రాష్ట్ర రాజకీయాలు - ప్రజాస్వామ్య పాతర
రాష్ట్రములో కాని దేశములో కాని ఏమైతుందో ఎవ్వర్కి
అర్థం అయితలేదు. ఎవరిపైన ఎవరో, ఎవరి మాటకు
ఎవరు కట్టుబడి వుంటారో తెలుస్తలేదు. ఎవరెప్పుడు
ఎట్ల మాటమారుస్తరో, అన్న దానికి అర్థాలు వేరని, మీడియా
వక్రీకరించిందని ఉల్టా అంటరో చెప్పేటట్టు లేదు. పార్టీలకు
కూడ ఒక సిద్ధాంతం లేదు. అంతా రాద్ధాంతమే. అంతా ప్రజా
సేవకులమంటరు, ప్రజల మనోభావాలే ముఖ్యమంటరు, కాని
ఒక ప్రాంతం ప్రజలే ప్రజలుగా వారికి అనుకూలంగనే నిర్ణయాలు
జరుగాలని అల్లర్ల్లు చేస్తరు, చేయిస్తరు. మరో ప్రాంతం వాళ్లని
దోపిడి చేసినా నోర్మూసుకొని పడుండాలని, లేకపోతె మెడకాయలు
తెగ్గోస్తమి బెదిరిస్తరు. ఇది సీమాంధ్రుల నైజం. ఇంత జరుగుతున్న
దోపిడికి, దౌర్జన్యానికి గురైతున్నాఆ ప్రజలకు అండగా ఉండాల్సిన తెలంగాణ
నాయకులు అధిష్టానం భజన చేస్తు, "అదిగో అమ్మ ఇచ్చె, ఇదిగో
తెలంగాణ వచ్చె"నంటు తెలంగాణ నేతలు వాళ్ళకు వాళ్ళె మీటింగులు
పెట్టుకొని అమ్మను పొగుడుకుంట సంబురాలు చేసుకుంటున్నరు.
కాళ్ళు సాపుకొని పడుకుంటున్రు. లేదా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంతెవరని
డిస్కషన్లు పెట్టుకుంటున్రు.
అటు సీమాంధ్ర ప్రజాపతినిధులంతా రకరకాల ఎత్తులు వేస్తున్నరు, జిత్తులు
జేస్తున్నరు. ఉద్యోగులను ఉసిగొలుపుతున్నరు. గవర్నమెంట్ ఇన్సిటిట్యూట్స్
బంద్జేసి ప్రైవెట్లొ వ్యాపారాల్లో లాభాలు దండుకుంటున్రు. పేదలు, బడుగులు
ఎటుబోతె మాకేమి, మాదోపిడి కలకాలం సాగడానికి ఎంతవరకైనా పోతమని
నిసుగ్గుగ చెప్తున్రు. తెలంగాణ ఆపడానికి, సీమాంధ్ర ప్రతినిధులు వారి ఇంటి ఆడవారిని
ఏ.పి. గవర్నరు దగ్గరకు, కాంగ్రేసు ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ దగ్గరకు,
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దగ్గరకు పంపినరు.
పార్టీలు కూడ రకరకాల పొత్తులు ఆలోచిస్తున్నయి. ఎటుబడి తెలంగాణ
రాకుండ చెయ్యలే. వాళ్ళ నీళ్ళు, ఉద్యోగాల దోపిడి కలకాలం సాగాలని
సర్వ ప్రయత్నాలు చేస్తున్నరు. భాజప మతత్వపార్టి అని దానికి దూరంగా
వుండాలని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో వియ్యానికి ఉరికురికి
పోతుండు. ముస్లిం ఓట్లు పోతే పోని, మోది వెలుగుల్లో తన పార్టీని ముందు
కురికించి సెంటర్లో చక్రం తిప్పాలని ప్లానేస్తున్నడు. ఈ నాయుడు బాబుకు ఆ
వెంకయ్య నాయుడు తోడు. పార్టీల కతీతంగ కులపోల్లంత కల్సి తెలంగాణ
రాకుండా చెయ్యడమేకాదు, ముందు ముందు ఢిల్లి పీఠము మీద కూడ
కన్నేసిండ్రేమో అని నా అనుమానము. మోది తెలివైన నాయకుడైనా
కుతంత్రములో చంద్రబాబును మించిన వాళ్ళెవరైనా వుంటారా? చూడాలి మరి.
