Tuesday, December 17, 2013

News - Views

చంద్రబాబు - సార్థకమైన పునర్జన్మ 
"చంద్రబాబు రేపు శాసన సభలో మాట్లాడుతాడంటవా?"
"తొందరెందుకు?  రేపు చూస్తం కదా."
"ఏమో.  నాకైతె డౌటే.  అఖిల పక్షం పెట్టమన్నడు.  పెడ్తెనేమో
బహిష్కరించిండు.  ఆంటోని కమిటి పెడ్తె, అది కాంగ్రేసోళ్లది అని
లెక్కచేసిది లేదన్నడు.  GOM పిలిస్తె పట్టించుకోలేదు.  సమ
న్యాయం అంటున్నావు, అది ఏట్లనో చెప్పు నాయనంటె, అధికారం
నాకివ్వండి.  ఆరునెలల్లో పరిష్క్రరిస్తనంటడు.  అధికారకోసం కలవరి
స్తుండు తప్పితె అసలు విషయం మాట్లాడ్డు."
"ఒకప్పుడు కేంద్రాన్ని ఆడించిండు కదా.  NDA అధికారములో
వున్నప్పుడు ఈయనకప్పుడు ఢిల్లీలో రెడ్ కార్పేట్ పర్చేటోళ్లు.  ఇప్పుడు
కూడ అట్లాంటి మర్యాద కావలంటె వస్తదా?  కేంద్రం ఆయన్ను ప్రత్యెకంగా
బొట్టు పెట్టి పిల్వాలని కోరికనుకుంట."
"మాట తప్పినోడికి మర్యాదేంటి.  డిసెంబర్ పది 2009 నాడు ఆయన
మాట్లాడిన మాటలు ఎవరైనా మర్చిపోతరా?  రాష్ట్రములో ప్రధాన ప్రతి
పక్షనేతై వుండి, మాటమార్చి మడమ తిప్పినందువల్ల కేంద్రము తన
నిర్ణయాన్ని అటకెక్కించాల్సి వచ్చింది.  దేశము పరువె పొయింది."
"ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రేసోల్లు వేస్తున్నవేషాలకు కాంగ్రేసు పరువు, దానితో
పాటు దేశం పరువు పోతలేదా?"
"అవుననుకో.  పరువు సంగతేమో కాని ప్రపంచాని కంతా సీమాంధ్రోల్లు ఎంత
దుర్మార్గులో, నీతిమాలినోళ్లు మాత్రాం తెలిసిపోయింది.  ఈ సంగతి తెల్సిన
మన దేశములోనె కాదు విదేశీయులు కూడ వీళ్ళను దగ్గర తీయడానికి, అధికార
మివ్వడానికి భయపడుతరు.  వాళ్లకు సందిస్తె ఎంత దోచుకొవచ్చొ అంత దోచుకోవడమే
కాదు, సిగ్గు లేకుండ అది తమ హక్కుగ ప్రకటించుకుంటరు.  దోచుకోవటము అలవాటై
ఇప్పుడు రాష్ట్రము విడిపోతుందంటే ఎంత కోపమొస్తుందొ.  మొన్న చంద్రబాబు మీడియా
సమావేశము చూడాల్సింది!  బిల్లు అంత అర్జేంటుగా స్పెషల్ ప్లేనులో పంపాలా అంటడు.
సమన్యాయమ చేయట్లేదు,  మా గొంతులు కోస్తున్నరంటడు.  నాకు అధికారమిస్తె ఆరు
నెలల్లో అంతా చక్కబెడ్తనంటడు."
"పెడ్తడు, పెడ్తడు.  ఆయన ఆస్తులు, ఆయనోల్ల ఆస్తులు చక్కబెట్టుకుంటడు."
"ఏమో గాని, ఆ రోజైతె ఆయన మాటల్లో ఎంత కోపము, ఆవేశము, ఆక్రోశము,
ఉక్రోశము, అసహనము వుండెనో! పాపం, జర్నలిస్టులు ముందు బిత్తరపోయినా,
కొడ్తడేమో అని భయపడ్డా, తర్వాత నవ్వుకొని వుంటరు.  చంద్రబాబు మెదడులో
గ్రే మాటరంతా బ్లాక్ అయిపోయిందని అనుకొనివుంటరు."
"ఆయన మెదడెప్పుడో బ్లాంక్ అయింది.  తన చేతకాని తనము తెలిసె BJPతో పొత్తుకు
మోడి వెంట కుక్కలా తిరుగుతున్నడు."
"అవునవును.  ఒకప్పుడు మోడి హైద్రాబదొస్తె మత ఘర్షణలు అయితైయని రానివ్వలేదు.
ఇప్పుడు ఆయన ఆదర్శ పురుషుడైండు.  అన్నట్టు ఈ మధ్య మోడి పెట్టుకునేలాంటి అద్దాలు
కూడ పెట్టుడు షురు చేసిండు."
"చంద్రబాబు అని చంద్రుని పేరెవరు పెట్టారో కాని సార్థక నామధేయుడయ్యాడు.  తిన్నింటి వాసాలు
లెక్కపెట్టె రకం.  తన సొంతంగా ఒక్క ఎలెక్షన్ కూడ గెలవలేదు.  ముందు మామను వెన్నుపోటు
పోడిచి ముఖ్యమంత్రైండు.  తర్వాత BJPతో పొత్తువల్ల ఆ వేవ్‍లో గెలిచిండు.  సొంతంగ పోటి చేసి
నలభై సీట్లేమో గెలిచిండనుకుంట.  మొన్నటి సారి TRSతో పొత్తు వల్ల తెలంగాణలో గెలిచి కౌంట్
పెంచుకున్నడు."
"అంత పొత్తు పెట్టుకున్నోడు ఇప్పుడెమి చేస్తడో?  ఇంతకు సభలో మాట్లాడతడంటవా లేకపోతే
కేంద్రము పంపిన బిల్లు, ఢిల్లీ వాళ్ళకు రాష్ట్రము మీద ఏమి అధికారమని, తెలుగుజాతి మీద సర్వ
హక్కులు తనవేనంటు, దోపిడి చేయడానికి, దగా చేయాడానికి, వెన్నుపోటు పొడవడానికి తనకే
పేటెంటు వుందని గొంతు నరాలు ఉబ్బి చిట్లి పొయెఅంత అవేశముతో మీడియా వాళ్ల దగ్గర
చిందులేస్తడంటవా?"
"ఏమి చేస్తడో ఏమో కాని, ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో అందరు చంద్రబాబుకు
మెంటల్ అయిండని అనుమాన పడ్తున్నరు."
"కాని చంద్రబాబు తాను అలిపిరి వద్ద అట్టాక్‍లో బతికి బైటపడ్డది ఏదో ఘనకార్యము సాధించడానికని
అంటడు!"
"సొంత శక్తితో ఒక్క ఎలక్షని గెలెవనోడు ఏమి సాధిస్తడు?"
"అట్లెందుకంటవ్?  అసలు చంద్రబాబు లేఖ ఇచ్చినందువల్లె కేంద్రము తెలంగాణపై
నిర్ణయము తీసుకుందంటరు కదా.  తెలంగాణ పదము ఉచ్చరించరాదని కట్టడి చేసిన
బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వటము, తెలంగాణకు అనుకూలంగా తీర్మానము
చేయండి, లేదా మేము తీర్మానము పెడ్తానని అనటము, తెలంగాణ ఇవ్వల్సింది కేంద్రమేనని
అనటము, కేంద్రము తెలంగాణ ఇస్తుందని ప్రకటించినప్పుడు ఆంధ్రాలో రాజధాని నిర్మాణానికి
పాకేజి కావలని ప్రకటించటము, ఇవ్వన్ని ఆ దైవ నిర్ణయమే అనుకుంట.  చేసిన పాపాన్ని
కడిగేసుకోవడమే! ఇప్పుడైనా బాబు తను చేసిన ఘనకార్యము అర్థం చేసుకొని,
తన పునర్జన్మ సార్థకమైందని తెలిసికొని శాసన సభలో హుందాగా ప్రవర్తిస్తాడని ఆశిద్దాం!"

Monday, December 2, 2013

News - Views

కొసరొద్దు - పది జిల్లాల తెలంగాణ ముద్దు  
"బాబుగారు క్రిష్ణ నీళ్ళ కోసమే ఢిల్లీ వెళ్ళిండంటవా?"
"అనే అంటున్నడు కదా!"
"అనుడు సరే.  ఎప్పుడు తెలంగాణ గురించి కేంద్రము వో
నిర్ణయానికి వస్తుందన్నప్పుడల్లా ఈ పెద్ద మనిషి అక్కడె
వుంటాడు."
"నిజమే.  ఏమైనా బాక్ రూమ్ పాలిటిక్స్ వుంటయేమో.  చీకటి
ఒప్పందాలుంటయేమో?"
"అంతే అనుకోవల్సి వస్తుంది.  మరి రాయల తెలంగాణ అని ఈ
లీకులు, మీడియా ప్రచారలేంది?  సీడబ్ల్యుసీ నిర్ణయము శిలాశాసనమని
చెప్పినరు కదా.  మరి దాన్నిఇట్ల మార్చుడెంది?  ఒకే ఒక సీమాంధ్ర
మంత్రి అడిగిండు.  అక్కడ, ఇక్కడా అందరు దాన్ని వ్యతిరేకిస్తున్నరు.
అయినా రెండు జిల్లాలు కలిపి దాని పేరు ముందు తగిలించుడు అన్యాయం."
"కాంగ్రేసోళ్ళు ఏదైనా అంత తొందరగా తేల్చరు కదా.
మొదటి నుండి పది జిల్ల్లాల తెలంగాణ అని అన్ని పార్టీలు, అఖిల
పక్ష మీటింగులు, అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడిండ్రు.
ఇప్పుడు ఒక్క కాంగ్రేసు దాని మాటమీద వెనిక్కి పోతే అందరు అట్ల
పోరు కదా.  అసలు కాంగ్రేసుకె తెలంగాణ ఇచ్చె ఉద్దేశము లేదని అను
కోవల్సోస్తుంది."
"అసలు రాయలసీమను రెండు ముక్కలు చేసే కంటె ఆ నాలుగు జిల్లాలు
ఒక రాష్ట్రంగా చేస్తె సరిపోతుంది.  అట్ల చేస్తె మళ్లమళ్ల తెలుగు వాళ్ల మధ్య
గొడవలు రాకుండ వుంటాయి.  రాయల సీమ వాళ్లకు కూడ ఆంధ్రోళ్లతో కల్సి
బతకలేమనే భయముంది కదా."
"అసలు ఇదంతా సీమాంధ్ర మీడియా సృష్టేమో.  తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా వుంటే
ఓర్వలేరనుకుంటా.  తెలంగాణ వస్తుందని నిమ్మలంగ వుండకుండ చేసేందుకు
ఈ కుట్రలు ఆంధ్రోల్లవే ననుకుంట."
"ఎంత మానసిక హింస!  ఆ తెలంగాణ బిల్లు ఎప్పుడోస్తుందో, ఎట్లొస్తుందో, ఎప్పుడు
పాసై తెలంగాణ వస్తుందో, ఈ హింస ఎప్పుడు ఆగుతుందో?"
"ఈ నెలలో తెలిపోతుందనుకుంటా."
"అరవై ఏండ్ల గోస.  మరో అరవై రోజుల్లోనైన సంతృప్తికరంగా ముగుస్తుందో, లేక
మరో కొత్త పోరు మొదలౌతుందో చూడాలె."
  

Monday, November 25, 2013

News - Views

ఏం టీ నాన్చుడు?
మళ్ళి  కొత్త కథ మొదలు పెట్టినరు.  రాయల తెలంగాణ
ఇస్తె ఎట్లుంటదని కేంద్రం ఆలోచిస్తుందంట.  ఇద ఎవరి
ఆలోచన, ఎందుకీ కొత్త ఆలోచన?  సీడబ్ల్యుసీ ఏదైనా
చెపితె అది శిలాశాసనమని అన్నరు.  హైదరాబాదు
రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని కదా
సీడబ్ల్యుసీ ఈ ఏడాది జులై ముప్పైన నిర్ణయించినట్టు
ప్రకటించింది.  ఇప్పుడు దాన్ని రాయల తెలంగాణాగా
మార్చుకుంటే ఆ నిర్ణయము పెన్సిల్ గీతలా, లేకపోతె
నీటి మూటలా?  ఈ అనుమానము నాకే కాదు అందరికి
వస్తుంది.  కేంద్రం తెలంగాణ విషయము మళ్లి నాన్చాలనుకుంటుందా?
ఇందులో సీమాంధ్రు నాయకుల కుట్ర్ల ఏమైవుంటుంది?
పొరపాటున రాయల తెలంగాణ అంటె ఇప్పడి వరకు తయారు
చేసిన తెలంగాణ బిల్లు మూల పెట్టి మళ్ళి కొత్తది తయారు
చేయాల్సిందే.  అంటె తెలంగాణ బిల్లు రాబోయె శీతాకాల సమా
వేశాల్లో రాకుండ అపేస్తె ఆ తరువాత యుపియె హయాంలో
తెలంగాణ రాకుండ ఆపేసినట్టే.  అంతే కాకుండ, సీడబ్ల్యుసీ తన
నిర్ణయాన్ని మార్చుకుంది కాబట్టి, అది శిలాశాసనము కానట్టె.
కాబట్టి సీడబ్ల్యుసీ ఒక నిర్ణయాన్ని వెనిక్కి తీసుకుంటె, అట్లాగె
తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కూడ మార్చుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా
వుంచాలని సీమాంధ్ర నాయకులు అన్ని శక్తియుక్తులతో తీవ్ర ప్రయత్నం
చేస్తరు.  సో, తెలంగాణ కాంగ్రేసు నాయకులెవ్వరు రాయల తెలంగాణకు
పొరపాటున కూడ ఆవగింజలో వెయ్యోవంతు కూడ సానుకులత చూపొద్దు.
రాయల తెలంగాణ వద్దే వద్దు.  హైదరాబాదు రాజధానిగా పది జిల్ల్లాల
తెలంగాణే ముద్దు. 

