ఊసరవెల్లులు
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఎప్పుడు పాసౌతుందో, తెలంగాణ
రాష్ట్రము ఏర్పాటైనట్లు గెజిట్లో ఎప్పుడొస్తుందో కాని, ప్రతి రోజు
ఈ ఆంధ్రోల్ల అడ్డదిడ్డ మాటలు వినలేక చెవులు గడలువడుతున్నయ్.
అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నరో వాళ్లకైనా అర్థమయితుందా?
ఓ గొప్ప మేధావినని, అంతా రాజ్యాంగ బద్ధంగా, నీతిగా, నిజాయితిగా
మెదలాలని, అధికారవికేంద్రికరణ జరిగితేనె ప్రజలకు మేలని, రాజకీయ
నాయకులు మాటకు కట్టుబడి వుండాలని, మానిఫెస్టోలో వట్టి మాటలు
కట్టి పెట్టి, ప్రజల ప్రజాస్వామిక హక్కులను నెరవేర్చె విధంగా చెప్పినవి
చేయాలని నీతులు పలికిన జయప్రకాశ్ నారాయణ తెలంగాణ
తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కని, అది అధికార వికేంద్రికరణలో
భాగమేనని, రెండు జాతీయ పార్టీల ఎన్నికల ప్రమాణమని, CPM
మినహా లోక్‍సత్తతో సహ ఇతర పార్టీలు అన్నికూడ తెలంగాణ
ఏర్ఫాటుకు వ్యతిరేకము కాదని చెప్పాయని, కేంద్రప్రభుత్వానికే తెలంగాణ
పై నిర్ణయము తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యత వున్నదని,
ఆ నిర్ణయము నానుస్తు ఆంధ్రప్రదేశ్‍ను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని
పలుసార్లు విమర్శించి, పరోక్షంగా నిర్ణయము తీసుకునే విధంగ వత్తిడి
చేసిన సంగతి మరిచిపోయడు. ఇప్పుడు ప్రజాభిష్ట వ్యతిరేక నిర్ణయము
తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అనడములో ఆయన మేధ
ఏందో, మెదడేందో, రాజనేతేందో, నిజాయితేందో, మాట నిబద్ధతేందో
తెల్సిపోతుంది. పేద్ద ప్రజాస్వామిక వాదినని డబ్బా కొట్టుకున్నాయన
ప్రజాస్వామ్యాన్నిపాతరేసి ప్రాంతీయతకే పట్టము కడుతున్నడు.
తెలంగాణలో ఎమ్మెల్యే అయిన సంగతి కూడ మర్చిపోయి, తెలంగాణ
ఏర్పడితే ఆయన, ఆయన పార్టీ అస్తిత్వము కృష్ణాగోదావరిలని
దాటుకొని పోయి బంగాళఖాతంలో కల్సిపోతుందని స్వార్థ
పూరితంగా వ్యవహరిస్తున్నడు. నిజమైన మేధావైతె మాటకు,
రాజ్యాంగానికి కట్టుబడి, విభజనకు కేంద్రానికి సహాయకారిగ
వుంటే దేశములోనే కాస్త మంచి పేరు తెచ్చుకొని రాజకీయ
భవిష్యత్తును సుస్థిరము చేసుకునేవాడు. రాజకీయాలలో ప్రలోభాలకు
లొంగకుండ నిజాయితిగ పనిచేయడము సాధ్యముకాదా?
చంద్రబాబు గోస చెప్పలేనిది. ఆయనో గొప్ప రాజకీయ వ్యూహకర్త.
మామను వెన్నుపోటు పొడిచి నిలదొక్కుకోవటముతో తనంత
అపర చాణక్యుడు ఈ కాలంలో ఎవరు లేరనే అనుకున్నడు.
ఎంతో ఆలోచించి, చించి, చించి, తేదేపాలో కమిటీ వేసి,సర్వే చేసి,
తెలంగాణ పైన నిర్ణయము తీసుకొని కేంద్రానికో లేఖాస్త్రాన్ని
సమర్పించాడు. అంత సుధీర్ఘ మంతనాల తర్వాత తీసుకున్న
నిర్ణయానికి కట్టుబడి వుండక భావోద్వేగాలకులోనై, ఎదుటి
వారి రాజకీయ ఎత్తులలో పావై మతిస్థిమితము లేనివాడిగా ప్రవర్తించి
ఆతని మీద ప్రజలు పూర్తి నమ్మకము కోల్పోయెట్టు చేసుకున్నడు.