రెండుకళ్ళ బాబును తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కిషన్ రెడ్డి
తెలంగాణ ఐకాసలో వుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు.
కేంద్రములో తెలంగాణ బిల్లుకు మా మద్దతన్న భాజపా అంటె తెలంగాణ ప్రజలకు
కాస్తా అభిమానముంది. తెలంగాణలో లోకల్‍గ తెరాస వున్నా, జాతీయ స్థాయిలో
భాజపాకు చాలామందె సపోర్ట్ ఇస్తరు. తెదేపా లింక్ పెట్టుకుంటె తెలంగాణలో
భాజపా మునుగుడు ఖాయం. ఆంధ్రలో ఎట్లాగు భాజపా రాదు. తెలంగాణ వస్తె
అక్కడ జై ఆంధ్ర వాళ్లెమైనా భాజపాకు ఓటెయొచ్చు. తెలంగాణలో తెలంగాణ
వస్తె భాజపాకు కొన్ని ఎమ్మెల్యె, ఒకటొ రెండో ఎమ్పి సీట్లు రావచ్చు.
ఈ విభజన నేపధ్యంలో భాజపాకు వచ్చే క్రెడిట్‍ను చంద్రబాబు తన
ఖాతలో వేసుకునే యత్నం జేస్తున్నడు. గోద్రా అల్లర్ల తరువాత మోది
రాష్ట్రానికి రావడానికి కూడ ఇష్టపడని బాబు ఇప్పుడు మోదిని నెత్తి
కెక్కించుకుంటున్నడు. ఈయన జగన్ బాబును పట్టుకొని ‘యు’ టర్న్
అని మాట్లాడుతుండు!
వైయెస్సార్ జగన్మోహన్ రెడ్ది ఎం తక్కువా? మాటలు మార్చటములో చంద్రబాబును
మించినోడు. బైబిల్ పట్టుకొని విజయమ్మ ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రము తెలంగాణ
ఇవ్వాలని, తెలంగాణలో పరిస్థితులు చక్కదిద్దాలని అంటుంది. మళ్ళి అదే బైబిల్
పట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని దీక్షలు చేస్తుంది. ఆ అమ్మ కొడుకు "నేను
సెక్యులర్ పార్టీలతోనె కల్సి పని చేస్త"నని అంటడు. అదే ఊపులో మోది కార్య దక్షతను
మెచ్చుకొని, సెక్యులర్ పార్టీలన్నిటిని ఆయన ఒక వేదిక మీదకు తీసుకొని రావలంటడు.
దీని అర్థమేమి దేవా? జగన్ తమకు సపోర్ట్ అంటె తీర టైముకు భాజపా తెదేపాను
ఏ సముద్రములో కల్పుతుందో.
కిరణ్‍కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకైన అర్థంమైతుందా అని నా
డౌట్. తెలంగాణ వచ్చుడు ఇష్టం లేదు. అది అందరి సీమాంధ్రుల కున్నదే. రాష్ట్రాన్ని
విడదీస్తె వచ్చె ఇబ్బందులు వాస్తవంగా ఏంటో చెప్పితె వాటి పరిష్కారముంటుంది.
అబద్ధాలు, కలిపిత విషయాలు రెచ్చగొట్టెట్టు చెప్తె ఎట్లా? "ఆంధ్రా బుష్" అయిండు.
అప్పుడు నెహ్రు చేసిన శాసనాలు నీటి మూటలంటడు. అప్పుడు ఆంధ్ర తెలంగాణను
కలిపెటప్పుడె నెహ్రు, కలిసి వుండలేకపోతె ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పిండు కద. మరి
ఆ మాటకు విలువ లేదా? ప్రజలంతా తెలివి తక్కువోల్లనుకుంటరు. ఆ ప్రజలే ఎలేక్షన్లలో
ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు బుద్ది చెపుతున్నరు. కాని రాజకీయ నాయకులంతా కోడి
ముక్కు నేలకు రాసినట్లుంటరు.
కాంగ్రేసు అధిష్టానం టికెట్లిస్తెనె, కాంగ్రేసు పేరు, గాంధీల పేరు చెప్పుకొని ఓట్లడుక్కునే
నాయకులు "అధిష్టానం జాన్తనై, సోనియా ఎవరు, ఆమెకీ దేశము, ప్రజల గురించి ఏం
తెలుస"ని ధిక్కార స్వరాలు వినిపిస్తున్నరు. ఇన్నాళ్ళు ఈ సీమాంధ్ర ప్రతినిధులు
నోట్ల సంచులతో తెలంగాణ ఆపిండ్రని తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నరు.
