కోవిడ్ అంటే అందరికీ భయం పట్టుకుంది. టీకా తీసుకోవాలనే జ్ఞానము కూడా ఇప్పుడు అందరికీ వచ్చింది. అంతా టీకా తీసుకోవాలని
ఎంతో ఆదుర్దాగా ఎదురుచూస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు
వెళ్లాలన్నా, ముఖ్యంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లాలంటే
కోవిడ్ -19 టీకా సర్టిఫికేట్ తప్పనిసరి. మొదోట్లో
టీకా ఇచ్చినప్పుడు జనాలు భయపడి రకరకాల అపోహలతో టీకా తీసుకోకున్న ఇప్పుడు మాత్రం పెద్ద
వరసల్లో నిలబడి కష్టపడి తీసుకుంటున్నారు. మంచిదే.
కానీ, టీకా తీసుకునే
ఆతృతలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరిచిపోవొద్దు.
కోవిడ్ రాకుండా జాగ్రత్తలు, మాస్కు, భౌతిక దూరం పాటించటము, చేతులు శుభ్రంగా వుంచుకోవటము
తెలిసినవే కదా. అవి మరిచిపోవద్దు.
టీకా కోసం ఆసుపత్రికే వెళ్ళాలి కదా. అక్కడ కోవిడ్ పరీక్షకు వచ్చేవాళ్లు కూడా వుండే అవకాశము
వుంది. కాబట్టి వీలైనంత తక్కువ సమయములో పని
పూర్తి అయేటట్లు ప్రణాళిక వేసుకోవాలి. ముఖానికి
shield, చేతులకు gloves తొడుక్కుంటే మరీ మంచిది.
చిన్నపాటి sanitiser
సీసా ఎట్లగూ దగ్గర వుంటుది కదా. అవసరమనిపించినప్పుడు
అది కాస్త చేతుల మీద వేసుకొని తుడ్చుకుంటు వుండాలి.
టీకా తీసుకునే తొందరలో ఏ ఒక్కరి దగ్గరలో నిలబడ వద్దు. మాటలాడేటప్పుడు మాస్కు అస్సలే తీయొద్దు.
ఉదయము ఏమైనా తినే వెళ్ళాలి. దగ్గర నీళ్ళ సీసా వుంటే మంచిది. ఎండాకాలం, నోరు తడారిపోకుండా
అవసరమైనప్పుడు నీళ్ళు త్రాగటం మంచిది.
టీకా తీసుకునేటప్పుడు కానీ, ఆ తరువాత అరగంట
వేచివుండాల్సి వచ్చినప్పుడు కానీ ఎక్కువమంది
గాలి వెలుతురు దారాళంగా రాని రూములో వుండాల్సి పరిస్థితి వుంటే అక్కడ వుండకుండా బైట గాలి వెలుతురు
వుండేచోటు వచ్చి వుండేటట్లు చూసుకోవాలి.
ఆసుపత్రిలో రోగులు వేచి వుండేచోట లేదా రక్తమూత్ర పరీక్షాకేంద్రం
వద్ద అసలే వేచి వుండొద్దు.
కొత్తవాళ్ళే కాదు, స్నేహితులు బంధువులతో
కలసి వెళుతున్నా జాగ్రతలన్నీ పాటించాల్సిందే.
టీకా తీసుకున్నాక వారములో కాస్త ఒళ్ళు వెచ్చగా వుండటము, ఒకటి రెండు విరేచనాలవటము, ఇంజెక్క్షన్ తీసుకున్న చోట
కాస్త నొప్పి వుండటము మామూలే. ఏదైన ఎక్కువ
ఇబ్బంది అనిపిస్తే ఫ్యామిలి డాక్టర్ను సంప్రదించాలి.
టీకా తీసుకునేవారు వారు ఆదివరకు వాడుతున్న బీపీ, షుగర్, థైరాయిడు మొ. మందులు తప్పనిసరిగా వేసుకోవాల్సిందే.
ఏ కారణము వల్లనైనా వేరే ఇతర మందులు వాడుతున్నట్లైతే
రెగ్యులర్ డాక్టరును సంప్రదించాక టీకా తీసుకోవాలి.
టీకా తీసుకునే ముందు, తర్వాత కూడా తగు జాగ్రత్తలు
పాటిస్తే కోవిడ్ -19 నుండి రక్షణ పొందవచ్చు. టీకా తీసుకున్న తర్వాత కూడా ఏమాత్రము నిర్లక్ష్యం
చేయకుండా కోవిడ్-19 నివారణ పద్దతులు పాటిస్తే కోవిడ్ను నియంత్రించవచ్చు.
గతే శోకం న కర్విత
భవిష్యం న ఏవ చింతయేత్
వర్తమానేషు కాలేషు
వర్తయంతి విచక్షణః
No comments:
Post a Comment