Monday, November 18, 2013

News - Views

ఆత్మగౌరవ ఓదార్పు
"కేంద్రము తెలంగాన ఏర్పాటుకు చక చక ముందుకు పోతున్నట్టె
వుంది కదా".
"అవును.  తెలంగాణ వచ్చుడు ఖాయములే."
"మరి గీ బాబులు ఇంకా ఏందో యాత్రలు చేస్తరంట?"
"చేస్తరు, చేస్తరు.  మరి అధికారమెటు లేదు.  ప్రజల మధ్య
వుంటానికి, టీవిలల్ల కనబడ్డానికి ఏదో చెయ్యాల గద."
"ఏం చేసుడో, ఏందో.  పచ్చ జెండాయనకు ఆత్మగౌరవం  తక్కు
వైందట.  ఆత్మగౌరవ యాత్ర చేస్తడంట.  మాటకు కట్టుబడనోళ్లకు
గౌరవముంటదా?  మాటలు మారుస్తు, వెన్నుపోటు పోడిచేటోడిని
ఎవరు గౌరవిస్తరు?  ఎవరి గౌరవాన్ని పెంచుతడు?  జగనన్నకేమో
ఓదార్పు కావలంట.  ఈ ఓదార్పు ఎవరి కోసము, ఎందుకొసమో
నాకైతె సమజైతలేదు."
"జైల్లొ వుండి వచ్చిండు కదా.  ఆయన ప్రజల్ను ఓదార్చుడు కాదు.
ప్రజలు ఆయన్ను ఓదార్చాలె."
"కరక్టే.  తండ్రి పోయి నాలుగేండ్లాయె.  వారసత్వంగా ముఖ్యమంత్రి
పీఠం మీద కూర్చోవల్సింది పోయి జైల్లో యాడాది కంటె ఎక్కువ
వుండాల్సి వచ్చే.  ఇప్పుడేమో తెలంగాణలో పార్టీ అడ్రెస్ లేకుండా
పోయె.  పాపం. జగనుకేన్ని కష్టాలో.  నిజంగానే ఆయనకు ఓదార్పు
అవసరము.  జనాలంత ఇడుపులపాయకో, తామరకొలనుకో పోయి
కొన్నాళ్ళుండి జగనన్నను, ఆయన కుటుంబాన్ని ఓదారుస్తె బాగుంటది."
"షర్మిలమ్మను ఓదార్చలన్న విషయాన్ని ఎట్లా మర్చిపోయవని నేను
అడగదల్చుకున్నా."
"అవునవును.  ఆ బాణం ఇప్పుడె అమ్ముల పొదిలో వుందో తెలుసికొని
ఓదార్చాల్సిందె.  ఆ బాణం అరిగి పోయిందా, విరిగిపోయిందా ఏ మూలుందో
ఎవరికి తెలుస్తలేదు.  అసలు సిసలు ఓదార్పు ఆమెకె కావాలె."
"ఇవాళ్టితో జీవోఎమ్‍తో పార్టీల, మంత్రుల భేటి ఆఖరైంది కాబట్టి, ఇక కాంగ్రేసోళ్ళు
కూడ జోరుగా జైత్ర యాత్రలు చేపడ్తరు కావచ్చు."
"నిజంగా వాళ్లకు కొంచెం కూడ ‘ఇది’ లేదు.  పిల్లలు ఉద్యమాలు చేసి ప్రాణాలు
పోగొట్టుకుంటుంటే, ఆస్పటల్లో, జైల్లో పడితె ఒక్కనాడన్న పట్టించుకున్నరా?
ఇప్పుడు మేమె తెలంగాణ తెచ్చినమని సభలు పెట్టి డప్పు కొట్టుకుంటున్నరు.
కిరణ్‍కుమార్ రెడ్డి అయితే రచ్చబండ పేరుతో లేనిపోని అబద్ధాలు చెప్పుకుంట
అన్ని జిల్ల్లాలుకు తిరుగుతున్నడు.  తెలంగాణలో రానిస్తలేరు కాబట్టి ఆంధ్రకెళ్లి
విషం కక్కుతున్నడు."
"అసలు కిరణ్‍కుమార్ కాంగ్రేసు నాటకములో పావేమో?  లేక పోతే పోతే సీమాంధ్ర
కన్న తెలంగాణకే చాలా నష్టమని కొత్త ప్రచారము స్టార్ట్ చేసిండు.  ఇది సమైక్యమని
అనేవాళ్లకు కాస్త ఓదార్పుగ పనిచేస్తుందేమో."
"ఈ రాజకీయ నాటకాలేమో కాని అంతా ప్రజల ఉసురు పోసుకుంటున్నరు.  60 ఏండ్ల
బట్టి పోరాడుతుంటే, ఇప్పటి వరకు 1500 మంది ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ
సాధించుకుంటె, ఇంకా ఓట్లకోసం సీట్లకోసం అన్ని పార్టీలు  ప్రతిరోజు ఏదో ఒక పరెషాన్
చేసె మాటలంటు ప్రజలను టెన్షన్లో పెడుతున్నరు.  ఈ ఏడాది ఈ కథ ముగిసి కొత్త
ఏడాదన్న ప్రశాంతంగ గడవాలె."

Thursday, November 14, 2013

News - Views

చంద్రబాబు - ధృతరాష్ట్ర ప్రేమ
చివరాఖరకు చంద్రబాబు జీవొఎం ముందుకు తాను
వెళ్లలేదు.  పార్టీ నుండి కూడ ఎవరిని పంపలేదు.  అసలు
ఆయన ఆలోచన పద్ధతేంటో ఎవరికి సమజైత లేదనుకుంటా.
విభజన తప్పదని తెలిసి కూడ సమన్యాయమేంటో చెప్పలేక
పోవడము తొమ్మిదేళ్లు ఆం.ప్ర. ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు
అఙ్ఞానాన్ని అవకాశవాదాన్ని, వెన్నుపోటు గుణాన్ని బైటపెడుతుంది.
వైకాపా సమైక్యవాదాన్నైన వినిపించి, మేము విభజన ఆపడానికి
అన్ని ప్రయత్నాలు చేసినట్టు ప్రజలకు చెప్పుకోవచ్చు.  విభజన
అనుకూలంగ లేఖ ఇచ్చి వెనిక్కి తీసుకోని బాబు రేపు ప్రజలకు
ఏం చెప్పుకుంటాడు?  వేయికి మించి ఆత్మహత్యలకు కారణమై
బాబును తెలంగాణ ప్రజలు ఎలాగు క్షమించరు.  విభజన తరువాత
తమకు కావలసిందేమిటో చెప్పని బాబును ఆంధ్రప్రజలు మన్నిస్తారని
అనుకోను.  ఎన్డియే హయాములో కేంద్రాన్ని తెలంగాణ ఇవ్వకుండ
శాసించిన చంద్రబాబుకు యుపియె ప్రభుత్వము ముందు తన ప్రజల
అవసరాలను ముందుపెట్టడానికి అహంకారము అడ్డమొచ్చిందను
కుంట.  అన్ని పార్టీలు కేంద్రానికి తమ అభిప్రాయాలు తెలిపినప్పుడు
చంద్రబాబు తెల్పక పోవడము అతని ఆంధ్ర అభిజాత్యానికి, అహం
కారానికి పరాకాష్ట.
చంద్రబాబు అదివరకు రెండు కళ్ల సిద్ధాంతము గురించి మాట్లాడిండు.
కళ్లు రెండైనా చూపు ఒకటె కద, మెల్ల కన్నుంటె తప్ప.  సరె, పోని.
చూపు సీమాంధ్రా వైపనుకున్నా తీర విభజన సమయములో ఆంధ్రోళ్లకు
ఏం న్యాయం కావాలో చెప్పలేదు.  అంటె ప్రస్తుతానికి అతనికి రెండు కళ్లలో
పూవు (cataract) వచ్చిందా లేక షుగరుంది కాబట్టి నరాలు దెబ్బ
తిన్నాయా? అందుకే సీమాంధ్ర భవిషత్తుకు ఎలాంటి vision ముందు
పెట్టలేక పోయిండు.
 రెండు కళ్ల తరువాత సమన్యాయము పాటెత్తుకున్నడు.
అసలుకైతె ఈ పదాన్ని ముందు ముందుకు పట్టుకొచ్చింది శ్రీమతి
విజయలక్షమ్మమ్మగారు.  దాన్ని కాస్త చంద్రబాబుతో సహా అందరు
అంది పుచ్చుకున్నరు.  సమన్యాయం జరగట్లేదనే తెలంగాణ వాదము,
పోరాటము ముందుకొచ్చింది.  రాజకీయ ఉద్యమ పార్టీగా తెరాస
అహింసాయుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటము చేస్తు, ప్రజాస్వామ్య
బద్ధంగా ఓట్లు, సీట్లు సాధించుకొని శాసించి తెలంగాణ తెచ్చుకుంది.
ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారనే వాళ్లు - రాజకీయ పార్టీలు,
తెరాసతో పొత్తు పెట్టుకున్నది, తెలంగాణకు అనుకూలంగ లేఖ ఇచ్చింది,
తెలంగాణకు అనుకూలమని తరువాత సమైక్య రాగమందుకున్నది
ఓట్లు, సీట్ల కోసం కాదా?  తెలంగాణకు అనుకూలం కాని రాజకీయ
పార్టీ తెలంగణలో అడ్రసు లేకుండా పోతుందని తెలిసే కదా అన్ని పార్టీలు,
ఒక CPM మినహా ఎప్పుడో అప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మేము
అడ్డము కాదు, నిలువు కాదని అన్నయి.  CPM కూడ ఆఖరకు మేము
అడ్డుపడతె మాత్రము మీరు ఇవ్వడము ఆపుతారా? మీ ఇష్టం.  ఏం చేస్తారో
చేయండి అని చెప్పింది.  ఈ రెండు కళ్ల బాబుకే స్పష్టత లేదు.  తెలంగాణకు
వ్యతిరేకము కాదంటడు.  సమన్యాయమంటడు.  ఏ విధంగా సమన్యాయము
చేయాలో చెప్పడు.  తెలుగుజాతి ముక్కలు చేస్తున్నరని, జాతిని ఒక్కటిగా
వుండాలని అంటడు.  అంటే, రాష్ట్రాన్ని విభజించవద్దని చెప్పొచ్చు కదా.  అట్లా
చెప్పడు.  అసలు చంద్రబాబు ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నడు?
తనను తనే మోసగించుకోవటముతో సాధించేదేమిటో?
ఈ మధ్య ఇద్దరు కొడుకుల సిద్ధాంతాన్ని పట్టుకొచ్చిండు. ఇక్కడ కూడ gender
bias. ఇద్దరు పిల్లలనొచ్చు కదా?  సరె పోని.  ఒక్కరె సంతానము వున్నప్పుడు
choice వుండదు.  ఒక్కరికంటె ఎక్కువ పిల్లలున్నప్పడు అందరిని ప్రేమగా
చూసినా ఎవరో ఒకరిపట్ల కాస్త పక్షపాతము వుండొచ్చని, దానికి కారణాలు
వుండొచ్చని పురాణ కాలం నుండి కూడ దృష్టాంతాలు వున్నాయి.  ఈ మధ్య
కాలములో అమెరికాలో ఓ యూనివర్సిటి వాళ్లు పరిశో్ధించి మరీ చెప్పారు
తల్లిదండ్ర్ల్లు పిల్లలందరిని ప్రేమించినా వాళ్లకు ఒక్కొక్కరి పట్ల ప్రత్యేక అభిమాన
ముండొచ్చని.  దానికి వారికి కారణాలు కూడ వుంటాయి.  నేను చిన్నప్పుడు
రామాయణము చదివినప్పుడు ఒక కథ నాకు బాగ గుర్తుండి పోయింది.
విశ్వామిత్రుడు ఒకసారి యాగము చేయటానికి యఙ్ఞ పశువుగా కట్టడానికి
మనిషి కావల్సి వచ్చింది.  అప్పుడతను తన చెల్లెలు దగ్గరకు వెళ్తాడు.  ఆమెకు
ముగ్గురు కొడుకులు.  చెల్లెలుకు తను వచ్చిన పని చెపుతాడు.  అప్పుడు విశ్వా
మిత్రుని బావ అంటాడు, నేను మాత్రము నా పెద్ద కొడుకును పంపనని, చెల్లెలు
అంటుంది తను చిన్న కొడుకును విడిచి అసలే వుండలేనని.  అప్పుడు నడిపి
కొడుకు మేనమాతో అంటాడు, "నా తల్లిదండ్రులు వాళ్ల కిష్టమైన వాళ్లను ఎంచుకు
న్నారు.  ఇక మిగిలింది, వాళ్లకు పట్టింపు లేనిది నేనే.  నేను మీ వెంట వస్తాను".
విశ్వామిత్రుడు అతన్ని తన వెంట తీసుకువెళ్లి, యాగము తరువాత అతనికి
ఉపదేశము చేసి, కొంత సంపద కూడ ఇచ్చి పంపిస్తాడు.
దశరథునికి నలుగురు కొడుకులున్నా శ్రీ రాముడంటె అత్యధిక ప్రేమ.
రాముడు అడవికి వెళ్తె మిగిలిన కొడుకులను చూసుకుంటు బ్రతికి
వుండాల్సింది కద.
ఇప్పటి కాలములో కూడ చూస్తాము.  పిల్లలందరి మీద ప్రేమ వుండటము
వేరు.  అందులో ఎవరో ఒకరి పట్ల ప్రత్యెక అభిమానముండటము వేరు.  ఇది
బహిరంగంగ కనిపించక పోవచ్చు.  నాకు తెలిసిన కొంతమంది వున్నారు.  వారికి
పిల్లలందరికి ఏ అవసరమొచ్చినా బాగా చూసుకుంటారు.  కాని అందులో ఒకరి
దగ్గర వుండడానికే, చివరి రోజుల్లో వుండటానికి ఇష్టపడుతారు.  దానికి వాళ్ల కారణాలు
వాళ్లకు వున్నాయి.  చంద్రబాబుకు ఒక్కడె కొడుకు వుండటంతో పక్షపాతము చూపే
అవకాశము లేదు.  చంద్రబాబు సీమాంధ్రకు చెందిన వాడిగా సీమాంధ్ర పట్ల పక్షపాత
ధోరణి వుండటము అందరు అర్థం చేసుకుంటారు.  కాకపోతె ఆ విధమైన పక్షపాతము
చూపెట్టడము విఙ్ఞతగల నాయకుడి లక్షణము కాదు.  రెండుప్రాంతాల్లో ఓట్లు, సీట్లు
కావాలనుకున్నప్పుడు విభజన సమయములో కేంద్రము మీద లేనిపోని అభాండాలు
మోపుతు బహిష్కరించేకంటే, సంపూర్ణ సహకారము అందించి, విభజన సామరస్యంగా
జరిగెట్లు చూడాలి.  అప్పుడె చంద్రబాబు రెండు ప్రాంతాలకు సమన్యాయము చేసిన
వాడవుతాడు.  లేకపోతె సమ అన్యాయము చేసినవాడవుతాడు.
ఇంతకు ముందె విన్నాను.  కొత్తగా కొబ్బరికాయ సిద్ధాంతము గురించి మాట్లాడాడట.
నేనైతె అది ఏంటొ వినలేదు.  కొబ్బరికాయ చెట్టునుండి తెంపటము కష్టమా?
కొబ్బరి చెట్టుకింద నిలబడితె కొబ్బరికాయ మీద పడితె దెబ్బ బాగానే తగులుతుంది.
తెలంగాణను అడ్డుకుంటె అదే పరిస్థితి.  కొబ్బరికాయ పీచు సరిగ్గా తీయకపోతె కొట్టడము
కష్టమే.  అందుకే పీచు తీయాలి.  విషయ అవగాహనకు శ్రీ క్రిష్ణ కమిటీ ఊరూరు తిరిగి,
చిన్నోళ్ళని, పెద్దోళ్లోను, ఆడోళ్ళను, మగోళ్ళను, పళ్ళోళ్లను, పట్టణపోళ్లను, ప్రభుత్వపోళ్లను,
పార్టీలోళ్లను అందరిని సంప్రదించి ఒక నివేదిక కూడ ఇచ్చింది.  ఈ రిపోర్టును ముందేసుకొని,
మళ్లి మళ్ళి కేంద్రమోళ్ళు అఖిల పక్షమీటింగులు పెట్టి విషయాలన్ని తేటతెల్లంగా తెలుసు
కున్నది.  ఇక విభజన బిల్లు రావటమే మిగిలింది.  అంటె కొబ్బరికాయ కొట్టడానికి
రెడీగా వుంది.  ఎవరి ముక్క వాళ్లకు రావలిసిన విధంగా వస్తుంది.  ఒక ముక్క కాస్త
చిన్నది (పది జిల్లాల తెలంగాణ) రెండోది కాస్త పెద్దది (పదమూడు జిల్లాల సీమాంధ్రా)
వస్తుంది.  సామరస్యంగా విడిపోతు, కొబ్బరి నీళ్ళలాంటి తెలుగు వారి ఔన్నత్యాన్ని
కొత్త రాష్ట్రాల అభివృద్దితో ప్రపంచానికి చాటాలి.