వెన్నుపోటుపొడిచి, ఆనాడు హోటల్ వైస్రాయ్ ముందు తన మీద
అల్లుడు చెప్పులు విసిరేయించినప్పుడు నందమూరి తారక
రామారావ్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడో! ఆ పాపం
వూర్కె పోతుందా.
భాజపా తెలంగాణకు మద్దతివ్వటము వెంకయ్యనాయుడికి ఎంత
కష్టంగా వుందో. తప్పని పరిస్థితిలో ఎంత గొప్ప వాళ్ళైనా, ఏ పదవిలో
వున్న అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటమని కచర మొఖం
పెట్టుకొని చెప్పిండు. ఈ మొఖాన్ని చూసి తెలంగాణ జనం భాజపా
ఏం చేస్తుందోనని లొలోపల కాస్తా అనుమానపడుతుండ్రు. భాజపా
ఆంధ్రాలో ఎట్లాగు రాదు. ఈ నాయుడు మరో చంద్రుడితో కల్సి కంత్రి
వేషాలేస్తె ఆయింత తెలంగాణలో భాజపా ఒక్క సీటు కూడ
దక్కించుకోలేదు.
కాంగ్రేసు, గాంధీల పేర్లు చెప్పుకొని ఎన్నికల్లో ఓట్లడుగుతాము అని
ఒప్పుకునే సీమాంధ్ర కాంగ్రేసు నాయకులు తమకు టికెట్లుచ్చి
పదవులిచ్చిన అధిష్టానాన్ని లెక్కచేయమంటరు. ఆ పార్టీ లేకపోతే
రాజకీయ బతుకులేదు, ఆ అధిష్టానం టికెట్లివ్వకపోతె భవిష్యత్తు
వుండదు, గాంధీలు మాట్లాడకపోతె ఓట్లు రాలవు, ఆధిష్టానం
కనికరించకపోతె అధికారము, పదవులు వుండవు అయినా
విభజన విషయము వచ్చేసరికి ‘ఎవరి మాటవినేది లేదు,
ఎంతకైనా తెగిస్తామ’ని అంటారు. వీళ్ళకు ప్రజలు, అధిష్టానం
కంటె వాళ్ల సొంత ఆస్తులు పెంచుకోవటమే ముఖ్యమనుకుంట.
తెలంగాణ ఏర్పాటు ఎన్నికల వాగ్దానమని, ఎన్నికల వాగ్దానాలు
నెరవేర్చె పార్టీగా తమ పార్టీ గురించి ప్రచారము చేసుకుంటే ప్రజలు
రాజకీయ నాయకులను కాస్తైనా నమ్మేవాళ్లు కాదా. వాళ్ళు
తలచుకుంటె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుహృద్భావ
వాతావరణములో ఎంతో సామరస్యంగా సంతోషంగా సాగెది కద.
ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగవు కాదు కద. ఆ ప్రాంత
రాజకీయనాయకుల పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవముండెది
కదా. ఈ రాజకీయనాయకులు ఎంత వంచకులో రెండు ప్రాంతల
ప్రజలకు అర్థమైంది. ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా
తెలంగాణలో కాని, ఆంధ్రాలోకాని నాయకులు రకరకాల
నాటకాలు ఆడారు కాని తమ పదవులను మాత్రమువదులుకు
కోలేదు (తెరాస తప్ప). మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు
వస్తాయంటె మాత్రము రాజీనామాలు చేసి ఓట్ల వేటకు వస్తారను
కుంట. అంత వరకు పదవులను అంటి పెట్టుకొని తమ కార్యాలన్ని
చక్కదిద్దుకుంటారు. వీరి నాటకాలు ప్రజలకు అర్థం కావను
కుంటున్నరు. ప్రజలు తెల్లివి తక్కువ వాళ్ళైతె మన
ప్రజాస్వామ్యము ఇలా పరిడవిల్లేదా?

No comments:
Post a Comment