వరకట్నాగ్నికి గంటకు ఒక స్త్రీ బలవుంతుదని నివేదికలు
చెపుతున్నాయి. ఎన్నాళ్ళు స్త్రీలు ఇలా బలికావాలి? ఉన్న
చట్టాలను సక్రమంగా అమలు పరిస్తె, న్యాయము సకాలములో
అందితె ఇవి ఆగిపోక తప్పదు. కావలిసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి,
ప్రజలలో చైతన్యము, స్త్రీ పురుషుల్లో మానవులనె సమభావము.
స్త్రీలు విద్యావంతులై, అర్థిక స్వావలంబన, ఆత్మస్థైర్యము పెంపొందించు
కుంటే వారి జీవతములో కష్టాలను ఎదుర్కొని నిబ్బరంగా బతకగలరు.
ఎవరి జీవతములో వారె నాయకులు, ఇతరులు వస్తారు, పోతారు. ఈ
జీవతము ఏ ఒక్కరి కోసము కాదు. తన కోసం. తన కలలు తీర్చుకునే
కోసం. అందుకు తానే కష్టించి సాధించాలని తెలుసుకొని, ధైర్యముతో,
స్థైర్యముతో అఖరి ఊపిరి వరకు ముందుకు సాగె కోసం.
వరకట్న చావుల గురించి విన్నప్పుడు 1994, అక్టోబర్‍లో రాసినదానిని
ఇప్పుడు ఈ బ్లాగ్‍లో పెడుతున్నాను.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బాధలు లేని బతుకు ఉయ్యాలో /బతుకమ్మ/
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
కన్నవారింట బతుకు ఉయ్యాలో
ఆనందాల విరిజల్లులె ఉయ్యాలో /బతుకమ్మ/
కన్నెపిల్ల కనె కలలు ఉయ్యాలో
కమ్మని కలలే ఉయ్యాలో
కన్నవారు కడుమురిపెంగా ఉయ్యాలో
కోరుకున్నవాడితో ముడి పెట్టిరి ఉయ్యాలో /బతుకమ్మ/
కట్టుకున్న వాడు ఉయ్యాలో
కఠినాత్ముడాయె ఉయ్యాలో
కట్నాల కాంక్షలో ఉయ్యాలో
కాంతనే కష్టపెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకే ఉయ్యాలో
భారమై పోయె ఉయ్యాలో /బతుకమ్మ/
కాసులు తెమ్మని ఉయ్యాలో
కన్నవారింటికి తరిమె ఉయ్యాలో
తేలెని ఆ తల్లిని ఉయ్యాలో
చేతులార తగులబెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకె ఉయ్యాలో
బుగ్గిపాలాయె ఉయ్యాలో /బతుకమ్మ/
కలలు కనే ఈడులో ఉయ్యాలో
కాటికే తరలి వెళ్ళే ఉయ్యాలో
కల్సి బతక వచ్చిన పడతిని ఉయ్యాలో
మట్టుబెట్టి మన్నులో కలిపారె ఉయ్యాలో /బతుకమ్మ/
ఈ కథ మారెదెప్పుడె ఉయ్యాలో
తరుణుల తలరాత మారెదెప్పుడు ఉయ్యాలో
అతివలు చదువునేర్చి ఉయ్యాలో
ఆత్మస్థైర్యముతొ మెదలాలె ఉయ్యాలో /బతుకమ్మ/
బతుకమ్మబతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆర్థిక స్వావలంబన ఉయ్యాలో
అబలను సబల చేయును ఉయ్యాలో /బతుకమ్మ/
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు భవిష్యత్తుకు ఉయ్యాలో
ఆలోచనతో అడుగువెయ్యాలె ఉయ్యాలో /బతుకమ్మ/
స్త్రీ పురుషులు కల్సి ఉయ్యాలో
సమైక్యతతో మెదిలితె ఉయ్యాలో
సుఖశాంతులతో బతుకు ఉయ్యాలో
తీయని పాటగా సాగును ఉయ్యాలో/బతుకమ్మ/

No comments:
Post a Comment