Saturday, November 9, 2013

Telangana - Politicians' Drama

పార్టీల మాటలు - తప్పడాలు, తిప్పడాలు
భాజపా:
"ఓక ఓటు - రెండు రాష్ట్రాలు".
"తెలంగాణలో ఏపి రాజధాని హైదరాబాదు వున్నది.
ఇక ప్రత్యేక రాష్ట్రము అవసరము లేదు".
"అప్పుడు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డందుకే తెలంగాణ
ఇవ్వలేక పోయాము.  మేము చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు
ఎప్పుడు అనుకూలమే."
"తెలంగాణ బిల్లు పెట్టండి.  మేము మద్దతు ఇస్తాము.  కాని
ముందు సీమాంధ్రుల సమస్యలను (విభజనే వారి సమస్య అని
 భాజపాకు తెలియదా?)  తీర్చండి.  రాష్ట్రవిభజన మీ(కాంగ్రేసు)
 ప్రైవేటు, వ్యక్తిగత వ్యవహారం కాదు."
"సమస్య మీరు పరిష్కరించండి.  మేమేం మాట్లాడం.  విభజన తరువాత
వచ్చేసమస్యలు ముందే తీర్చాలి.  బిల్లు పెడితే మద్దతు ఇస్తాము!"

తెదేపా
"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకూలము."
"అస్సెంబ్లిలో వెంటనేతెలంగాణ బిల్లు మీరు పెడతారా, మమ్మల్ని
పెట్టమంటారా?"
"ఒక పెద్ద నిర్ణయము, రాష్ట్రాన్ని విభజించే నిర్ణయము, అర్థరాత్రి
ప్రకటించటము, తమళనాడుకు చెందిన చిదంబరము (అప్పుడు
కేంద్రములో హోమశాఖ మంత్రి), కర్ణాటకాకు చెందిన ఒక వీరప్ప
మొయిలి (అప్పుడు న్యాయశాఖా మంత్రి) నిర్ణయము తీసుకున్న
పరిస్థితి."
"తెలంగాణ, సీమాంధ్ర నాకు రెండు కళ్ళు.  కాంగ్రేసే (కేంద్రమే) ఈ సమస్యను
పరిష్కరించాలి.  ప్రణబ్ ముఖర్జి లేఖకు కట్టుబడి వున్నము."
"సీమాంధ్రాలో రాజధానికి కేంద్రము నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజి ఇవ్వాలి."
"సీమాంధ్రలో ఉద్యమము తీవ్రంగా వున్నది.  ఇరు ప్రాంతాలకు
సమన్యాయము చేయలి.  ఇద్దరు కొడుకుల్లో ఒకరని ఎంచుకోమంటే
ఎలా? (ఒక కొడుకు ఒక కూతురున్నా, ఇద్దరు కూతుళ్లే వున్న ఎట్లా
ఎంచుకుంటారు?)"
"సమన్యాయము చేసె వరకు రాష్ట్రాన్ని విభజించొద్దు.  సమన్యాయము
ఎంటంటే మీరె తెలుసుకోవాలి.  మేమెం చెప్పం.  రెండు ప్రాంతాలు
నాకు రెండు కళ్లు, ఇద్దరు కొడుకులు." (ప్రస్తుతానికి రెండు కళ్ళలో
పూవు వుంది - cataract)

వైకాపా
"వైయ్యెస్సార్‍కు తెలంగాణ ప్రజలంటే ఎంతో అభిమానం."
"వైస్సార్ పార్టీ తెలంగాణ సెంట్‍మెంట్‍ను గౌరవిస్తుంది."
"తెలంగాణ ఇచ్చేశక్తి కాని, ఆపె శక్తి కాని మా పార్టీకి లేదు."
"ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రానికే తెలంగాణ ఇచ్చె శక్తి వుంది.
రాష్ట్ర విభజన చేస్తె రెండు ప్రాంతాలకు సమన్యాయము చేయాలి."
"సమన్యాయానికి ఏం చేయాలో మేమెం చెప్ఫలేం."
"మీకు సమన్యాయము చేయడము చాతకాదు కాబట్టి రాష్ట్రాన్ని
సమైక్యంగానే వుంచాలి."
"రాష్ట్రములో, దేశములో అన్ని పార్టీల మద్దతు కూడ గట్టుకొని రాష్ట్రాన్ని
సమైక్యంగా వుంచడానికి యాత్ర చేస్తాం, కృషి చేస్తాం."

లోక్ సత్తా
"అధికార వికేంద్రికరణ వల్ల పరిపాలన సులభమౌతుంది."
"రాష్ట్ర విభజన వల్ల పరిస్థితుల్లొ పెద్ద మార్పేమి వుండదు."
"రాష్ట్రములో ప్రగతి కుంటు పడింది.  ఒక అనిశ్చిత పరిస్థితి
రాష్ట్రాభ్యుదయానికి మంచిది కాదు.  కేంద్రము దీనిపై త్వరగా
ఒక నిర్ణయము తీసుకోవాలి."
"రాష్ట్రనిర్ణయము కేంద్రం (కాంగ్రేసు) ప్రైవట్ వ్యవహరం కాదు.  అన్ని
ప్రాంతాల ప్రజల మనోభావాలు పట్టించుకోకుండ నిర్ణయము
తీసుకోవడము అమానుషము.  రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా
కేంద్రము రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది?"
(తెలంగాణలో 1000 మందికి పైగా యువత ఆత్మహత్య చేసికుంటే
మాట్లాడని వాళ్ళు,  60 ఏళ్ళ ఉద్యమము కంటె రోజుల ఉద్యమాన్ని
గంటల్లో లెక్క పెట్టి మహా ఉద్యమమని గుండెలు బాదుకుంటున్నారు).

సీమాంధ్ర కాంగ్రెసు
"తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరము లేదు.  తెరాసతో పొత్తు
పెట్టుకుందాము.  కేంద్రములో, రాష్ట్రములో అధికారానికి వద్దాము.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి నిరంతరం చర్చలు కొనసాగిస్తాం.
మళ్లి మళ్లి తెలంగాణ పేరు చెప్పుకొని ఓట్లు, సీట్లు తెచ్చుకుందాం.
సీమాంధ్రను అభివృద్ధి చేద్దాం.  సమైక్యాంధ్రకే మద్దతిస్తాం.  తెలంగాణ
సెంట్‍మెంట్‍ను గౌరవిస్తాం.  తెలంగాణ ప్రత్యేక రాష్టం అంటు ఉద్యమంటె
జైల్లో పెడ్తాం.  నక్సలైట్లని ఎన్కౌంటర్ చేద్దాం.  విభజిస్తె నీటి యుద్ధాలు
వస్తాయి. నీళ్ళని పాజేక్టుల ద్వార, నిధులన్ని తరలించుకొని తెలంగాణ
ఎడారి అయ్యాక, తెలంగాణలో దొచుకోవాడనికి ఏమి లేనప్పుడు తప్పకుండ
తెలంగాణ ఇద్దాం.  ప్రస్తుతానికి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరము లేదు.
తెలంగాణ ఇస్తె, హైదరాబాదు, గ్రేటర హైదరాబాదు లేని తెలంగాణ వారు
ఎప్పుడైనా తీసుకోవచ్చు.
తెలుగుజాతి ఒక్కటిగా వుంటెనె ఆంధ్రరాష్ట్రము అభివృద్ధి పథంలో
దూసుకుపోతుంది.'

Thursday, October 31, 2013

News - Views

అలజడి
మళ్ళీ అఖిల పక్షమీటింగ్ అనగానే అందరిలో రకరకాల
అనుమానాలు మొదలయ్యాయి.  తెలంగాణ వాదులు
ఇదేమన్న తెలంగాణ పక్కన పెట్టే విషయమా అని
ఆందోళన చెందారు.  తరువాత అది విభజన ప్రక్రియలో
భాగంగ జరుగుతుందని తెల్సి చల్లబడ్డారు.  ఇప్పటి దాక
కేంద్రము ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని విభజిస్తుందని గొంతు
చించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు గొంతు పెగలటము
లేదు.  ఇప్పటికైనా చంద్రబాబు సీమాంధ్ర కేమికావాలో
కేంద్రము ముందు పెట్టి అక్కడ ముందు ముందు ఎన్నికల్లో
గెలుపుకు, కొత్త ఆంధ్రప్రదేశ్‍లో మళ్ళి ముఖ్యమంత్రి అయ్యెందుకు
ప్రయత్నించవచ్చు.  అన్ని పార్టీల వారు విభజన వల్ల కలిగె
వాళ్ల సమస్యలను, వాటి పరిష్కారలను కేంద్రానికి తెలియజేసి
విభజన సామరస్యంగా జరిగేటట్టు చూస్తె అందరికి మంచిది.

                 ******************

నిన్న జరిగిన ఘోరం తలచుకుంటే గుండె బరువెక్కుతుంది.
వొల్వో బస్ ప్రమాదము, ఆ బస్ శకలాలు, మాడిన మాంసము
ముద్దల్ల వున్న ఆ దేహాలు చూసిన వారెవరైనా ఆ బస్ యజమానిని,
డ్రైవరును, ప్రయాణానికి అనుమతిని ఇచ్చిన RTA ఆఫీసర్ను
శాపనార్థాలు పెట్టకుండ వుండగలరా?  అయినా ఎన్ని శాపనార్థాలు
పెడితే మాత్రము పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా?  ఒక్క ప్ర్రాణంతో
ఎన్నెన్ని జీవితాలు ముడిపడి వున్నాయో?  ఆ జీవితలకు ఎవరు
రక్షణ ఇవ్వగలరు?  కాసులకి కక్కుర్తి పడి నమ్మిన వారి ప్రాణాలను
ఫణంగ పెట్టి సంపాదించుకునేవారు మనుష్యులేనా.  ఎన్ని కోట్లు
సంపాదించినా, బంగారు పళ్లాలున్నా అందులో రెండు ముద్ద
లన్నమే తింటారు కదా.  బంగారు ముద్దలు తినరు కదా.
జీతము ఇవ్వాల్సి వస్తుందని కక్కుర్తి పడి రెండో డ్రైవరును పెట్టుకో
నందుకు ఎన్ని ప్రాణాలు బలి కావల్సి వచ్చింది.
ప్రభుత్వము రెండురోజులు ఏవో కంటి తుడుపు చర్యలుగా అరెస్టులు
చేయడము, నాలుగు బస్సులు పట్టుకోవడము కాదు, ప్రైవేట్ బసులు
నడపటానికి నియమ నిబంధనలు అందరు, ఎప్పుడు పాటించెలా
చర్యలు తీసుకోవాలి.  ముందు కాస్త కష్టమనిపించినా నియమ
నిబంధనలు అమలు పరిస్తె కలిగె లాభాలు అర్థమైతె అందరు తప్పక
అవి పాటిస్తారు.  అప్పుడు ఇలాంటి ప్రమాదాలు వుండవు.

