ముసుగు
అదో పెద్ద ఊరు. ఆ హాస్పటల్ ఆ వూళ్ళో తొలి హాస్పటల్, పెద్ద
హాస్పటల్. ఈశ్వరయ్య ఆర్.ఎం.పిగా చిన్న క్లినిక్‍గా మొదలు పెట్టి
తర్వాత నర్సింగ్ హోమ్‍గా మార్చిన ఆ ఆసుపత్రిలోనె
కొడుకు కోడలు (స్పేషలిస్టులు) కూడ వచ్చి ప్రాక్టీసు చేస్తున్నారు.
ఆరోజు తండ్రి లేక పోవటముతో రాజ్‍కుమారే ఓ.పిలో మగ
పేషంట్లందరిని ఒక్కడే చూస్తున్నాడు. ఓ పేషంట్ నీరసంగా
నడుస్తు వచ్చి డాక్టర్ పక్కనున్న స్టూల్ మీద కూలబడ్డడు.
వెంట ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది. చేతిలో ఓ ప్లాస్టిక్
సంచి, సంచిలో మందులు. ఆ మందులన్ని డాక్ట్రర్ ముందున్న
టెబుల్ మీద గుమ్మరించింది.
"ఇంగొ సారు. కడుపుల నొప్పంటే నిన్న గీ మందులు రాసిచ్చిండ్రు.
నొప్పింక ఎక్కువైందిగని తగ్గలే. పొద్దుగాల నుండి ఏం తినలే.
కడుపుల మండుతుంది, ఒకారమని అంటుండు. అస్సలే
లేస్తలేడు. బల్మీటికి పట్టుకొచ్చిన". ఆ ఆడామే మందులు
గుమ్మరిస్తు చెప్పింది.
వాళ్ళు పాత పేషంట్లేనని రాజ్‍కుమార్‍కు తెలుసు. కుప్ప పోసిన
మందులు చూస్తు, "గీ మందులు వాడితె కడుపుల మంట రాదా?
ఓకారము కూడ వస్తది. మందుల చిట్టేది? ఎక్కడికి పోయినవ్?
ఎవ్వరాశిండ్రీ మందులు? పోశాలుకు ముందె దమ్ముంది. గివన్ని
ఎట్ల రాశిండ్రు?" అడిగాడు.
ఈ మధ్య కాలంలో వీళ్లు ఒకసారి పక్క కొత్త డాక్టర్ దగ్గరకు వెళ్ళి
జబ్బు నయంగాక పోయేసరికి మళ్లి తన దగ్గర చూపించుకోవటము
గుర్తుంది.
"గప్పుడొక్కసారి మీరు లేకపోతె ఆపతికి రామారావ్ డాక్టర్ కాడికి
పోయినం. ఎప్పుడు మీ కాడికే వస్తం. నిన్న నాయనే మందులు
రాశిండు. ఇయ్యాల నాయన లేడు కదా. ఎప్పుడు మంచిగనే రాస్తడు.
నిన్న కూడ బరబర మండుతుంది, కడుపుల అవస్తుందనే వస్తిమి.
గిట్ల నొప్పి ఎక్కువయ్యె మందులు రాశిండేంది?" ఏమి తెలియనట్టన్నా
కాస్త నిలదీసినట్టె అడిగింది రాజమ్మ.
రాజ్‍కుమార్ వెంటనే సర్దుకున్నడు. పోశాలును పరీక్ష చేస్తు
"మరి మందుల చిట్టేది? ఎక్కడ తీసుకున్నవ్ మందులు?"
మందులు చూస్తే వాళ్ళ షాప్‍వని అర్థమైనా అడిగాడు.
"మన షాపులనే సారు. మనిషి నిన్నటి నుండి తినుడు లేదు.
మొస పోస్తున్నడు. ఏటంటే అటె పడుతున్నడు. ఇప్పుడైనా
సరిగ చూసి కరెస్ట్ మందులు రాయుండ్రి." ముందు రాజ్‍కుమార్
అన్నమాటలతో నిన్న డాక్టర్ కరెక్ట్ మందులు రాయలేదని అనుమాన
పడ్డది రాజమ్మ.
