చంద్రబాబు - బెదిరింపులు
చంద్రబాబు మతిస్థిమితము తప్పినట్టే వుంది. లేకపోతె ఆ
మాటలేంది? పంజాబీల సెంట్‍మెంట్ దెబ్బతిన్నందుకు
ఇందిర గాంధి హత్యకు గురైందని. తమిళుల సెంట్‍మెంట్
గాయపడ్డందుకు రాజీవ్ గాంధి హత్య చేయబడ్దడని,
కాంగ్రెసోల్లు తెలివి తక్కువగా వ్యవహరిస్తరని అంటున్న
చంద్రబాబు తను మామను వెన్నుపోటు పొడిచి ముఖ్య
మంత్రి అయిండని మర్చిపోయిండు. ఏ కుటుంబ సభ్యుల
సహకారముతో అధికారము చేజిక్కించుకున్నాడో ఆ
కుటుంబ సభ్యులను ఏ మాత్రము అధికారములో చోటు
దక్కనీయకుండా ముందు దూరంగ నెట్టేసి ఆ తరువాత
అవసరాన్ని బట్టి మళ్లి చుట్టరికాన్ని కలుపుకున్నడు.
గాంధిలలో ఎవరిలోను ఇంత కుళ్ళు మాత్రము లేదు. వాళ్ళు
దేశ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలు చేసినరె కాని కేవలము
అధికారము కోసము ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. మరి
చంద్రబాబు తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఎలా
సమర్థించుకుంటడు. అది సరైనదనే చంద్రబాబు భావిస్తున్నాడా?
ఇక తెలుగు జాతి అని మొత్తుకునే వాళ్లు ఒకటి గుర్తించుకోవాలి.
తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడినా వాళ్ళు ఆంధ్రావాళ్ళు ఒక్కటని
ఎప్పుడు అనుకోలేదు. ఇక ముందు కూడా అనుకోరు. భారతదేశములో
ఎన్నో భాషలు, తెగలు, జాతులు వున్నాయి. తెలంగాణ, ఆంధ్ర భాషలు
ఒకటిగా అనిపించినా వారు ఒక జాతిగా ఎప్పుడు భావించుకోలేదు. ఈ
నేల మీద పుట్టిన వారి గుణాలు, అక్కడ పుట్టిన వారి గుణాల్లో ఎంత తేడా
వుందో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ద్వార బైట పడింది.
భారతీయులుగా అందరము కల్సివుండాలి, పోరుగు రాష్ట్రాలవారిగా
కల్సివుండాలే కాని వాళ్ళు అంటున్న ‘తెలుగు జాతి’గా మాత్రము
కాదు. తెలంగాణ వాళ్ళకు వారితో కలసివుండాలనే సెంట్‍మెంట్
ఆవగింజంత కూడా లేదు. కాబట్టి వాళ్ళు తెలుగుజాతి సెంట్‍మెంట్
తెలంగాణ వాళ్ల మీద రుద్దాలని చూస్తె ఒప్పుకోరు. దోపిడి ఇక
ముందు సాగదని, దానిని సాగించేకోసం తెలుగుజాతి అనె సెంట్
మెంట్ ముందు పెడితె ఎవ్వరు నమ్మెస్థితి లేదు. ఇకనైనా ఆంధ్రోల్లు
తెలుగుజాతి సెంట్‍మెంటు పక్కన పెట్టి వాస్తవాలు గుర్తించి, జిమ్మిక్కులు
మాని వాళ్ళ రాష్ట్రము గురించి ప్రణాళికలు మొదలు పెట్టాలి. ఇక
ముందైనా వాళ్ళ కొత్త రాష్ట్రములో ప్రాంతీయ భేదాలు చూపకుండా
అందరికి న్యాయము జరిగేట్టు చూడాలి.

No comments:
Post a Comment