షేవ్ ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణలో తెలంగాణ వాళ్ళు సభ పెట్టుకున్నా, ఆంధ్రోళ్ళు
సభ పెట్టుకున్నాలాఠీలు విరగటము, భాష్ప వాయుగోలాలు
పేలటము తెలంగాణ పిల్లల మీదనే. ఇది ఆంధ్రోళ్ళ ప్రభుత్వం.
సీమాంధ్రులు ఏం జేసినా, మీ పీకలు తెగ్గోస్తామని తెలంగాణ
పిల్లలను బెదిరించిన, వారికే ఫుల్లు రక్షణ.
‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభలో తెలంగాణ వారికి చోటు లేదు. ‘కలసి
వుంటే కలదు సుఖమ’నేవాళ్ళ సభలో వున్న ఒక్క తెలంగాణ
వ్యక్తిని కుర్చీలతో కొట్టి తరిమేశిండ్రు. వాళ్లకు బందొబస్తుకు వచ్చిన
పోలీసు కానస్టేబుల్ శ్రీనివాస్ గౌడును తోటి ఆంధ్ర పోలీసులు,
అన్నదమ్ముల్లా కలిసుందామనేటోళ్ళు, గుమ్ముగూడి ఒక్కడిని
ఇష్టమోచిన్నట్టు కొట్టిండ్రు. మాయం జెద్దామ్నుకున్నరేమోని డౌటు.
కాని ప్రపంచమంతా ఆ దృశ్యము చూసింది కాబట్టి ఆ బిడ్డను వదిలేసినరు.
విద్యార్థి బదులు టీచరె పరీక్ష రాసినంక ఫర్స్ట్ క్లాసు వస్తె ఎంత గొప్పగ
చెప్పుకుంటారో అట్ల ఏపి ఎన్జివో నేత ఖుషి ఖుషిగా సభ సక్సెస్ అయిందని
చెప్పుకుంటుండు. ‘నియమాలు వున్నదే ఉల్లంఘించటాని్కే’ అన్న ఆశోక్
బాబు అది మొన్నటి సభలో చేతల్లో నిరూపించిండు. మహామహా మేధావులు
కూడా మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పడానికేమో, చలసాని శ్రీనివాస్‍ను
వేదిక మీద దిష్టి బొమ్మలా వుండటానికి కూర్చోబెట్టిండు. చలసానికి కాస్తైన
సిగ్గు శరముంటే ఇంకోసారి ఏపి ఎన్జివోల ఇలాంటి సభలకు దూరముంటాడను
కుంటా.
సభలో అంతా ఎప్పటిలాగె తెలంగాణ వేరైతె మా బతుకులు బండలే అని,
తెలంగాణ మీద వాళ్ళు ఇన్నాళ్ళు ఎంత ఆధారపడి వున్నారో తెలపటము,
వాళ్ళు ఇన్నాళ్ళు తెలంగాణను అన్ని విధాలా దోపిడి చేస్తున్నారని చెప్పకనే
చెప్పినరు. ఈ సభలో ప్రత్యెక ఆకర్షణ కైకాశుర్పణఖే. ఎప్పడిదో ఓ మాట పట్టుకొని,
చెప్పుడు మాటలకు, భరతుడుని రాజు చేయమనుడె కాక రాముడు పదునాలుగేండ్లు
వనవాసానికి వెళ్లాలని కోరింది కైకేయి . రామలక్షమణులు వివాహితులని
తెలిసికూడ వారి పై కోరికను పెంచుకొని కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది
శూర్పనఖ. ఇప్పటి ఈ కైకాశూర్పనఖకు తెలంగాణ చరిత్ర, ఆ ప్రజల ఆవేదన అవసరము
లేదు. ఆమే ప్రాంతం బిడ్డల కడుపు నిండుతే చాలు. వెయ్యిమంది కంటె ఎక్కువ
తెలంగాణ బిడ్డలు చనిపోతె ఆ తల్లికి అవసరము లేదు. తల్లికి దుర్మార్గుడైనా
సొంత కొడుకు ఒక పూట ఆకలిగా వుంటే గుండె తల్లడిల్లుతుంది కాని సవతి కొడుకు
ధర్మాత్ముడై తన కుటుంబాన్ని పోషిస్తు తాను మాత్రము ఆకలితో అలమంటించి
చనిపోతె అదివాడి ‘ఖర్మ’ అని మూతివిరుస్తుంది. ఈ కైకాశుర్పనఖకు బతుకు విలువ,
బతుకమ్మ విలువ తెలుసా? తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించే బతుకమ్మని
తాన్నెన్నడైనా చేతిలో పట్టుకుందా? మాటల గారడి కాదు, సత్యము పలుకు తల్లి.
ఆ పాటగాడు మహా గ్రేటట! గిన్నిస్ రికార్డూ వుందటా! ఈ దేశములోనే పుట్టి పెరిగాడు.
కాని జాతీయగీతము మాత్రము పాడటం చేతకాదట. ఇది ఆంధ్రోళ్ళ గొప్పతనం!

No comments:
Post a Comment