Saturday, October 26, 2013

News - Views

అడగదలుచుకున్నాను
-ఆంధ్రప్రదేశ్ భారతదేశములో ఒక రాష్ట్రమా లేక
మరో దేశమా?
-భారతదేశములో హింది (?జాతి) తరువాత ఎక్కువగా
వున్నది తెలుగు (?జాతి) వారె.  మరి హింది మాట్లాడె
వారికి నాలుగైదు రాష్ట్రాలుంటే మరి తెలుగు వారికి రెండు
లేదా మూడు రాష్ట్రాలుంటే చిన్నతనము, జాతి విఛ్చినం
ఎట్లా అయితుంది?
-సమైక్యాంధ్ర వుండాలంటే కోస్తా కావాలి, సీమ కావాలి,
తెలంగాణ కావాలంటున్నారు.  కోస్తా సీమ ఎలాగు
సొంతమే, ఇక తెలంగాణ కూడ కావాలనటము మాది
మాకే, మీది మాకె అనడము కాదా?
-ఓట్ల కోసం సీట్ల కోసం విభజన అంటున్న జగన్ తను
సమైక్యమనేది ఓట్ల కోసం, సీట్ల కోసం కాదా?
-సోనియాగాంధి కొడుకుని  ప్రధాని చేయాలని విభజన
చేస్తుందని అంటున్న జగను తండ్రి శవము వాకిట్లో
వున్నప్పుడె తను ముఖ్యమంత్రి కావలని ఆం.ప్ర ఎమ్మెల్యెల
సంతకాలు తీసుకున్నది నిజము కాదా?
-నీటి యుద్ధాలు అంటున్న జగన్‍కు భారతదేశము పాకిస్తాను,
చైనా,బాంగ్లాదేశ్‍తో నీళ్ళు పంచుకుంటున్న సంగతి తెలియదా?
-తెలంగాణ ఏర్పడితె హైదరాబాదులో భూముల విలువ పడిపోతె
ఆ బాధ తెలంగాణ వారికి ఉండాలి కాని ఆంధ్రోల్లకు ఏం కష్టం?
అన్యాయంగా, అక్రమంగా కబ్జాచేసుకున్న నీ వేల ఎకరాలి
గురించి రంధే కద.  చిన్నపనులు చేసుకుని, చిన్న చిన్న ప్లాట్లు
కొనిక్కొని, చిన్నచిన్న ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఆ ఇళ్ళలో వుంటారు,
దాని విలువ ఎక్కువైనా తక్కువైనా వారికి ఏం నష్టం, కష్టం.
-ఆంధ్రలో చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం ఇప్పుడు కేవలము
హైదరాబాదుకే వెళ్తున్నారా, అమెరికా వెళ్లట్లేదా?  వివిధ రాష్ట్రాలకు,
వేరు వేరు దేశాలకు పోవట్లేదా.  తెలుగు వాళ్ళంత ఒక దగ్గరె వుండాలని
ఆంధ్రప్రదేశ్‍లోనె వుంటున్నారా?  మరోక మాట, వాళ్ళు హైదరాబాదులోనే
ఉద్యోగాలు చూసుకుంటున్నారంటె తెలంగాణ విద్యావంతుల అవకాశాలు
కొల్లగొడుతున్నారని ఒప్పుకుంటున్నట్టెనా.  ఆంధ్రాలో విద్యావంతులుకు
ఉపాధి అవకాశాలు పెంచే తెలివి లేదా?
-ఆర్టికల్ మూడు ప్రకారము రాష్ట్రాని ఇచ్చే హక్కు కేంద్రానికి ఉందని, కేంద్ర
నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అఖిల పక్షములో మీ పార్టీ చెప్పింది
నిజము కాదని బైబల్ మీద ప్రమాణము చేసి విజయమ్మగారు చెప్పుతారా?
-చివరాఖరకు, ముప్పై ఎంపి సీట్లు గెలవాలనటములో మీకు తెలంగణ
రాష్ట్రము ఏర్పడుతుందని,అక్కడ ఇక ఆంధ్ర పార్టీలకు స్థానం లేదని
ఖచ్చితంగా అర్థమైందనే  కదా.  అంతే కాదు. ప్రధానమంత్రిని నిర్ణయించె
స్థాయిలో వుండాలనటములో మీరె ప్రధాని కావలనే ఆశ  దాగి వున్న
విషయము నిజము కాదా?
                     ****************************
నాకో డౌటు.  ఈ ఆంధ్రోళ్ళు భారతీయులమని అనుకోరా?  వాళ్ళకు
భారత జాతీయ గీతము రాదా, లేకపోతె ఆ గీతము పట్ల గౌరవము
లేదా? ఆనాడు ఏపి ఎన్జీవోల సభలో గిన్నిస్ రికార్డు గాయకుడు
జాతీయ గీతము పాడలేకపోయాడు. ఇవాళ పరిస్థితి మరీ ఘోరం.
ముఖ్యమంత్రి, ప్రధాని కావాలనుకునేవారికే కాదు, ఆ పార్టీ
ఎమ్మెల్యెలకు, కార్యకర్తలెవరికి కూడ జాతీయ గీతం కరెక్టుగా,
పూర్తిగా రాదు.
                    *************************
ఢిల్లిలో భూమి అదిరిందో లేదో తెలుసుకోవాలి.  సోనియా గాంధి
గారి చెవులు ఎలా వున్నయో, కర్ణభెరి వుందొ చిట్లిపోయిందో
తెలుసుకోవాలనుకుంటున్నాను.
   

Friday, October 25, 2013

News - Views

చంద్రబాబు - బెదిరింపులు
చంద్రబాబు మతిస్థిమితము తప్పినట్టే వుంది.  లేకపోతె ఆ
మాటలేంది?  పంజాబీల సెంట్‍మెంట్ దెబ్బతిన్నందుకు
ఇందిర గాంధి హత్యకు గురైందని. తమిళుల సెంట్‍మెంట్
గాయపడ్డందుకు రాజీవ్ గాంధి హత్య చేయబడ్దడని,
కాంగ్రెసోల్లు తెలివి తక్కువగా వ్యవహరిస్తరని అంటున్న
చంద్రబాబు తను మామను వెన్నుపోటు పొడిచి ముఖ్య
మంత్రి అయిండని మర్చిపోయిండు.  ఏ కుటుంబ సభ్యుల
సహకారముతో అధికారము చేజిక్కించుకున్నాడో ఆ
కుటుంబ సభ్యులను ఏ మాత్రము అధికారములో చోటు
దక్కనీయకుండా ముందు దూరంగ నెట్టేసి ఆ తరువాత
అవసరాన్ని బట్టి మళ్లి చుట్టరికాన్ని కలుపుకున్నడు.
గాంధిలలో ఎవరిలోను ఇంత కుళ్ళు మాత్రము లేదు.  వాళ్ళు
దేశ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలు చేసినరె కాని కేవలము
అధికారము కోసము ఎవరికి వెన్నుపోటు పొడవలేదు.  మరి
చంద్రబాబు తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ఎలా
సమర్థించుకుంటడు.  అది సరైనదనే చంద్రబాబు భావిస్తున్నాడా?
ఇక తెలుగు జాతి అని మొత్తుకునే వాళ్లు ఒకటి గుర్తించుకోవాలి.
తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడినా వాళ్ళు ఆంధ్రావాళ్ళు ఒక్కటని
ఎప్పుడు అనుకోలేదు.  ఇక ముందు కూడా అనుకోరు.  భారతదేశములో
ఎన్నో భాషలు, తెగలు, జాతులు వున్నాయి.  తెలంగాణ, ఆంధ్ర భాషలు
ఒకటిగా అనిపించినా వారు ఒక జాతిగా ఎప్పుడు భావించుకోలేదు.  ఈ
నేల మీద పుట్టిన వారి గుణాలు, అక్కడ పుట్టిన వారి గుణాల్లో ఎంత తేడా
వుందో ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ద్వార బైట పడింది.
భారతీయులుగా అందరము కల్సివుండాలి, పోరుగు రాష్ట్రాలవారిగా
కల్సివుండాలే కాని వాళ్ళు అంటున్న ‘తెలుగు జాతి’గా మాత్రము
కాదు.  తెలంగాణ వాళ్ళకు వారితో కలసివుండాలనే సెంట్‍మెంట్
ఆవగింజంత కూడా లేదు.  కాబట్టి వాళ్ళు తెలుగుజాతి సెంట్‍మెంట్
తెలంగాణ వాళ్ల మీద రుద్దాలని చూస్తె ఒప్పుకోరు. దోపిడి ఇక
ముందు సాగదని, దానిని సాగించేకోసం తెలుగుజాతి అనె సెంట్
మెంట్ ముందు పెడితె ఎవ్వరు నమ్మెస్థితి లేదు.  ఇకనైనా ఆంధ్రోల్లు
తెలుగుజాతి సెంట్‍మెంటు పక్కన పెట్టి వాస్తవాలు గుర్తించి, జిమ్మిక్కులు
మాని వాళ్ళ రాష్ట్రము గురించి ప్రణాళికలు మొదలు పెట్టాలి.  ఇక
ముందైనా వాళ్ళ కొత్త రాష్ట్రములో ప్రాంతీయ భేదాలు చూపకుండా
అందరికి న్యాయము జరిగేట్టు చూడాలి.

Thursday, October 24, 2013

News - Views

సమైక్య శంఖారావం
ఎల్లుండె సమైక్య శంఖారావం.  అది ఎందుకోసమో, దాని
లాభమేంటో ఆ సభ పెడ్తున్న వాళ్ళకైన ఖచ్చితమైన అవ
గాహన వుందా?  కేవలము పక్కవాళ్ళను, పార్టీలను రెచ్చ
గొట్టడానికి, తన పలకుబడి చూపెట్టుకోవడము కోసమే బోలెడు
డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండ స్థానిక ప్రజలను కష్టపెట్టడము
ఏమి రాజకీయము, ఏమి విఙ్ఞత?  రాష్ట్రమంతా వర్షాలతో తడిసి
ముద్దైతుంది.  సామాన్య ప్రజలు, రైతన్న కష్టాలు చెప్పనలవి
కాకుండా వుంది. పలుచోట్ల రవాణ సౌకర్యాలు నిలిచిపోయాయి.
రాజధాని నగరములో పరిస్థితి కూడ అధ్వాన్నంగా వున్నది.
అయినా సమైక్య శంఖారావన్ని అలగే సాగించటము ఏ ప్రజలను
ఉద్ధరించేకోసం?  ప్రజలు కష్టాల్లో వుంటె వారి దగ్గరకే పోయి వారికి
చేతనైన సహాయము చేసె బదులు శంఖారావాలు, ఘీంకారాలు,
ఓండ్ర పెట్టడాలని ఊర్లల్ల నుండి తరలించుకు రావడము కష్టాల
పాలు చేయడము ఎంతవరకు సమంజసం .  బోలేడంత డబ్బు
వుండి ఏమి చేయాలో తేలికపోతె ‘రాబిన్ హుడ్’ కావచ్చు కద.
అది కూడ ముందుముందు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగ
పడుతుంది కదా.
చూద్దాం. సమైక్య శంకారావములో ఎన్ని శంకలుంటయో, హాహా
కారాలుంటయో వెచి చూడాలి.