డాక్ట్రర్ రాజ్‍కుమార్ తన తప్పు, ఆమె శ్లేష వెంటనే అర్థం చేసుకున్నడు.
"నిన్న అవస్థకు నాన్న ఈ మందులు బాగనే రాశినరు. పోశాలుకే సరిగ
పడలేదు. నేను ఇప్పుడు వేరే మందులు రాస్తా. ఈ మందులు వాపసిచ్చి
కొత్తవి తీసుకో." మందులు రాస్తు అన్నాడు
"ఏమో సారు. ఎప్పుడు మీ కాడికే వస్తము. గిన్ని ఏండ్ల బట్టి చూస్తున్నరు
మా గురించి మీకు బాగా తెలుసుని గీడికొస్తము. మూడ్రోజుల బట్టి పనికి పోక
పాయె. చేసుకుంటే బతికేటోళ్ళం. మాకేట్లెళ్లాలే. రానువోను ఆటో చార్జీలు
డబలాయె." రాజమ్మ సాగదీసింది.
"ఇగో. నా దగ్గరున్నయని ఈ మందులుస్తున్నా. కొత్త చిట్టిల మందులు రాస్తున్న.
రెండు రోజులు పెరుగన్నం పెట్టు. మూడో నాడు తీస్కొని రా. రవి, ఇక్కడ్రా. ఈ
ఇంజెక్షన్ ఇచ్చి పంపు." బైటె వున్న కంపౌండర్ను పిలిచి వెంటనే పోశాలును
రాజమ్మను బైటకు తీసుకెళ్లమని సైగ చేశాడు. ఒక్క నిమిషము లేటైనా
రాజమ్మ అమాయకంగ అన్నట్టె అన్పించినా మరింత నిలదీసినట్టు
మాట్లాడుతుందని తెలుసు.
"రామ్మా, రా. సూది ఇస్తను రా. తొందరగ నొప్పి తగ్గుతది", పోశాలును చేయి
పట్టుకొని బైటకు నడిపిస్తు తీసుకెళ్ళాడు రవి. మందుల చిట్టి డాక్టర్ దగ్గరి నుండి
తీసుకొని వెనకె నడిచింది రాజమ్మ గొనుక్కుంటు, "ఏం మందులో, ఏం రోగాలో".
**************************************
సుప్రీమ్ కోర్ట్ రెండెళ్ళ కంటె ఎక్కువ శిక్ష పడ్డ రాజకీయనాయకులు, జైల్లో
వున్న వాళ్ళను చట్ట సభలకు అనర్హులుగా చే్యాలని తీర్పునిచ్చింది. దీనిని
అటకెక్కించడానికి కేంద్రప్రభుత్వము ఆర్డినెన్స్ జారి చేయబోతుంది. ఉమ్మడిగా
పార్టీల పరంగా అందరు లోపాయకారిగ ఒప్పుకున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు
అభ్యంతరాలు తెలుపుతున్నారు. కాంగ్రేసు పార్టీ తరఫునా కాబోయె ప్రధానిగ
ప్రచారములో వున్న రాహుల్ గాంధి వ్యక్తిగతంగా తను వ్యతిరేకమని, ఆ ఆర్డినెన్స్
కాగితాలు చింపేయాలని అన్నాడు. ఈ రోజుల్లో ఎవరు ప్రభుత్వమో ఎవరు
ప్రతిపక్షమో అర్థమ్ కావటము చాలానే కష్టము.
ఓ పాత కాలం సామేత వుంది. "చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి సాని కొంపలు"
ప్రజలు వెంటనే ఏమనకున్నా ఎడ్దోళ్ళు, గుడ్డోళ్ళు కాదు. సరైన సమయములో
సరైన నిర్ణయం తీసుకుంటరు.

No comments:
Post a Comment