వినాయక నిమజ్జనము
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఈ సారి దీనికి ఓ
కొత్త పదం వాడినరు. ‘విసర్జన్’ అని అన్నారు. విసర్జనమంటె
నాకు నచ్చలేదు. నిమజ్జనమంటేనే బాగుంది. పరిస్థితి అదే
అయినా, అర్థము దాదాపు అదే అయినా అన్ని రోజులు పూజలు
చేసిన వినాయకుడిని విసర్జించినమనే కంటే నీటిలో నిమజ్జనం
చేసినమనుడె గౌరవప్రదంగా అనిపిస్తుంది.
దాదుపు 60,000 వినాయకులను జంటనగారల్లో పెట్టారట. అవే
కాక ఇండ్లల్ల పెట్టిన చిట్టి పొట్టి వినాయకులు ఎన్నిలక్షలో. ఇన్ని
వినాయకులను హుస్సేన్‍సాగర్‍లో వేస్తె ఆ చెరువేం కావాలి. ఇప్పటికే
అది చెత్తచెదారము, మురికినీళ్లు పనికిరాని నీటిమొక్కలతో సగం
కూడుక పోయింది. నా చిన్నప్పుడు ఆ చెరువు ఆవలి గట్టు కనిపించేది
కాదు. ఇప్పుడైతె ఆమడ దూరములో బిల్డింగులే బిల్డింగులు. ఆ
మురికి వాసన పీలుస్తు ఆ బిల్డింగ్గుల్లో జనాలుంటున్నారంటే నాకైతె
ఆశ్చర్యమే. వాళ్లకు దమ్ము బీమారులేమి రావా?
అప్పుడెప్పుడో చాలా ఏండ్ల కింద బాల గంగాధర్ తిలక్ బిటిష్ వారికి
వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటము చేస్తు, దేశ ప్రజలో జాతీయత భావాన్ని
పెంచేందుకు ఈ వినాయక ఉత్సవాలు మొదలు పెట్టాడు. ఆ వారసత్వము
అట్లనే నడుస్తుంది. అది ఇప్పుడు పర్యావరణానికే మోసం తెస్తుంది. ఇప్పుడు
గల్లి గల్లికో విగ్రహాన్ని పెట్టి, మైకులు పట్టి జనాలను అదరగొడుతున్నారు. పెద్ద
పెద్ద పందిళ్ళు, వాటికి లైట్లతో అలంకరణలు, వాడ పొడుగుతా బోలెడు వరసల్లో
సీరియల్ లైట్లు, అమ్మో రాను రాను, అన్ని పెరిగి దానితో పాటు చందాల దందా
విపరీతంగా పెరుగుతుంది. వినాయకుని లడ్డు కూడ వో పెద్ద బిజినెస్ అయితుందని
పిస్తుంది. మొన్న 12లక్షల లడ్డు చెరువులో పడెశారంటే చాలానే బాధనిపించింది.
మన దెశములో సగానికి సగమంది పిల్లలు పౌష్టికాహారలోపంతో అనారోగ్యం పాలౌతు
న్నరు. తిండి లేక చనిపోయెవాళ్ళు వున్నరు. అంత డబ్బుతో కొన్ని అనాధ శరణా
లయాల్లో ఎంతో మందికి కొద్ది రోజులు తిండి పెట్టొచ్చు కదా.
ప్రతి ఏడు ఇన్నిన్ని విగ్రహాలు చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతిని నాశనము చేసేకంటే
గుడిలో వుండె వినాయకుడికి పూజలు చేసి, అక్కడె ఆ తొమ్మిది రోజులు
జాతీయత,పర్యావరణపై అవగాహన పెంపొందించె రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు
చేస్తె బాగుండదా? వినాయకుడిని పూజించె అన్ని రకాల ఫలము, పత్రి, పుష్పము,
వాటి ఉపయోగాలు, ఆరోగ్యవిలువల గురించి అందరికి అవగాహన కలిగించవచ్చు.
ప్రతి ఊళ్ళొ గుడి వుంటుంది. ప్రతి బస్తీలో, వాడలో గుడి వుంటుంది.
ప్రతి ఇంట్లో వినాయక విగ్రహము కాని పటము కాని ఉంటుంది. ఇంట్లో పూజలు ఎట్లాగు
చేస్తరు. ఆ తరువాత పండగ నాడు చాలా మందె గుడికి వెళ్తారు. గుడిలో కార్యక్రమాలలో
విజేతలకు బహుమతులివ్వటము, తరువాత మండల స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలు పెట్టి
అఖరు నాడు వారికి బహుమతులివ్వటము జాతి భావము కలిగిస్తుంది కద.
పెద్దలంతా కూర్చొని ఏదొ ఆలోచించి పర్యావరణ పాడవకుండా, సంస్కృతిని కాపాడుకుంటు
ముందుకు పోయే విధానము ఆలోచించాలి. ఛాందస భావలతో భావితరాల భవితకు
విఘాతము కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:
Post a Comment