Tuesday, October 22, 2013

News - views

ఊసరవెల్లులు
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఎప్పుడు పాసౌతుందో, తెలంగాణ
రాష్ట్రము ఏర్పాటైనట్లు గెజిట్లో ఎప్పుడొస్తుందో కాని, ప్రతి రోజు
ఈ ఆంధ్రోల్ల అడ్డదిడ్డ మాటలు వినలేక చెవులు గడలువడుతున్నయ్.
అసలు వాళ్ళు ఏమి మాట్లాడుతున్నరో వాళ్లకైనా అర్థమయితుందా?
ఓ గొప్ప మేధావినని, అంతా రాజ్యాంగ బద్ధంగా, నీతిగా, నిజాయితిగా
మెదలాలని, అధికారవికేంద్రికరణ జరిగితేనె ప్రజలకు మేలని, రాజకీయ
నాయకులు మాటకు కట్టుబడి వుండాలని, మానిఫెస్టోలో వట్టి మాటలు
కట్టి పెట్టి, ప్రజల ప్రజాస్వామిక హక్కులను నెరవేర్చె విధంగా చెప్పినవి
చేయాలని నీతులు పలికిన జయప్రకాశ్ నారాయణ తెలంగాణ
తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కని, అది అధికార వికేంద్రికరణలో
భాగమేనని, రెండు జాతీయ పార్టీల ఎన్నికల ప్రమాణమని, CPM
మినహా లోక్‍సత్తతో సహ ఇతర పార్టీలు అన్నికూడ తెలంగాణ
ఏర్ఫాటుకు వ్యతిరేకము కాదని చెప్పాయని, కేంద్రప్రభుత్వానికే తెలంగాణ
పై నిర్ణయము తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యత వున్నదని,
ఆ నిర్ణయము నానుస్తు ఆంధ్రప్రదేశ్‍ను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందని
పలుసార్లు విమర్శించి, పరోక్షంగా నిర్ణయము తీసుకునే విధంగ వత్తిడి
చేసిన సంగతి మరిచిపోయడు.  ఇప్పుడు ప్రజాభిష్ట వ్యతిరేక నిర్ణయము
తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అనడములో ఆయన మేధ
ఏందో, మెదడేందో, రాజనేతేందో, నిజాయితేందో, మాట నిబద్ధతేందో
తెల్సిపోతుంది.  పేద్ద ప్రజాస్వామిక వాదినని డబ్బా కొట్టుకున్నాయన
ప్రజాస్వామ్యాన్నిపాతరేసి ప్రాంతీయతకే పట్టము కడుతున్నడు.
తెలంగాణలో ఎమ్మెల్యే అయిన సంగతి కూడ మర్చిపోయి, తెలంగాణ
ఏర్పడితే ఆయన, ఆయన పార్టీ అస్తిత్వము కృష్ణాగోదావరిలని
దాటుకొని పోయి బంగాళఖాతంలో కల్సిపోతుందని స్వార్థ
పూరితంగా వ్యవహరిస్తున్నడు.  నిజమైన మేధావైతె మాటకు,
రాజ్యాంగానికి కట్టుబడి, విభజనకు కేంద్రానికి సహాయకారిగ
వుంటే దేశములోనే కాస్త మంచి పేరు తెచ్చుకొని రాజకీయ
భవిష్యత్తును సుస్థిరము చేసుకునేవాడు.  రాజకీయాలలో ప్రలోభాలకు
లొంగకుండ నిజాయితిగ పనిచేయడము సాధ్యముకాదా?
చంద్రబాబు గోస చెప్పలేనిది.  ఆయనో గొప్ప రాజకీయ వ్యూహకర్త.
మామను వెన్నుపోటు పొడిచి నిలదొక్కుకోవటముతో తనంత
అపర చాణక్యుడు ఈ కాలంలో ఎవరు లేరనే అనుకున్నడు.
ఎంతో ఆలోచించి, చించి, చించి, తేదేపాలో కమిటీ వేసి,సర్వే చేసి,
తెలంగాణ పైన నిర్ణయము తీసుకొని కేంద్రానికో లేఖాస్త్రాన్ని
సమర్పించాడు.  అంత సుధీర్ఘ మంతనాల తర్వాత తీసుకున్న
నిర్ణయానికి కట్టుబడి వుండక భావోద్వేగాలకులోనై, ఎదుటి
వారి రాజకీయ ఎత్తులలో పావై మతిస్థిమితము లేనివాడిగా ప్రవర్తించి
ఆతని మీద ప్రజలు పూర్తి నమ్మకము కోల్పోయెట్టు చేసుకున్నడు.
వెన్నుపోటుపొడిచి, ఆనాడు హోటల్ వైస్రాయ్ ముందు తన మీద
అల్లుడు చెప్పులు విసిరేయించినప్పుడు నందమూరి తారక
రామారావ్ ఎంత మానసిక క్షోభ అనుభవించాడో!  ఆ పాపం
వూర్కె పోతుందా.
భాజపా తెలంగాణకు మద్దతివ్వటము వెంకయ్యనాయుడికి ఎంత
కష్టంగా వుందో. తప్పని పరిస్థితిలో ఎంత గొప్ప వాళ్ళైనా, ఏ పదవిలో
వున్న అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుంటమని కచర మొఖం
 పెట్టుకొని చెప్పిండు.  ఈ మొఖాన్ని చూసి తెలంగాణ జనం భాజపా
ఏం చేస్తుందోనని లొలోపల కాస్తా అనుమానపడుతుండ్రు. భాజపా
ఆంధ్రాలో ఎట్లాగు రాదు.  ఈ నాయుడు మరో చంద్రుడితో కల్సి కంత్రి
వేషాలేస్తె ఆయింత తెలంగాణలో భాజపా ఒక్క సీటు కూడ
దక్కించుకోలేదు.
కాంగ్రేసు, గాంధీల పేర్లు చెప్పుకొని ఎన్నికల్లో ఓట్లడుగుతాము అని
ఒప్పుకునే సీమాంధ్ర కాంగ్రేసు నాయకులు తమకు టికెట్లుచ్చి
పదవులిచ్చిన అధిష్టానాన్ని లెక్కచేయమంటరు.  ఆ పార్టీ లేకపోతే
రాజకీయ బతుకులేదు, ఆ అధిష్టానం టికెట్లివ్వకపోతె భవిష్యత్తు
వుండదు, గాంధీలు మాట్లాడకపోతె ఓట్లు రాలవు, ఆధిష్టానం
కనికరించకపోతె అధికారము, పదవులు వుండవు అయినా
విభజన విషయము వచ్చేసరికి ‘ఎవరి మాటవినేది లేదు,
ఎంతకైనా తెగిస్తామ’ని అంటారు.  వీళ్ళకు ప్రజలు, అధిష్టానం
కంటె వాళ్ల సొంత ఆస్తులు పెంచుకోవటమే ముఖ్యమనుకుంట.
తెలంగాణ ఏర్పాటు ఎన్నికల వాగ్దానమని, ఎన్నికల వాగ్దానాలు
నెరవేర్చె పార్టీగా తమ పార్టీ గురించి ప్రచారము చేసుకుంటే ప్రజలు
రాజకీయ నాయకులను కాస్తైనా నమ్మేవాళ్లు కాదా. వాళ్ళు
తలచుకుంటె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుహృద్భావ
వాతావరణములో ఎంతో సామరస్యంగా సంతోషంగా సాగెది కద.
ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగవు కాదు కద.  ఆ ప్రాంత
రాజకీయనాయకుల పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవముండెది
కదా. ఈ రాజకీయనాయకులు ఎంత వంచకులో రెండు ప్రాంతల
ప్రజలకు అర్థమైంది.  ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా
తెలంగాణలో కాని, ఆంధ్రాలోకాని నాయకులు రకరకాల
నాటకాలు ఆడారు కాని తమ పదవులను మాత్రమువదులుకు
కోలేదు (తెరాస తప్ప).  మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు
వస్తాయంటె మాత్రము రాజీనామాలు చేసి ఓట్ల వేటకు వస్తారను
కుంట.  అంత వరకు పదవులను అంటి పెట్టుకొని తమ కార్యాలన్ని
చక్కదిద్దుకుంటారు.  వీరి నాటకాలు ప్రజలకు అర్థం కావను
కుంటున్నరు.  ప్రజలు తెల్లివి తక్కువ వాళ్ళైతె మన
ప్రజాస్వామ్యము ఇలా పరిడవిల్లేదా?

Wednesday, October 9, 2013

News - Views

సీమాంధ్ర విధ్వంసం
సీమాంధ్రాలో ఉద్యమము పేరిట జరుగుతున్న విధ్వంసము
ఎంతో బాధాకరము.  ఉద్యమము పేరుతో జరుగుతున్న
వికృత కిరాతక చేష్టలకు ప్రభుత్వము అండగా వుండటము,
కేంద్రము ఎలాంటి చర్యలు తీసుకోక పోవటము దేనికి సంకేతము?
పేద ప్రజలకోసమే మా ప్రభుత్వమని చెప్పె ఏ ఒక్క పార్టీ కూడా
సీమాంధ్రలో విధ్వంసము సృష్టించేది ఎవరో తెలిసినా దానిని అట్లాగే
కొనసాగనివ్వటము ఎంత దారుణం.  కాపాడాల్సిన ప్రభుత్వము
కక్ష పూరితంగా వ్యవహరిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఎవరికి
చెప్పుకోవాలి?
న్యాయాన్యాయాలు మర్చిపోయి, ధర్మాధర్మాలు పక్కన పెట్టి
కేవలము ఆధిపత్యం కోసం, కొందరి వ్యక్తుల అక్రమార్జనలు
రక్షించటం కోసం తమ స్వంత ప్రాంతము, తమ స్వంత ప్రజలని
కూడ చూడకుండా వాళ్ళను నానా ఇబ్బందులకు గురి చేయటము -
ఇదేమి రాజకీయము? ఇదేమి రాక్షసత్వము?  స్వప్రయోజనాలకోసం
పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవతము అధోగతి పాలుజేసి
అదంతా వారికోసమే అని నమ్మించి అధికారములోకి రావలనుకోవటము
ఏ కౌటిల్యుని రాజనీతి పాఠము?
సామాన్యప్రజలు - బహుజనులు పెదలే.  ఎక్కువ శాతం రెక్కాడితేనె
డొక్కాడని వారే.  ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి కొన్నిసార్లు
కొందరు అమ్ముడుపోయెవారే.  అమ్ముడుపోయి దారి తప్పినప్పుడు
కఠిన శిక్షల జ్వాలల్లో బతుకులు బూడిదయ్యెది వారివే.  అట్లాంటి వారు
ఒక్క క్షణం ఆలోచించి, అమ్ముడుపోయి కాలిపోయెకంటే, ఆత్మగౌరవముతో
నిప్పుల చెండై మాయల మరాఠిలను నుసి చేయాలి.  అలాంటి వారున్నారు.
మార్గదర్శకులైన వారున్నారు.  ప్రజాస్వామ్యములో ఓటు హక్కు అందరికి
కల్పించిన మహానుభావులు, ప్రజలే ప్రభువులు కావాలన్నారు కాని, రాజులై
రాచరికము చేయాలనలేదు.  రాజకీయాల పేరుతో రాక్షసీయం చేసేవారిని
పాతాళానికి తొక్కేయడానికి ఓటె వజ్రాయుధము.
పేదలు, అమాయకులు, చాతకాని వాళ్ళు, చేవలెని వాళ్ళుగా కనిపించే
సామాన్యప్రజలకు ఉన్న శక్తివంతమైన ఆయుధము ఓటు.  దీనిని సద్విని
యోగము చేసుకొని గొప్పగొప్ప వారిని, వ్యక్తులను, ప్రభుత్వాలను
మట్టి కరిపించారు.  ఈ సామాన్యులు పైకి ఏమి మాట్లాడక పోవచ్చు, నిర్బలులు,
నిస్సహాయులుగా కనిపించ వచ్చు.  వాళ్ళు రాజకీయాలు మాట్లాడక పోవచ్చు,
వాటి గురించి అవగాహన లేనట్టు కనిపించవచ్చు.  కాని ఓటు వేసినప్పడి నుండి
మళ్ళి ఓటు వేసె వరకు ప్రతిరోజు వారు ఎన్నుకున్న, ఎన్నుకొబడ్డ నాయకులను,
ప్రభుత్వాన్ని గమనిస్తునే వుంటరు.  ఇది ఒక ఇంటర్నల్ అస్సెస్‍మెంట్ లాంటిదె.
దాని మీద అధారపడె మళ్లి ఓటు వేస్తారు.  ఎంత బ్రహ్మాండమైన స్లోగన్‍లు ఇచ్చిన
మోసపోరు.  మైమరచి పోరు.  నమ్మకము అనిపించి నిజాయితి కాస్తైనా వుందను
కుంటేనె ఓటు వేస్తారు.  అధికారాన్ని ఇస్తారు.  మహామహులనే ఓడించారు.
మట్టి మనుషులనీ గెలిపించారు.  తస్మాత్ జాగ్రత్త.

Tuesday, October 8, 2013

News - Views

నడుస్తున్న కథ
తెలంగాణకు వ్యతిరేకము కాదంటే, తెలంగాణలో మాయ మాటల్తో
ఓట్లు కొల్లగోట్టి అధికారం పోందడానికి మాత్రమే.  తెలంగాణ ఇవ్వమని
కాదు!
కోట్లు కొల్లగొట్టి కోట్లు తొడుక్కోని అధికారమ చెలాయించే వాళ్ళకు,
వాళ్ళ ప్రజల మనోభావాలు ముఖ్యము కాని, మట్టి మనుషులు
ఓట్లు వెయ్యడానికే, వాళ్లకు మనోభావాలేంటి?
సమన్యాయమంటె దొంగకు తాళమియ్యాలే, దోపిడి చేసేవాడికి
అధికారమియ్యాలే.  అంతే కాని అమాయకుడికి జీవించే హక్కు
అధికారమియ్యమని కాదు.
ఇంట్లో తండ్రి శవాన్ని పెట్టుకొని ముఖ్యమంత్రి పదవికోసం సంతకాలు
సేకరించడము అత్యున్నత నీతివంతమైన పని! ఎన్నికలప్పుడు
ఒకటికి రెండుసార్లు మాటిచ్చి అది నెరవేరిస్తె దుర్మార్గమైన, అనైతికమైన
దిగజారుడు చర్య!
తెలంగాణ ఇవ్వమన్నామని ఒకటికి రెండుసార్లు అఖిల పక్షములో
చెప్పినా, కేంద్రానికి ఉత్తరాలిచ్చినా, అది నమ్మెయ్యటమేనా?  వెన్నుపోటు
తోనే రాజకీయాల్లో చక్రము తిప్పేవాళ్లుంటారని తెలుసుకోక పోతె ఎట్లా?
మాటలతో మోసపుచ్చి, ఎన్నికల్లో చంద్రున్ని ఇస్తామని చెప్పి ఇస్తామా.
అద్దంలో చూపించి ఇదిగో చందమామ అని జోకొట్టాలె.
"ఉద్యమాన్ని చక్కగ అదుపు చేయగలను.  తెలంగాణ ఉద్యమాన్ని ఎంత చక్కగా
అణిచేసాను, లాఠిలతో, తూటాలతో, అరెస్టులతో.  కాని సీమాంధ్రలో మాత్రం నేనేం
చేయలేను.  వాళ్ళను మరింత ప్రోత్సహిస్తాను.  వాళ్ళు నా వాళ్ళు.  నేను ఆంద్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రినే.  ఆంధ్రుల ముఖ్యమంత్రినె.  కాని తెలంగాణ ముఖ్యమంత్రిని
కాదు.  చరిత్రలో నేను మిగిలిపోతాను, సొంత పార్టీని, పార్టీ నిర్ణయాన్ని, నా ప్రభుత్వాన్ని
కూల్చిన వ్యక్తిగా, చిత్తూరి జిల్ల  రక్తము  నాలోకూడ వున్నదని, దానికి వెన్నుపోటు
వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించుకుంటున్న.  చంద్రబాబు ఇంటి మనిషిని వెన్ను
పోటు పెడిస్తె, నేను రాష్ట్రప్రజలను, కేంద్ర ప్రభుత్వాన్ని వెన్ను పొడిచిన మొనగాడిని". 

Thursday, October 3, 2013

Jai Telangaana


మరో అడుగు ముందుకు. గమ్యము అడుగు దగ్గరలోనే.
ప్రజల విజయం.  ప్రజాస్వామ్య విజయం.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!

