాంటివి వస్తాయి, పోతాయి, మనం మాత్రం ఎప్పటికీ వుంటా’ మనుకున్నాము. ఏదో పొరపాటుగా పోయిన
వాళ్ళు పోయినా మనది మాత్రము ‘గట్టి ప్రాణం’ అని సంతోషపడ్డము. కానీ రెండో ఉధృతిలో
అయితున్న మరణాలు అందరికి వణుకు పుట్టిస్తున్నాయి.
మొదటి విడుత ఎక్కువగా వయస్సు 50సం. కంటే ఎక్కువ వున్నవారు, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలున్నవారు పోతే, ఇప్పుడున్న రెండో
ఉధృతిలో తక్కువ వయసున్నవారు, వయస్సులో వున్నవారు, ఇంతకుమునుపు ఏ జబ్బులేనేవారు, ఇంటికి ఒకరికి మించి చనిపోవడము
అందరని భయాందోళనలకు గురిచేస్తుంది. అయినా ఇప్పటికీ
కూడా ప్రజల్లో చాలా నిర్లక్ష్యమే వున్నది.
టీకా వేసుకున్నా కూడా అది సంజీవని కాదు. కాబట్టి తప్పనిసరిగా అందరరు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే---
– అవసరమైతేనే బయిటకు వెళ్ళటము,
వెళ్ళిన చోట భౌతిక దూరం పాటించటము,
తప్పనిసరిగా మాస్కు ధరించటము,
మాట్లాడేటప్పుడు అస్సలే మాస్కు తీయకుండా వుండటము,
తినేటప్పుడు మౌనంగా తినటము,
బైటకు వెళ్లినప్పుడు చేతులు పరిశుభ్రంగా వుండటముకోసం సానిటైసర్, సానిటైసర్ ఎక్కువసార్లు వాడాల్సిన
అవసరము వుంటే చేతులకు గ్లౌసు తొడుక్కోవాలి. వాటిపైనే సానిటైసరును వాడుతువుండాలి.
చాలా సమయము రద్దీలో గడపల్సిన పరిస్థితి వుంటే ముఖానికి షీల్డు-
ముఖ కవచము పెట్టుకోవటము శ్రేయస్కరము.
పైన చెప్పిన కోవిడ్ నిబంధనలు, వాటివలన కోవిడ్
వ్యాప్తి ఎలా అపవచ్చు అందరికీ అవగాహన వచ్చింది. అయిన కేవలము నిర్లక్ష్యముతోనే రెండో ఉద్ధృతిలో ఎంతోమంది
ప్రియబాంధవులను కోల్పోతున్నాము. మనమంతా తెలుస్కోవాల్సింది, అర్థము చేసుకోవాల్సింది ఏమంటే ఈ కోవిడ్ జబ్బు ఇప్పట్లో పోయేది కాదు. ఎక్కువగానో తక్కువగాను ఎప్పటికీ వుంటుంది. మూడో ఉధృతి వస్తుంది అని ఒక దిక్కు అనుకుంటుంటే, ప్రపంచములో ఓ చోట నాలుగో ఉద్ధృతి కూడా మొదలైనదట! హెచ్1ఎన్1 ఇన్ఫ్లూఎంజా వచ్చింది, ఇప్పటికీ కూడా ఎక్కడో అక్కడ ఇంకా వస్తూనే వుంది. కానీ దాని వ్యాప్తి, తీవ్రత
కోవిడ్ 19 తో పోలిస్తే చాలా తక్కువ.
మన దేశ జనాభా, జనసాంద్రత పాశ్చాత్య
దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. మన ప్రభుత్వం
ప్రజా ఆరోగ్యం మీద పెట్టె ఖర్చు చాలా తక్కువ.
కోవిడ్19 వంటి జబ్బలుకు చికిత్స చేయాలంటే ఎన్నెన్నో మౌలిక వసతులను మెరుగు పరచాలి.
ఎంతోమంది డాక్టర్లు, ఆరోగ్యసిబ్బంది అందుబాటులో వుండాలి. ఔషదాలు, పరికరాలు కావాలి. అప్పటికప్పుడు ఏదో
చేసి గండం గట్టెక్కలనుకుంటే ఇప్పుడున్న పరిస్థితే చూడాల్సి వస్తుంది.
కోవిడ్19 అంత త్వరగా ప్రపంచమునుండి పోయేది కాదు. ఇంతవరకు ప్రపంచములో టీకా తో అంతమైనది ఒకే ఒక జబ్బు
– మశూచి మాత్రమే. ఎన్ని టీకాలున్న ఆ జబ్బులు
ఎక్కడోఅక్కడ ప్రపంచములో వస్తూనే వున్నాయి.
అంటూ వ్యాధుల నివారణకు అత్యుత్తమ ఉపాయము పరిశుభ్రత, పౌష్టికాహారము, స్వీయనియంత్రణే.
ప్రభుత్వము లాక్ డౌన్ విధించినా, విధించకున్న, కర్ఫ్యూ పెట్టిన పట్టకున్నా మన జాగ్రతలో మనముందాము. స్వీయనియంత్రణ పాటిద్దాము. కోవిడ్ 19 ప్రపంచమునుండి పారద్రోలుదాము.
సమయే భోజనం నిద్రా
సమయే స్నానమాచరే
వ్యాయామం సమయే కుర్యాత్
యమో భీతొ గమిష్యతి


No comments:
Post a Comment