కాంగ్రేసు కోర్ కమిటీ నాన్చి నాన్చి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయము
తీసుకుంటే వచ్చె ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, ఒక్క తెలంగాణ ఏర్పాటు అనే ఒక్క
బాణముతో భాజపా, తెదేపాలను మట్టి కరిపించాలని చేసిందని అందరు అనుకున్నదే.
ఎట్లాగైతెనేం, మనకు తెలంగాణ వస్తుందని తెలంగాణ ప్రజలు సంతోషపడ్డరు. రెన్నెళ్ళు
దాటినా విషయము ఎక్కడ వేసిన గొంగళి అక్కడె వున్నట్టు వుండటంతో తెలంగాణ ప్రజల్లో
మళ్ళీ అనుమానాలే. ఆంటోని కమిటీలో వీరప్ప మొయిల వున్నాడంటేనే నాకనుమాన
మొచ్చింది. షిండేగారు రోజుకో మాట్లాడుతుంటే ఆయన మీద కూడ అనుమానమే. నిర్దిష్ట
కాల పరిమితి లేని ఓ కమీటి పెట్టి విషయాన్ని కాంగ్రేసు ప్రజలను ఎంత కాలం మోసము
చేయదల్చుకుంది? ప్రజాస్వామ్యదేశంలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ప్రభుత్వానికి
పట్టదా? డబ్బు మూటలకు అమ్ముడుపోయి ఒక ప్రాంత ప్రజలను మిలిటిరీతో
కాల్చివేయటము, లేదా పోలీసు కేసుల్లో ఇరికించి జైల్లో బంధించటమే ప్రభుత్వ
పాలనా విధానమా? ఇదేం ప్రజాస్వామ్యం?
ఇప్పటి రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర, కేంద్రప్రభుత్వతీరుకు, కాంగ్రేసు మార్కు రాజకీయాలకు,
ఇతర పార్టీల ఎత్తులు పొత్తులు చూస్తున్న తెలంగాణ ప్రజలు ఎంతో ఆందోళన పడుతున్నరు.
ఈ మానసిక హింస తెలంగాణ ప్రజలు ఎంత కాలం తట్టుకోగలరు? వారు సహనం కోల్పోతే
ఏర్పడె పరిస్థితులు దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
రాహులుగాంధి కాంగ్రేసు పార్టీ ఉపాధ్యక్షుడు. కోర్ కమిటీ సభ్యుడు. అతనికి తెలియకుండానే
నేరచరితుల రక్షణ ఆర్డినెన్స్ తయారైందా? అతను పబ్లిక్‍గా దానిని చించేయలనడము ఏ
వ్యూహముతోటి? అతని మాటకు విలువ ఇచ్చి ఆ ఆర్డినెన్స్ వెనిక్కి తీసుకున్నరు.
ఆర్డినెన్స్ ఉపసంహరణ ప్రజాస్వామ్య విలువలను కొంతైనా కాపడుతుంది. ఈ వ్యవహారం నడిచిన
తీరు దాని ప్రభావము తెలంగాణ బిల్లుపై పడదా? ఇదివరకే సీమాంధ్ర ప్రతినిధులు పార్లమెంట్లో
తెలంగాణ బిల్లు పెడితె చించడానికి వెనకాడమని అన్నరు. ఇప్పుడు వాళ్ళు అది చేసి చూపె
ట్టొచ్చు. అంతే కాదు. కాంగ్రేసు పార్టీ, కేంద్ర కేబినేట్ ఒప్పుకొని రాష్ట్రపతి సంతకానికి వెళ్ళిన
ఆర్డినెన్సునే వెనిక్కి తీసుకున్నట్టే తెలంగాణ నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోమని ఆందోళన చేస్తరు
ఈ ఆంధ్రోల్లు. రాహులు గాంధిని ఒప్పిస్తె పనులైతయని తెలిసిన సీమాంధ్రోల్లు ఇప్పుడు ఆయన
దగ్గరకు వాళ్ల బిడ్డలను పంపిస్తరనుకుంట.

No comments:
Post a Comment