Wednesday, October 2, 2013

News - Views

రాష్ట్ర రాజకీయాలు - ప్రజాస్వామ్య పాతర

రాష్ట్రములో కాని దేశములో కాని ఏమైతుందో ఎవ్వర్కి
అర్థం అయితలేదు.  ఎవరిపైన ఎవరో, ఎవరి మాటకు
ఎవరు కట్టుబడి వుంటారో తెలుస్తలేదు.  ఎవరెప్పుడు
ఎట్ల మాటమారుస్తరో, అన్న దానికి అర్థాలు వేరని, మీడియా
వక్రీకరించిందని ఉల్టా అంటరో చెప్పేటట్టు లేదు.  పార్టీలకు
కూడ ఒక సిద్ధాంతం లేదు.  అంతా రాద్ధాంతమే.  అంతా ప్రజా
సేవకులమంటరు, ప్రజల మనోభావాలే ముఖ్యమంటరు, కాని
ఒక ప్రాంతం ప్రజలే ప్రజలుగా వారికి అనుకూలంగనే నిర్ణయాలు
జరుగాలని అల్లర్ల్లు చేస్తరు, చేయిస్తరు.  మరో ప్రాంతం వాళ్లని
దోపిడి చేసినా నోర్మూసుకొని పడుండాలని, లేకపోతె మెడకాయలు
తెగ్గోస్తమి బెదిరిస్తరు. ఇది సీమాంధ్రుల నైజం. ఇంత జరుగుతున్న
దోపిడికి, దౌర్జన్యానికి గురైతున్నాఆ ప్రజలకు అండగా ఉండాల్సిన  తెలంగాణ
నాయకులు అధిష్టానం భజన చేస్తు, "అదిగో అమ్మ ఇచ్చె, ఇదిగో
తెలంగాణ వచ్చె"నంటు తెలంగాణ నేతలు వాళ్ళకు వాళ్ళె మీటింగులు
పెట్టుకొని అమ్మను పొగుడుకుంట సంబురాలు చేసుకుంటున్నరు.
కాళ్ళు సాపుకొని పడుకుంటున్రు.  లేదా కొత్త రాష్ట్రానికి ముఖ్యమంతెవరని
డిస్కషన్లు పెట్టుకుంటున్రు.
అటు సీమాంధ్ర ప్రజాపతినిధులంతా రకరకాల ఎత్తులు వేస్తున్నరు, జిత్తులు
జేస్తున్నరు.  ఉద్యోగులను ఉసిగొలుపుతున్నరు.  గవర్నమెంట్ ఇన్సిటిట్యూట్స్
బంద్జేసి ప్రైవెట్లొ వ్యాపారాల్లో లాభాలు దండుకుంటున్రు.  పేదలు, బడుగులు
ఎటుబోతె మాకేమి, మాదోపిడి కలకాలం సాగడానికి ఎంతవరకైనా పోతమని
నిసుగ్గుగ చెప్తున్రు.  తెలంగాణ ఆపడానికి, సీమాంధ్ర ప్రతినిధులు వారి ఇంటి ఆడవారిని
 ఏ.పి. గవర్నరు దగ్గరకు,  కాంగ్రేసు ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ దగ్గరకు,
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి దగ్గరకు పంపినరు.
పార్టీలు కూడ రకరకాల పొత్తులు ఆలోచిస్తున్నయి.  ఎటుబడి తెలంగాణ
రాకుండ చెయ్యలే.  వాళ్ళ నీళ్ళు, ఉద్యోగాల దోపిడి కలకాలం సాగాలని
సర్వ ప్రయత్నాలు చేస్తున్నరు.  భాజప మతత్వపార్టి అని దానికి దూరంగా
వుండాలని అన్న చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో వియ్యానికి ఉరికురికి
పోతుండు.  ముస్లిం ఓట్లు పోతే పోని, మోది వెలుగుల్లో తన పార్టీని ముందు
కురికించి సెంటర్లో చక్రం తిప్పాలని ప్లానేస్తున్నడు.  ఈ నాయుడు బాబుకు ఆ
వెంకయ్య నాయుడు తోడు.  పార్టీల కతీతంగ కులపోల్లంత కల్సి తెలంగాణ
రాకుండా చెయ్యడమేకాదు, ముందు ముందు ఢిల్లి పీఠము మీద కూడ
కన్నేసిండ్రేమో అని నా అనుమానము.  మోది తెలివైన నాయకుడైనా
కుతంత్రములో చంద్రబాబును మించిన వాళ్ళెవరైనా వుంటారా? చూడాలి మరి.
రెండుకళ్ళ బాబును తెలంగాణలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు.  కిషన్ రెడ్డి
తెలంగాణ ఐకాసలో వుండి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు.
కేంద్రములో తెలంగాణ బిల్లుకు మా మద్దతన్న భాజపా అంటె తెలంగాణ ప్రజలకు
కాస్తా అభిమానముంది.  తెలంగాణలో లోకల్‍గ తెరాస వున్నా, జాతీయ స్థాయిలో
భాజపాకు చాలామందె సపోర్ట్ ఇస్తరు.  తెదేపా లింక్ పెట్టుకుంటె తెలంగాణలో
భాజపా మునుగుడు ఖాయం.  ఆంధ్రలో ఎట్లాగు భాజపా రాదు.  తెలంగాణ వస్తె
అక్కడ జై ఆంధ్ర వాళ్లెమైనా భాజపాకు ఓటెయొచ్చు.  తెలంగాణలో తెలంగాణ
వస్తె భాజపాకు కొన్ని ఎమ్మెల్యె, ఒకటొ రెండో ఎమ్పి సీట్లు రావచ్చు.
ఈ విభజన నేపధ్యంలో భాజపాకు వచ్చే క్రెడిట్‍ను చంద్రబాబు తన
ఖాతలో వేసుకునే యత్నం జేస్తున్నడు.  గోద్రా అల్లర్ల తరువాత మోది
రాష్ట్రానికి రావడానికి కూడ ఇష్టపడని బాబు ఇప్పుడు మోదిని నెత్తి
కెక్కించుకుంటున్నడు.  ఈయన జగన్ బాబును పట్టుకొని ‘యు’ టర్న్
అని మాట్లాడుతుండు!
వైయెస్సార్ జగన్మోహన్ రెడ్ది ఎం తక్కువా?  మాటలు మార్చటములో చంద్రబాబును
మించినోడు.  బైబిల్ పట్టుకొని విజయమ్మ ఆర్టికల్ మూడు ప్రకారము కేంద్రము తెలంగాణ
ఇవ్వాలని, తెలంగాణలో పరిస్థితులు చక్కదిద్దాలని అంటుంది.  మళ్ళి అదే బైబిల్
పట్టుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలని దీక్షలు చేస్తుంది.  ఆ అమ్మ కొడుకు "నేను
సెక్యులర్ పార్టీలతోనె కల్సి పని చేస్త"నని అంటడు.  అదే ఊపులో మోది కార్య దక్షతను
మెచ్చుకొని, సెక్యులర్ పార్టీలన్నిటిని ఆయన ఒక వేదిక మీదకు తీసుకొని రావలంటడు.
దీని అర్థమేమి దేవా?  జగన్ తమకు సపోర్ట్ అంటె తీర టైముకు భాజపా తెదేపాను
ఏ సముద్రములో కల్పుతుందో.
కిరణ్‍కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకైన అర్థంమైతుందా అని నా
డౌట్.  తెలంగాణ వచ్చుడు ఇష్టం లేదు.  అది అందరి సీమాంధ్రుల కున్నదే.  రాష్ట్రాన్ని
విడదీస్తె వచ్చె ఇబ్బందులు వాస్తవంగా ఏంటో చెప్పితె వాటి పరిష్కారముంటుంది.
అబద్ధాలు, కలిపిత విషయాలు రెచ్చగొట్టెట్టు చెప్తె ఎట్లా?  "ఆంధ్రా బుష్" అయిండు.
అప్పుడు నెహ్రు చేసిన శాసనాలు నీటి మూటలంటడు.  అప్పుడు ఆంధ్ర తెలంగాణను
కలిపెటప్పుడె నెహ్రు, కలిసి వుండలేకపోతె ఎప్పుడైనా విడిపోవచ్చని చెప్పిండు కద.  మరి
ఆ మాటకు విలువ లేదా? ప్రజలంతా తెలివి తక్కువోల్లనుకుంటరు.  ఆ ప్రజలే ఎలేక్షన్లలో
ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు బుద్ది చెపుతున్నరు.  కాని రాజకీయ నాయకులంతా కోడి
ముక్కు నేలకు రాసినట్లుంటరు.
కాంగ్రేసు అధిష్టానం టికెట్లిస్తెనె, కాంగ్రేసు పేరు, గాంధీల పేరు చెప్పుకొని ఓట్లడుక్కునే
నాయకులు "అధిష్టానం జాన్తనై, సోనియా ఎవరు, ఆమెకీ దేశము, ప్రజల గురించి  ఏం
తెలుస"ని ధిక్కార స్వరాలు వినిపిస్తున్నరు.  ఇన్నాళ్ళు ఈ సీమాంధ్ర ప్రతినిధులు
నోట్ల సంచులతో తెలంగాణ ఆపిండ్రని తెలంగాణ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నరు.
కాంగ్రేసు కోర్ కమిటీ నాన్చి నాన్చి తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయము
తీసుకుంటే వచ్చె ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, ఒక్క తెలంగాణ ఏర్పాటు అనే ఒక్క
బాణముతో భాజపా, తెదేపాలను మట్టి కరిపించాలని  చేసిందని అందరు అనుకున్నదే.
ఎట్లాగైతెనేం, మనకు తెలంగాణ వస్తుందని తెలంగాణ ప్రజలు సంతోషపడ్డరు.  రెన్నెళ్ళు
దాటినా విషయము ఎక్కడ వేసిన గొంగళి అక్కడె వున్నట్టు వుండటంతో తెలంగాణ ప్రజల్లో
మళ్ళీ అనుమానాలే.  ఆంటోని కమిటీలో వీరప్ప మొయిల వున్నాడంటేనే నాకనుమాన
మొచ్చింది.  షిండేగారు రోజుకో మాట్లాడుతుంటే ఆయన మీద కూడ అనుమానమే.  నిర్దిష్ట
కాల పరిమితి లేని ఓ కమీటి పెట్టి విషయాన్ని కాంగ్రేసు ప్రజలను ఎంత కాలం మోసము
చేయదల్చుకుంది?  ప్రజాస్వామ్యదేశంలో ప్రజాస్వామ్యహక్కుల పరిరక్షణ ప్రభుత్వానికి
పట్టదా?  డబ్బు మూటలకు అమ్ముడుపోయి ఒక ప్రాంత ప్రజలను మిలిటిరీతో
కాల్చివేయటము, లేదా పోలీసు కేసుల్లో ఇరికించి జైల్లో బంధించటమే ప్రభుత్వ
పాలనా విధానమా?  ఇదేం ప్రజాస్వామ్యం?
ఇప్పటి రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర, కేంద్రప్రభుత్వతీరుకు, కాంగ్రేసు మార్కు రాజకీయాలకు,
ఇతర పార్టీల ఎత్తులు పొత్తులు చూస్తున్న తెలంగాణ ప్రజలు ఎంతో ఆందోళన పడుతున్నరు.
ఈ మానసిక హింస తెలంగాణ ప్రజలు ఎంత కాలం తట్టుకోగలరు?  వారు సహనం కోల్పోతే
ఏర్పడె పరిస్థితులు దేశానికే తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు.
రాహులుగాంధి కాంగ్రేసు పార్టీ ఉపాధ్యక్షుడు.  కోర్ కమిటీ సభ్యుడు.  అతనికి తెలియకుండానే
నేరచరితుల రక్షణ ఆర్డినెన్స్ తయారైందా?  అతను పబ్లిక్‍గా దానిని చించేయలనడము ఏ
వ్యూహముతోటి?  అతని మాటకు విలువ ఇచ్చి ఆ ఆర్డినెన్స్ వెనిక్కి తీసుకున్నరు.
ఆర్డినెన్స్ ఉపసంహరణ ప్రజాస్వామ్య విలువలను కొంతైనా కాపడుతుంది.  ఈ వ్యవహారం నడిచిన
తీరు దాని ప్రభావము తెలంగాణ బిల్లుపై పడదా?  ఇదివరకే సీమాంధ్ర ప్రతినిధులు పార్లమెంట్లో
తెలంగాణ బిల్లు పెడితె చించడానికి వెనకాడమని అన్నరు.  ఇప్పుడు వాళ్ళు అది చేసి చూపె
ట్టొచ్చు.  అంతే కాదు.  కాంగ్రేసు పార్టీ, కేంద్ర కేబినేట్ ఒప్పుకొని రాష్ట్రపతి సంతకానికి వెళ్ళిన
ఆర్డినెన్సునే వెనిక్కి తీసుకున్నట్టే తెలంగాణ నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోమని ఆందోళన చేస్తరు
ఈ ఆంధ్రోల్లు.  రాహులు గాంధిని ఒప్పిస్తె పనులైతయని తెలిసిన సీమాంధ్రోల్లు ఇప్పుడు ఆయన
దగ్గరకు వాళ్ల బిడ్డలను పంపిస్తరనుకుంట.

