అలజడి
మళ్ళీ అఖిల పక్షమీటింగ్ అనగానే అందరిలో రకరకాల
అనుమానాలు మొదలయ్యాయి. తెలంగాణ వాదులు
ఇదేమన్న తెలంగాణ పక్కన పెట్టే విషయమా అని
ఆందోళన చెందారు. తరువాత అది విభజన ప్రక్రియలో
భాగంగ జరుగుతుందని తెల్సి చల్లబడ్డారు. ఇప్పటి దాక
కేంద్రము ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజిస్తుందని గొంతు
చించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు గొంతు పెగలటము
లేదు. ఇప్పటికైనా చంద్రబాబు సీమాంధ్ర కేమికావాలో
కేంద్రము ముందు పెట్టి అక్కడ ముందు ముందు ఎన్నికల్లో
గెలుపుకు, కొత్త ఆంధ్రప్రదేశ్‍లో మళ్ళి ముఖ్యమంత్రి అయ్యెందుకు
ప్రయత్నించవచ్చు. అన్ని పార్టీల వారు విభజన వల్ల కలిగె
వాళ్ల సమస్యలను, వాటి పరిష్కారలను కేంద్రానికి తెలియజేసి
విభజన సామరస్యంగా జరిగేటట్టు చూస్తె అందరికి మంచిది.
******************
నిన్న జరిగిన ఘోరం తలచుకుంటే గుండె బరువెక్కుతుంది.
వొల్వో బస్ ప్రమాదము, ఆ బస్ శకలాలు, మాడిన మాంసము
ముద్దల్ల వున్న ఆ దేహాలు చూసిన వారెవరైనా ఆ బస్ యజమానిని,
డ్రైవరును, ప్రయాణానికి అనుమతిని ఇచ్చిన RTA ఆఫీసర్ను
శాపనార్థాలు పెట్టకుండ వుండగలరా? అయినా ఎన్ని శాపనార్థాలు
పెడితే మాత్రము పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా? ఒక్క ప్ర్రాణంతో
ఎన్నెన్ని జీవితాలు ముడిపడి వున్నాయో? ఆ జీవితలకు ఎవరు
రక్షణ ఇవ్వగలరు? కాసులకి కక్కుర్తి పడి నమ్మిన వారి ప్రాణాలను
ఫణంగ పెట్టి సంపాదించుకునేవారు మనుష్యులేనా. ఎన్ని కోట్లు
సంపాదించినా, బంగారు పళ్లాలున్నా అందులో రెండు ముద్ద
లన్నమే తింటారు కదా. బంగారు ముద్దలు తినరు కదా.
జీతము ఇవ్వాల్సి వస్తుందని కక్కుర్తి పడి రెండో డ్రైవరును పెట్టుకో
నందుకు ఎన్ని ప్రాణాలు బలి కావల్సి వచ్చింది.
ప్రభుత్వము రెండురోజులు ఏవో కంటి తుడుపు చర్యలుగా అరెస్టులు
చేయడము, నాలుగు బస్సులు పట్టుకోవడము కాదు, ప్రైవేట్ బసులు
నడపటానికి నియమ నిబంధనలు అందరు, ఎప్పుడు పాటించెలా
చర్యలు తీసుకోవాలి. ముందు కాస్త కష్టమనిపించినా నియమ
నిబంధనలు అమలు పరిస్తె కలిగె లాభాలు అర్థమైతె అందరు తప్పక
అవి పాటిస్తారు. అప్పుడు ఇలాంటి ప్రమాదాలు వుండవు.

No comments:
Post a Comment