![]() |
| 3-10-2009 రోజు సద్దుల బతుకమ్మ, హన్మకొండ |
కోవిడ్ నివారణకు మాస్కు ధరించటాము అత్యంత అవసరము. మాస్కు పన్నెండు యేళ్ళ క్రితం కూడా హెచ్1ఎన్1 ఇన్ఫ్లూయెంజా అనే ఊపిరితిత్తుల వ్యాధి రాకుండా వాడాలని చెప్పితే, అప్పుడు చాలా కొద్ది రోజులు అక్కడక్కడ కొద్దిమంది రద్దీ ప్రదేశాలలో
పెట్టుకున్నారు. గాలి ద్వారా వచ్చే infections, allergies రాకుండా మాస్కు వాడటము తప్పనిసరి. అట్లాగే అవయవమార్పిడి జరిగిన వారు, రోగనిరోధక శక్తి తక్కువ వున్నవారు కూడా మాస్కు ధరించటాము జరుగుతుంది.
దావఖానల్లో ఆపరేషన్ థియేటర్లలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్కు
ధరించాల్సిందే. మాస్కు ధరించటాము వల్ల
మనకు infections తగ్గిపోవడమే కాకుండా మనకు వున్న infections ఇతరులకు సోకవు. నోటి తుప్పిల్ల
ద్వారా కానీ గాలిలో వుండే సూక్షమాజీవులు, కొన్నిపుష్పాల
పుప్పొడి రేణువులు, దుమ్ము ధూళి వల్ల వచ్చే జలుబు, దగ్గు, దమ్ము వంటి వ్యాధులు కూడా నివారింప వచ్చు.
మామూలుగా గాలి దుమ్ము ధూళి వల్ల కలిగే రుగ్మతలు రాకుండా
సాధారణ నూలు వస్త్రం కూడా బాగానే పనిచేస్తుంది.
ఈ disposable సర్జికల్ మాస్కులు రాకముందు
ఆపరేషన్ థియేటర్లలో నూలు వస్త్ర మాస్కులనే వాడేవారు. సర్జికల్ మాస్కులు వచ్చాక కొద్ది ఏళ్లలో అంతా
మెల్ల మెల్లగా ఇవే వాడటము, ఇప్పుడైతే ప్రతిచోటా ఇవే వాడటము
జరుగుతుంది. వస్త్ర మాస్కుల కంటే సర్జికల్
మాస్కుల వలన ఇరుపక్షాలకు రక్షణ ఎక్కువ.
అదే N95 అయితే మరింత ఎక్కువ.
మాస్కుల గురించి, వాటి ప్రస్తుత
అవసరాన్ని, వాడే
విధానాన్ని ప్రతిఒక్కరు వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. కోవిడ్ వల్లనే N95 బాగా వ్యాప్తిలోకి వచ్చింది.
డాక్టర్లకె కాదు సామాన్యులకు కూడా కోవిడ్ నివారణకు ఈ మాస్కు
ధరించటము తప్పనిసరి.
మామూలుగా వున్నప్పుడు శ్వాస ఆడినట్టు మాస్కు వున్నప్పుడు
వుండదు. మొదట్లో కాస్త ఇబ్బంది వున్న
తర్వాత అలవాటైపోతుంది. ఆరోగ్యంగా వున్నవాళ్లు, కాస్త నడక, కొద్దిపాటి వ్యాయామాలు కూడా
చేయవచ్చు. ఎన్95 వాడుతున్నప్పుడు మాత్రము
ఎక్కువ ఇబ్బంది వుంటుంది. ఎన్95 మాస్కు
ధరించినప్పుడు వేగమైన నడక లేదా వ్యాయామాలు చేయకూడదు.
ఈ మధ్య వైరుస్ విజృంభణ అధికంగా వుంది కాబట్టి రెండు
మాస్కులు ధరించమని చెపుతున్నారు. ఇది
ముఖ్యంగా నూలు మాస్కులు ధరించే వాళ్ళు తప్పనిసరిగా చేయాలి వైరుస్ అంతరించే వరకు పాటించటము మంచిది. అలాగే ఎన్95 కంటే సర్జికల్ మాస్కు రక్షణ తక్కువ
కాబట్టి వారు కూడా రెండు మాస్కులు ధరించాలని చెపుతున్నారు. సర్జికల్ మాస్కు ధరించిన వారు ముందు సర్జికల్
మాస్కు ధరించి దానిపై వస్త్రము ధరించాలి.
అలా ఐతే శ్వాసకు ఇబ్బంది వుండదు.
ఎన్95 ధరిచినవారు మాత్రము రెండు మాస్కులు ధరించాల్సిన అవసరము లేదు. పద్ధతిగా రోజువారిగా మారుస్తూ పోతే
సరిపోంతుంది. ఉతకడానికి అనువైన ఎన్95
మాస్కులను కంపెనీ వారిచ్చిన సూచనలను బట్టి వాడాలి.
మాస్కు ఉపయోగము గురించి ఇప్పుడు ప్రజలకు బాగా తెలిసింది
కాబట్టి వారి వారి ఆరోగ్యాన్ని, అవసరాన్ని బట్టి ముందుముందు
కూడా వాడితే మంచిదే. ఈ కోవిడ్ అంతమైన
తరువాత కూడా,సర్ది దగ్గు వున్నప్పుడు, చాలా
రద్దీ ప్రదేశాలు , దుమ్ము ధూళి వున్న ప్రదేశాలలో వున్నప్పుడు, దూరప్రయాణాలు ద్వి, త్రిచక్రవహానాపై
ప్రయాణిస్తున్నపుడు, బసుల్లో, రైళ్లలో
ప్రయాణిస్తున్నప్పుడు కనీసం వస్త్ర మాస్కైన ధరిస్తే, ఊరు
వెళ్ళి వచ్చినాక వచ్చే జ్వరము, జలుబు,
దగ్గు, దమ్ము రాకుండా వుంటాయి.
మన ఆరోగ్యం మన అవసరము.
ఎవరైనా ఏమనుకుంటారో అని అనుకుంటూ మన రక్షణ మనం మానోద్దు. మాస్కుతో
నివారించగలిగిన గల్గిన జబ్బులకు మందులవరకు ఎందుకుపోవాలే?

No comments:
Post a Comment