Friday, September 27, 2013

News - Views

ముసుగు
అదో పెద్ద ఊరు.  ఆ హాస్పటల్ ఆ వూళ్ళో తొలి హాస్పటల్,  పెద్ద
హాస్పటల్. ఈశ్వరయ్య ఆర్.ఎం.పిగా చిన్న క్లినిక్‍గా మొదలు పెట్టి
తర్వాత నర్సింగ్ హోమ్‍గా మార్చిన ఆ ఆసుపత్రిలోనె
కొడుకు కోడలు (స్పేషలిస్టులు) కూడ వచ్చి ప్రాక్టీసు చేస్తున్నారు.
ఆరోజు తండ్రి లేక పోవటముతో రాజ్‍కుమారే ఓ.పిలో మగ
పేషంట్లందరిని ఒక్కడే చూస్తున్నాడు.  ఓ పేషంట్ నీరసంగా
నడుస్తు వచ్చి డాక్టర్ పక్కనున్న స్టూల్ మీద కూలబడ్డడు.
వెంట ఓ ఆడమనిషి లోపలికి వచ్చింది.  చేతిలో ఓ ప్లాస్టిక్
సంచి, సంచిలో మందులు.  ఆ మందులన్ని డాక్ట్రర్ ముందున్న
టెబుల్ మీద గుమ్మరించింది.
"ఇంగొ సారు.  కడుపుల నొప్పంటే నిన్న గీ మందులు రాసిచ్చిండ్రు.
నొప్పింక ఎక్కువైందిగని తగ్గలే.  పొద్దుగాల నుండి ఏం తినలే.
కడుపుల మండుతుంది, ఒకారమని అంటుండు.  అస్సలే
లేస్తలేడు.  బల్మీటికి పట్టుకొచ్చిన".  ఆ ఆడామే మందులు
గుమ్మరిస్తు చెప్పింది.
వాళ్ళు పాత పేషంట్లేనని రాజ్‍కుమార్‍కు తెలుసు.  కుప్ప పోసిన
మందులు చూస్తు, "గీ మందులు వాడితె కడుపుల మంట రాదా?
ఓకారము కూడ వస్తది.  మందుల చిట్టేది?  ఎక్కడికి పోయినవ్?
ఎవ్వరాశిండ్రీ మందులు?  పోశాలుకు ముందె దమ్ముంది. గివన్ని
ఎట్ల రాశిండ్రు?" అడిగాడు.
ఈ మధ్య కాలంలో వీళ్లు ఒకసారి పక్క కొత్త డాక్టర్ దగ్గరకు వెళ్ళి
జబ్బు నయంగాక పోయేసరికి మళ్లి తన దగ్గర చూపించుకోవటము
గుర్తుంది.
"గప్పుడొక్కసారి మీరు లేకపోతె ఆపతికి రామారావ్ డాక్టర్ కాడికి
పోయినం.  ఎప్పుడు మీ కాడికే వస్తం.  నిన్న నాయనే మందులు
రాశిండు.  ఇయ్యాల నాయన లేడు కదా.  ఎప్పుడు మంచిగనే రాస్తడు.
నిన్న కూడ బరబర మండుతుంది, కడుపుల అవస్తుందనే వస్తిమి.
గిట్ల నొప్పి ఎక్కువయ్యె మందులు రాశిండేంది?"  ఏమి తెలియనట్టన్నా
కాస్త నిలదీసినట్టె అడిగింది రాజమ్మ.
రాజ్‍కుమార్ వెంటనే సర్దుకున్నడు. పోశాలును పరీక్ష చేస్తు
"మరి మందుల చిట్టేది? ఎక్కడ తీసుకున్నవ్ మందులు?"
మందులు చూస్తే వాళ్ళ షాప్‍వని అర్థమైనా అడిగాడు.
"మన షాపులనే సారు.  మనిషి నిన్నటి నుండి తినుడు లేదు.
మొస పోస్తున్నడు.  ఏటంటే అటె పడుతున్నడు.  ఇప్పుడైనా
సరిగ చూసి కరెస్ట్ మందులు రాయుండ్రి."   ముందు రాజ్‍కుమార్
అన్నమాటలతో నిన్న డాక్టర్ కరెక్ట్ మందులు రాయలేదని అనుమాన
పడ్డది రాజమ్మ.
డాక్ట్రర్ రాజ్‍కుమార్ తన తప్పు, ఆమె శ్లేష వెంటనే అర్థం చేసుకున్నడు.
"నిన్న అవస్థకు నాన్న ఈ మందులు బాగనే రాశినరు.  పోశాలుకే సరిగ
పడలేదు.  నేను ఇప్పుడు వేరే మందులు రాస్తా.  ఈ మందులు వాపసిచ్చి
కొత్తవి తీసుకో."  మందులు రాస్తు అన్నాడు
"ఏమో సారు.  ఎప్పుడు మీ కాడికే వస్తము.  గిన్ని ఏండ్ల బట్టి చూస్తున్నరు
మా గురించి మీకు బాగా తెలుసుని గీడికొస్తము.  మూడ్రోజుల బట్టి పనికి పోక
పాయె.  చేసుకుంటే బతికేటోళ్ళం.  మాకేట్లెళ్లాలే.  రానువోను ఆటో చార్జీలు
డబలాయె."   రాజమ్మ సాగదీసింది.
"ఇగో. నా దగ్గరున్నయని ఈ మందులుస్తున్నా.  కొత్త చిట్టిల మందులు రాస్తున్న.
రెండు రోజులు పెరుగన్నం పెట్టు.  మూడో నాడు తీస్కొని రా.  రవి, ఇక్కడ్రా.  ఈ
ఇంజెక్షన్ ఇచ్చి పంపు."  బైటె వున్న కంపౌండర్ను పిలిచి వెంటనే పోశాలును
రాజమ్మను బైటకు తీసుకెళ్లమని సైగ చేశాడు.  ఒక్క నిమిషము లేటైనా
రాజమ్మ అమాయకంగ అన్నట్టె అన్పించినా మరింత నిలదీసినట్టు
మాట్లాడుతుందని తెలుసు.
"రామ్మా, రా.  సూది ఇస్తను రా.  తొందరగ నొప్పి తగ్గుతది", పోశాలును చేయి
పట్టుకొని బైటకు నడిపిస్తు తీసుకెళ్ళాడు రవి.  మందుల చిట్టి డాక్టర్ దగ్గరి నుండి
తీసుకొని వెనకె నడిచింది రాజమ్మ గొనుక్కుంటు, "ఏం మందులో, ఏం రోగాలో".

                 **************************************

సుప్రీమ్ కోర్ట్ రెండెళ్ళ కంటె ఎక్కువ శిక్ష పడ్డ రాజకీయనాయకులు, జైల్లో
వున్న వాళ్ళను చట్ట సభలకు అనర్హులుగా చే్యాలని తీర్పునిచ్చింది.  దీనిని
అటకెక్కించడానికి కేంద్రప్రభుత్వము ఆర్డినెన్స్ జారి చేయబోతుంది.  ఉమ్మడిగా
పార్టీల పరంగా అందరు లోపాయకారిగ ఒప్పుకున్నా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు
అభ్యంతరాలు తెలుపుతున్నారు.  కాంగ్రేసు పార్టీ తరఫునా కాబోయె ప్రధానిగ
ప్రచారములో వున్న రాహుల్ గాంధి వ్యక్తిగతంగా తను వ్యతిరేకమని, ఆ ఆర్డినెన్స్
కాగితాలు చింపేయాలని అన్నాడు.  ఈ రోజుల్లో ఎవరు ప్రభుత్వమో ఎవరు
ప్రతిపక్షమో అర్థమ్ కావటము చాలానే కష్టము.
ఓ పాత కాలం సామేత వుంది. "చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి సాని కొంపలు"
ప్రజలు వెంటనే ఏమనకున్నా ఎడ్దోళ్ళు, గుడ్డోళ్ళు కాదు.  సరైన సమయములో
సరైన నిర్ణయం తీసుకుంటరు.

Thursday, September 26, 2013

Andhra Polytricks

సీమాంధ్ర రాజకీయాలు
పాపం చంద్రబాబు.  వోటనుకుంటే వోటైంది.  రెండు కళ్ళన్నడు.
తెలంగాణకు వ్యతిరేకం కాదన్నడు.  తెలంగాణ ఇవ్వటములో
కాంగ్రేసు వెనుకాడుతుందని, దమ్ములేని కాంగ్రేసని అన్నడు.
ఏండ్లకొద్ది చర్చలు జరిగినా, తెలంగాణ ఇస్తె నాకేం అభ్యంతరం
లేదని చెప్పి, ఇప్పుడు కాంగ్రేసు తెలంగాణ ఇస్తామని ప్రకటించే
సరికి, సడెన్‍గా నిర్ణయిస్తె ఎట్లా, అందరిని - విద్యార్థులని, ఉద్యోగులను,
పిల్లలను, పెద్దలను, అయినోళ్ళను, కానోళ్లను అందరిని కూర్చో
బెట్టి మళ్ళి, మళ్ళి, మళ్ళి, మళ్ళి డిస్కషన్ల మీద డిస్కషన్లు ఎప్పటకి
పెట్టుకుంట వుండాలని విషయాన్ని సాగదీసుకుంట వుండాలని
చంద్రబాబు కోరిక.  అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమము ఏ మాత్రము
పట్టించుకోని బాబు, అసెంబ్లిలో తెలంగాణ పదము వాడొద్దన్న బాబు,
వేయిమంది కంటే ఎక్కువ మంది యువకులు ఆత్మహత్యలు  చేసుకున్నా,
చేసుకుంటున్నఐస్ కోల్డ్ గా వున్న నాయుడుబాబు ఆంధ్రాలో జరుగుతున్న
ఉద్యమానికి రోజులు, గంటలు లెక్కపెడుతు గుండెలు బాదుకుంటుండు.
అరవై ఏళ్ళ ప్రజా ఉద్యమానికి కేంద్రము దిగివచ్చి తెలంగాణా ఇస్తె, రోజుల
ఉద్యమానికి కేంద్రము స్పందించకపోవటము దారుణమని రెండు కళ్ళనిండ
నిప్పులు కురుస్తున్నడు.  ఆత్మగౌరవ యాత్రా అంటు బైలుదేరిండు.  ఆంధ్రోల్లు
తెలుగోళ్ళు, తెలంగానోళ్ళు తెలుగోళ్ళు కాదా?  వారికి గౌరవముండదా?  వారి
ఆకాంక్షలకు, ఆశలకు, హక్కులకు, ఉద్యమానికి, పోయిన/పోతున్న ప్రాణాలకు
విలువుండదా?
ఎంతో తెలివైనవాడివనుకుంటున్న ఓ నారా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్ల్లు
ఎందరిని ఎన్నుపోటు పొడుస్తవు?  ఇకనైనా ఒక మాటకు కట్టుబడి వుండటము
నేర్చుకో.  జగన్ బెయిలు తీసుకొని జైలు బైటకు వచ్చినందుకు అప్సెట్ కాకు.
బెయిలేవచ్చింది.  కేసు ఇంక కొట్టేయ్యలేదు కదా.  కేసు నడుస్తునే వుంది కదా.
తెలివుంటే నీ చతురత ఉపయోగించు.  ఇప్పుడు ఆంధ్రాకు ఏం కావాలో, ఆంధ్రా
ప్రజలకు రావల్సిన కేంద్ర పాకేజిల గురించి ప్రజలను చైతన్యపరుస్తు, జై ఆంధ్ర
ఉద్యమమోళ్ళ్త్తతో కలిసి ముందుకు సాగితే కాస్తైనా లాభముంటుందేమో ఆలోచించు.

                            ****************************

పొమ్మనలేక పొగబెట్టిండ్రంటరు.  నల్లారి కిరణ్ కుమార రెడ్డి అట్లాగె చేస్తుండు.
ఆంధ్రాలో హీరో కావాలని నల్లారి వారి కోరికనుకుంట.  ఇష్టమోచ్చినట్టు
మాట్లాడి, కాంగ్రేసు అధిష్టానానికి కోపానికి తెప్పించి కాంగ్రేసు నుండి
బహిష్కరించ బడాలని కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుంది.  అట్లా అయితె
"సమైక్యాంధ్ర కోసము నేను సి.ఎం. పదవి వదులుకున్నాను, నన్ను సి.ఎం.
చేసిన పార్టీనే వదులుకున్నాను" అని చెప్పుకోవాలని, అట్లా తను ఓ కొత్త
పార్టీ పెట్టి మళ్ళి సీమాంధ్ర సి.ఎం కావాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ప్లాననుకుంటా. గుడ్‍లక్.

                     ************************************

జగన్‍కు బెయిలు రావటముతో రాజకీయ పార్టీలన్ని తమ స్ట్రాటజిని పున
రాలోచించుకోవల్సిన అవసరమేర్పడింది.  జగన్ బెయిలతో వారి కుటుంబ
సభ్యులు ఆనందపడటము, పార్టీ వారు గంతులెయ్యటము సహజమే. జగన్‍కు
బెయిల్ వచ్చింది కాని కేసునుండి అక్విట్ కాలేదు కదా.  వేరే పార్టీలు జగన్
బెయిల్ గురించి పట్టించుకోవల్సిన పని లేదనుకుంటా.  కేసు పూర్తి కావడానికి
ఎన్ని దశాబ్దాలు పడుతుందో! కాబట్టి చార్జిషీట్ ఫైల్ కావడము పూర్తి కాగానే
బెయిల్ రావటము తప్పదు కదా.  జగన్ పట్టుదలను మెచ్చుకోవాలి.  బెయిలు
కోసం ఎన్నిసార్ల్లు ప్రయత్నించాడో! మొత్తానికి సాధంచాడు.  అందుకే అంటారు
"Try, try, try again, never say die"

                   *****************************************

లోకసత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ తాను ఓ మేధావని, చాలా తెలివిగా
మాట్లాడుతానని, రాజకీయాలకు విలువలు తాను మాత్రమే నేర్పిస్తున్నాని తెగ
చెప్పుకుంటాడు.  పరిపాలన వికేంద్రికరణ గురించి ఒకప్పుడు తెగ లెక్చర్లు కూడ
దంచిండు.  తెలంగాణ విషయమోచ్చెసరికి విలువలన్ని మూటకట్టి మూసీలో పడె
సిండు.  ఆంధ్ర బుద్ధి, పక్షపాత బుద్ధి, స్వార్థ ప్రయోజనాలకే పెద్ద పీట వేసి తాను
కూడ నేటి తరం రాజకీయనాయకుడని నిరూపించుకున్నడు.  మాటలేన్ని మాట్లా
డిన చేతలు మనిషి అసలు గుణాన్ని బైటపెడుతయి.  

