సీమాంధ్ర రాజకీయాలు
పాపం చంద్రబాబు. వోటనుకుంటే వోటైంది. రెండు కళ్ళన్నడు.
తెలంగాణకు వ్యతిరేకం కాదన్నడు. తెలంగాణ ఇవ్వటములో
కాంగ్రేసు వెనుకాడుతుందని, దమ్ములేని కాంగ్రేసని అన్నడు.
ఏండ్లకొద్ది చర్చలు జరిగినా, తెలంగాణ ఇస్తె నాకేం అభ్యంతరం
లేదని చెప్పి, ఇప్పుడు కాంగ్రేసు తెలంగాణ ఇస్తామని ప్రకటించే
సరికి, సడెన్‍గా నిర్ణయిస్తె ఎట్లా, అందరిని - విద్యార్థులని, ఉద్యోగులను,
పిల్లలను, పెద్దలను, అయినోళ్ళను, కానోళ్లను అందరిని కూర్చో
బెట్టి మళ్ళి, మళ్ళి, మళ్ళి, మళ్ళి డిస్కషన్ల మీద డిస్కషన్లు ఎప్పటకి
పెట్టుకుంట వుండాలని విషయాన్ని సాగదీసుకుంట వుండాలని
చంద్రబాబు కోరిక. అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమము ఏ మాత్రము
పట్టించుకోని బాబు, అసెంబ్లిలో తెలంగాణ పదము వాడొద్దన్న బాబు,
వేయిమంది కంటే ఎక్కువ మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నా,
చేసుకుంటున్నఐస్ కోల్డ్ గా వున్న నాయుడుబాబు ఆంధ్రాలో జరుగుతున్న
ఉద్యమానికి రోజులు, గంటలు లెక్కపెడుతు గుండెలు బాదుకుంటుండు.
అరవై ఏళ్ళ ప్రజా ఉద్యమానికి కేంద్రము దిగివచ్చి తెలంగాణా ఇస్తె, రోజుల
ఉద్యమానికి కేంద్రము స్పందించకపోవటము దారుణమని రెండు కళ్ళనిండ
నిప్పులు కురుస్తున్నడు. ఆత్మగౌరవ యాత్రా అంటు బైలుదేరిండు. ఆంధ్రోల్లు
తెలుగోళ్ళు, తెలంగానోళ్ళు తెలుగోళ్ళు కాదా? వారికి గౌరవముండదా? వారి
ఆకాంక్షలకు, ఆశలకు, హక్కులకు, ఉద్యమానికి, పోయిన/పోతున్న ప్రాణాలకు
విలువుండదా?
ఎంతో తెలివైనవాడివనుకుంటున్న ఓ నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్ల్లు
ఎందరిని ఎన్నుపోటు పొడుస్తవు? ఇకనైనా ఒక మాటకు కట్టుబడి వుండటము
నేర్చుకో. జగన్ బెయిలు తీసుకొని జైలు బైటకు వచ్చినందుకు అప్సెట్ కాకు.
బెయిలేవచ్చింది. కేసు ఇంక కొట్టేయ్యలేదు కదా. కేసు నడుస్తునే వుంది కదా.
తెలివుంటే నీ చతురత ఉపయోగించు. ఇప్పుడు ఆంధ్రాకు ఏం కావాలో, ఆంధ్రా
ప్రజలకు రావల్సిన కేంద్ర పాకేజిల గురించి ప్రజలను చైతన్యపరుస్తు, జై ఆంధ్ర
ఉద్యమమోళ్ళ్త్తతో కలిసి ముందుకు సాగితే కాస్తైనా లాభముంటుందేమో ఆలోచించు.
****************************
పొమ్మనలేక పొగబెట్టిండ్రంటరు. నల్లారి కిరణ్ కుమార రెడ్డి అట్లాగె చేస్తుండు.
ఆంధ్రాలో హీరో కావాలని నల్లారి వారి కోరికనుకుంట. ఇష్టమోచ్చినట్టు
మాట్లాడి, కాంగ్రేసు అధిష్టానానికి కోపానికి తెప్పించి కాంగ్రేసు నుండి
బహిష్కరించ బడాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుంది. అట్లా అయితె
"సమైక్యాంధ్ర కోసము నేను సి.ఎం. పదవి వదులుకున్నాను, నన్ను సి.ఎం.
చేసిన పార్టీనే వదులుకున్నాను" అని చెప్పుకోవాలని, అట్లా తను ఓ కొత్త
పార్టీ పెట్టి మళ్ళి సీమాంధ్ర సి.ఎం కావాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ప్లాననుకుంటా. గుడ్‍లక్.
************************************
జగన్‍కు బెయిలు రావటముతో రాజకీయ పార్టీలన్ని తమ స్ట్రాటజిని పున
రాలోచించుకోవల్సిన అవసరమేర్పడింది. జగన్ బెయిలతో వారి కుటుంబ
సభ్యులు ఆనందపడటము, పార్టీ వారు గంతులెయ్యటము సహజమే. జగన్‍కు
బెయిల్ వచ్చింది కాని కేసునుండి అక్విట్ కాలేదు కదా. వేరే పార్టీలు జగన్
బెయిల్ గురించి పట్టించుకోవల్సిన పని లేదనుకుంటా. కేసు పూర్తి కావడానికి
ఎన్ని దశాబ్దాలు పడుతుందో! కాబట్టి చార్జిషీట్ ఫైల్ కావడము పూర్తి కాగానే
బెయిల్ రావటము తప్పదు కదా. జగన్ పట్టుదలను మెచ్చుకోవాలి. బెయిలు
కోసం ఎన్నిసార్ల్లు ప్రయత్నించాడో! మొత్తానికి సాధంచాడు. అందుకే అంటారు
"Try, try, try again, never say die"
*****************************************
లోకసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ తాను ఓ మేధావని, చాలా తెలివిగా
మాట్లాడుతానని, రాజకీయాలకు విలువలు తాను మాత్రమే నేర్పిస్తున్నాని తెగ
చెప్పుకుంటాడు. పరిపాలన వికేంద్రికరణ గురించి ఒకప్పుడు తెగ లెక్చర్లు కూడ
దంచిండు. తెలంగాణ విషయమోచ్చెసరికి విలువలన్ని మూటకట్టి మూసీలో పడె
సిండు. ఆంధ్ర బుద్ధి, పక్షపాత బుద్ధి, స్వార్థ ప్రయోజనాలకే పెద్ద పీట వేసి తాను
కూడ నేటి తరం రాజకీయనాయకుడని నిరూపించుకున్నడు. మాటలేన్ని మాట్లా
డిన చేతలు మనిషి అసలు గుణాన్ని బైటపెడుతయి.

No comments:
Post a Comment