సీమాంధ్ర విధ్వంసం
సీమాంధ్రాలో ఉద్యమము పేరిట జరుగుతున్న విధ్వంసము
ఎంతో బాధాకరము. ఉద్యమము పేరుతో జరుగుతున్న
వికృత కిరాతక చేష్టలకు ప్రభుత్వము అండగా వుండటము,
కేంద్రము ఎలాంటి చర్యలు తీసుకోక పోవటము దేనికి సంకేతము?
పేద ప్రజలకోసమే మా ప్రభుత్వమని చెప్పె ఏ ఒక్క పార్టీ కూడా
సీమాంధ్రలో విధ్వంసము సృష్టించేది ఎవరో తెలిసినా దానిని అట్లాగే
కొనసాగనివ్వటము ఎంత దారుణం. కాపాడాల్సిన ప్రభుత్వము
కక్ష పూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎవరికి
చెప్పుకోవాలి?
న్యాయాన్యాయాలు మర్చిపోయి, ధర్మాధర్మాలు పక్కన పెట్టి
కేవలము ఆధిపత్యం కోసం, కొందరి వ్యక్తుల అక్రమార్జనలు
రక్షించటం కోసం తమ స్వంత ప్రాంతము, తమ స్వంత ప్రజలని
కూడ చూడకుండా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేయటము -
ఇదేమి రాజకీయము? ఇదేమి రాక్షసత్వము? స్వప్రయోజనాలకోసం
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవతము అధోగతి పాలుజేసి
అదంతా వారికోసమే అని నమ్మించి అధికారములోకి రావలనుకోవటము
ఏ కౌటిల్యుని రాజనీతి పాఠము?
సామాన్యప్రజలు - బహుజనులు పెదలే. ఎక్కువ శాతం రెక్కాడితేనె
డొక్కాడని వారే. ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి కొన్నిసార్లు
కొందరు అమ్ముడుపోయెవారే. అమ్ముడుపోయి దారి తప్పినప్పుడు
కఠిన శిక్షల జ్వాలల్లో బతుకులు బూడిదయ్యెది వారివే. అట్లాంటి వారు
ఒక్క క్షణం ఆలోచించి, అమ్ముడుపోయి కాలిపోయెకంటే, ఆత్మగౌరవముతో
నిప్పుల చెండై మాయల మరాఠిలను నుసి చేయాలి. అలాంటి వారున్నారు.
మార్గదర్శకులైన వారున్నారు. ప్రజాస్వామ్యములో ఓటు హక్కు అందరికి
కల్పించిన మహానుభావులు, ప్రజలే ప్రభువులు కావాలన్నారు కాని, రాజులై
రాచరికము చేయాలనలేదు. రాజకీయాల పేరుతో రాక్షసీయం చేసేవారిని
పాతాళానికి తొక్కేయడానికి ఓటె వజ్రాయుధము.
పేదలు, అమాయకులు, చాతకాని వాళ్ళు, చేవలెని వాళ్ళుగా కనిపించే
సామాన్యప్రజలకు ఉన్న శక్తివంతమైన ఆయుధము ఓటు. దీనిని సద్విని
యోగము చేసుకొని గొప్పగొప్ప వారిని, వ్యక్తులను, ప్రభుత్వాలను
మట్టి కరిపించారు. ఈ సామాన్యులు పైకి ఏమి మాట్లాడక పోవచ్చు, నిర్బలులు,
నిస్సహాయులుగా కనిపించ వచ్చు. వాళ్ళు రాజకీయాలు మాట్లాడక పోవచ్చు,
వాటి గురించి అవగాహన లేనట్టు కనిపించవచ్చు. కాని ఓటు వేసినప్పడి నుండి
మళ్ళి ఓటు వేసె వరకు ప్రతిరోజు వారు ఎన్నుకున్న, ఎన్నుకొబడ్డ నాయకులను,
ప్రభుత్వాన్ని గమనిస్తునే వుంటరు. ఇది ఒక ఇంటర్నల్ అస్సెస్‍మెంట్ లాంటిదె.
దాని మీద అధారపడె మళ్లి ఓటు వేస్తారు. ఎంత బ్రహ్మాండమైన స్లోగన్‍లు ఇచ్చిన
మోసపోరు. మైమరచి పోరు. నమ్మకము అనిపించి నిజాయితి కాస్తైనా వుందను
కుంటేనె ఓటు వేస్తారు. అధికారాన్ని ఇస్తారు. మహామహులనే ఓడించారు.
మట్టి మనుషులనీ గెలిపించారు. తస్మాత్ జాగ్రత్త.

No comments:
Post a Comment