Ganesh Immersion

వినాయక నిమజ్జనము
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది.  ఈ సారి దీనికి ఓ
కొత్త పదం వాడినరు.  ‘విసర్జన్’ అని అన్నారు.  విసర్జనమంటె
నాకు నచ్చలేదు.  నిమజ్జనమంటేనే బాగుంది.  పరిస్థితి అదే
అయినా, అర్థము దాదాపు అదే అయినా అన్ని రోజులు పూజలు
చేసిన వినాయకుడిని విసర్జించినమనే కంటే నీటిలో నిమజ్జనం
చేసినమనుడె గౌరవప్రదంగా అనిపిస్తుంది.
దాదుపు 60,000 వినాయకులను జంటనగారల్లో పెట్టారట.  అవే
కాక ఇండ్లల్ల పెట్టిన చిట్టి పొట్టి వినాయకులు ఎన్నిలక్షలో. ఇన్ని
వినాయకులను హుస్సేన్‍సాగర్‍లో వేస్తె ఆ చెరువేం కావాలి.  ఇప్పటికే
అది చెత్తచెదారము, మురికినీళ్లు పనికిరాని నీటిమొక్కలతో సగం
కూడుక పోయింది.  నా చిన్నప్పుడు ఆ చెరువు ఆవలి గట్టు కనిపించేది
కాదు.  ఇప్పుడైతె ఆమడ దూరములో బిల్డింగులే బిల్డింగులు. ఆ
మురికి వాసన పీలుస్తు ఆ బిల్డింగ్గుల్లో జనాలుంటున్నారంటే నాకైతె
ఆశ్చర్యమే.  వాళ్లకు దమ్ము బీమారులేమి రావా?
అప్పుడెప్పుడో చాలా ఏండ్ల కింద బాల గంగాధర్ తిలక్ బిటిష్ వారికి
వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటము చేస్తు, దేశ ప్రజలో జాతీయత భావాన్ని
పెంచేందుకు ఈ వినాయక ఉత్సవాలు మొదలు పెట్టాడు. ఆ వారసత్వము
అట్లనే నడుస్తుంది.  అది ఇప్పుడు పర్యావరణానికే మోసం తెస్తుంది.  ఇప్పుడు
గల్లి గల్లికో విగ్రహాన్ని పెట్టి, మైకులు పట్టి జనాలను అదరగొడుతున్నారు. పెద్ద
పెద్ద పందిళ్ళు, వాటికి లైట్లతో అలంకరణలు,  వాడ పొడుగుతా బోలెడు వరసల్లో
సీరియల్ లైట్లు, అమ్మో రాను రాను, అన్ని పెరిగి దానితో పాటు చందాల దందా
విపరీతంగా పెరుగుతుంది.  వినాయకుని లడ్డు కూడ వో పెద్ద బిజినెస్ అయితుందని
పిస్తుంది.  మొన్న 12లక్షల లడ్డు చెరువులో పడెశారంటే చాలానే బాధనిపించింది.
మన దెశములో సగానికి సగమంది పిల్లలు పౌష్టికాహారలోపంతో అనారోగ్యం పాలౌతు
న్నరు.  తిండి లేక చనిపోయెవాళ్ళు వున్నరు.  అంత డబ్బుతో కొన్ని అనాధ శరణా
లయాల్లో ఎంతో మందికి కొద్ది రోజులు తిండి పెట్టొచ్చు కదా.
ప్రతి ఏడు ఇన్నిన్ని విగ్రహాలు చేసి వాటిని నిమజ్జనం చేసి ప్రకృతిని నాశనము చేసేకంటే
గుడిలో వుండె వినాయకుడికి పూజలు చేసి, అక్కడె ఆ తొమ్మిది రోజులు
జాతీయత,పర్యావరణపై అవగాహన పెంపొందించె రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు
చేస్తె బాగుండదా?  వినాయకుడిని పూజించె అన్ని రకాల ఫలము, పత్రి, పుష్పము,
వాటి ఉపయోగాలు, ఆరోగ్యవిలువల గురించి అందరికి అవగాహన కలిగించవచ్చు.
ప్రతి ఊళ్ళొ గుడి వుంటుంది.  ప్రతి బస్తీలో, వాడలో గుడి వుంటుంది.
ప్రతి ఇంట్లో వినాయక విగ్రహము కాని పటము కాని ఉంటుంది.  ఇంట్లో పూజలు ఎట్లాగు
చేస్తరు.  ఆ తరువాత పండగ నాడు చాలా మందె గుడికి వెళ్తారు.  గుడిలో కార్యక్రమాలలో
విజేతలకు బహుమతులివ్వటము, తరువాత మండల స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలు పెట్టి
అఖరు నాడు వారికి బహుమతులివ్వటము జాతి భావము కలిగిస్తుంది కద.
పెద్దలంతా కూర్చొని ఏదొ ఆలోచించి పర్యావరణ పాడవకుండా, సంస్కృతిని కాపాడుకుంటు
ముందుకు పోయే విధానము ఆలోచించాలి.  ఛాందస భావలతో భావితరాల భవితకు
విఘాతము కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

APNGO - Leader

గారడి
అశోక్ బాబు ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదనుకుంటా.
ఆయన ఎట్లా ఉద్యమము తెర మీదికొచ్చిండో మర్చిపోయినట్టుండు.
వాపు చూసి బలుపనుకుంటుండు.  జనం అంతా తన మాటా వినే
వస్తున్నడునుకుంటుండు.  అదివరకున్న జేఏసీ చైర్మెన్ ప్రోఫెసర్
సామ్యూల్‍ను ఎవరు ఎందుకు కనుమరుగు చేసినరో?  కొత్తగా  వచ్చిన
ఈ ఆశోక్ బాబును కూడా రాజకీయనాయకులు తలచుకుంటె అతాపతా
లేకుండా చేయగలరు.  ఆశోక్ బాబు తెలంగాణలో ఉద్యోగం చేస్తుండు,
రిటైర్ అయి హైద్రబాదులోనే సెటెల్ కావాలనుకుంటే కాస్త ఒళ్ళు దగ్గర
పెట్టుకొని మాట్లాడాలి.  తెలంగాణ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి.  కొత్త
బిచ్చగాడు పొద్దేరుగడన్నట్టు, కొత్తగా వచ్చిన మాస్ ఫాలోయింగ్ చూసి
అది రాజకీయనాయకుల గారడని మరిచిపోయి, నిజమనుకొని, జోష్‍లో
హోష్ లేకుండా మాట్లాడుతున్నడు.
తెలంగాణ ప్రజలు అసలు ఎప్పటినుండో ఆంధ్రావాళ్ల బిజినెస్‍లు నడవకుండా
సహాయనిరాకరణ చేయలనుకున్నరు.  ఏఏ బిజినెస్‍లు ఎవరివొ, వారి ఉత్పత్తులు
ఏంటివో వాటి లిస్ట్ కూడ చేయదల్చుకుంటే కేసిఆర్ వద్దన్నరని అది ఆగి
పోయింది.  లేకపోతె  చాలా మంది ఆంధ్రోల్ల బిజినెస్‍లు మూత పడేవి.  ఇప్పుడు
ఈ ఆశోక్ బాబు అన్న మాటలకు తెలంగాణ వాళ్ళు పట్టించుకొని అది ఆచరణలో
పెట్టి చూపిస్తరు.  తెలంగాణ వాళ్లకు ఆ భావము ముందే వుంది.  ఇప్పుడు
అది ఆచరణలోకి వస్తుంది.  ఆంధ్రోళ్ళు బిజినెస్‍లు మూసుకొని పోయె రోజులు
దగ్గర్లోనే వుంది.

Fogsi -Figo 2013 - Hyderabad

మాతృత్వ పరిరక్షణ
ఈ మధ్యే హైద్రబాదు - హైటెక్ సిటీలో ఫాగ్సి-ఫిగో కాన్ఫరెన్స్
జరిగింది.  స్త్రీల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, కాన్పు, మాతృ
శిశుమరణాల గురించి, వాటిని ఎట్లా తగ్గించటము గురించి దేశవిదేశాల
నుండి ప్రముఖ వైద్యనిపుణులు మాట్లాడినరు.  అభివృద్ధి పొందిన
దేశాలతో పోలిస్తె అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృ మరణాలు
శిశు మరణాలు చాల ఎక్కువ.  ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి
ఒక స్త్రీ గర్భధారణ, కాన్పు కారణంగా మరణిస్తుంటె, అందులో
90% అభివృద్ది చెందుతున్న దేశాల్లో జరుగుతున్నాయి.  ఈ
మరణాలు శ్రీలంక, బంగ్లాదేశ్‍తో పోలిస్తే మన దేశములో ఎక్కువ
అంటె మన మంతా సిగ్గు పడాల్సిన విషయం.
ఈ మరణాలు తగ్గించటానికి కొన్ని జాగ్రత్తలు అందరు పాటిస్తె చాలు.
ముఖ్యమైనవి
-యుక్త వయస్సు వచ్చాకె పెళ్లి
-20 ఏళ్ళ తరువాతే తొలి కాన్పు
-గర్భవతి కాకముందే ఆరోగ్య పరీక్షలు చేసుకొని తగు జాగ్రత్తలు
తీసుకోవటము
-గర్భవతి అయ్యాక కనీసంగా నాలుగు సార్ల్లు నెల పరీక్షలు చేసుకోవటం
-కనీసంగా వంద రోజులు ఇనుము (ఐరన్) మాత్రలు వాడటం
-రెండు నెలసూదులు (టి.టి ఇన్‍జెక్షన్) వేసుకోవటం
-కాన్పు తప్పనిసరిగ ఆసుపత్రిలోనే కావటము
-కన్న మరుక్షణమునుండి ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వటం
-కన్నాక మూడో నెలనుండి మళ్లి మూడునాలుగేళ్ల వరకు గర్భము 
రాకుండా గర్భనిరోధక పద్ధతులు వాడటం
-పిల్లలకు అన్నిటీకాలు తప్పనిసరిగా వేయించటం
ఇవన్ని పాటిస్తు పరిశుభ్రత, పౌష్టికాహారము తీసుకుంటే మాతా శిశు
మరణాలు చాలాచాలా తగ్గిపోతాయి.  కాన్పు పునర్జన్మ కాదు, కోరుకున్నా
మహత్తర ఘట్టంగా సంతోషాన్ని ఇస్తుంది.

Tuesday, September 10, 2013

News - Views

షేవ్ ఆంధ్ర ప్రదేశ్ 
తెలంగాణలో తెలంగాణ వాళ్ళు సభ పెట్టుకున్నా, ఆంధ్రోళ్ళు
సభ పెట్టుకున్నాలాఠీలు విరగటము, భాష్ప వాయుగోలాలు
పేలటము తెలంగాణ పిల్లల మీదనే.  ఇది ఆంధ్రోళ్ళ ప్రభుత్వం.
సీమాంధ్రులు ఏం జేసినా, మీ పీకలు తెగ్గోస్తామని తెలంగాణ
పిల్లలను బెదిరించిన, వారికే ఫుల్లు రక్షణ.
‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభలో తెలంగాణ వారికి చోటు లేదు.  ‘కలసి
వుంటే కలదు సుఖమ’నేవాళ్ళ సభలో వున్న ఒక్క తెలంగాణ
వ్యక్తిని కుర్చీలతో కొట్టి తరిమేశిండ్రు.  వాళ్లకు బందొబస్తుకు వచ్చిన
పోలీసు కానస్టేబుల్ శ్రీనివాస్ గౌడును తోటి ఆంధ్ర పోలీసులు,
అన్నదమ్ముల్లా కలిసుందామనేటోళ్ళు, గుమ్ముగూడి ఒక్కడిని
ఇష్టమోచిన్నట్టు కొట్టిండ్రు.  మాయం జెద్దామ్నుకున్నరేమోని డౌటు.
కాని ప్రపంచమంతా ఆ దృశ్యము చూసింది కాబట్టి ఆ బిడ్డను వదిలేసినరు.
విద్యార్థి బదులు టీచరె పరీక్ష రాసినంక ఫర్స్ట్ క్లాసు వస్తె ఎంత గొప్పగ
చెప్పుకుంటారో అట్ల ఏపి ఎన్జివో నేత ఖుషి ఖుషిగా సభ సక్సెస్ అయిందని
చెప్పుకుంటుండు.  ‘నియమాలు వున్నదే ఉల్లంఘించటాని్కే’ అన్న ఆశోక్
బాబు అది మొన్నటి సభలో చేతల్లో నిరూపించిండు.  మహామహా మేధావులు
కూడా మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పడానికేమో, చలసాని శ్రీనివాస్‍ను
వేదిక మీద దిష్టి బొమ్మలా వుండటానికి కూర్చోబెట్టిండు.  చలసానికి కాస్తైన
సిగ్గు శరముంటే ఇంకోసారి ఏపి ఎన్జివోల ఇలాంటి సభలకు దూరముంటాడను
కుంటా.
సభలో అంతా ఎప్పటిలాగె తెలంగాణ వేరైతె మా బతుకులు బండలే అని,
తెలంగాణ మీద వాళ్ళు ఇన్నాళ్ళు ఎంత ఆధారపడి వున్నారో తెలపటము,
వాళ్ళు ఇన్నాళ్ళు తెలంగాణను అన్ని విధాలా దోపిడి చేస్తున్నారని చెప్పకనే
చెప్పినరు.  ఈ సభలో ప్రత్యెక ఆకర్షణ కైకాశుర్పణఖే.  ఎప్పడిదో ఓ మాట పట్టుకొని,
చెప్పుడు మాటలకు, భరతుడుని రాజు చేయమనుడె కాక రాముడు పదునాలుగేండ్లు
వనవాసానికి వెళ్లాలని కోరింది కైకేయి .  రామలక్షమణులు వివాహితులని
తెలిసికూడ వారి పై కోరికను పెంచుకొని కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది
శూర్పనఖ.  ఇప్పటి  ఈ కైకాశూర్పనఖకు తెలంగాణ చరిత్ర, ఆ ప్రజల ఆవేదన అవసరము
లేదు.  ఆమే ప్రాంతం బిడ్డల కడుపు నిండుతే చాలు.  వెయ్యిమంది కంటె ఎక్కువ
తెలంగాణ బిడ్డలు చనిపోతె ఆ తల్లికి అవసరము లేదు.  తల్లికి  దుర్మార్గుడైనా
సొంత కొడుకు ఒక పూట ఆకలిగా వుంటే గుండె తల్లడిల్లుతుంది కాని సవతి కొడుకు
ధర్మాత్ముడై తన కుటుంబాన్ని పోషిస్తు తాను మాత్రము ఆకలితో అలమంటించి
చనిపోతె అదివాడి ‘ఖర్మ’ అని మూతివిరుస్తుంది.  ఈ కైకాశుర్పనఖకు బతుకు విలువ,
బతుకమ్మ విలువ తెలుసా?  తెలంగాణ ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజించే బతుకమ్మని
తాన్నెన్నడైనా చేతిలో పట్టుకుందా? మాటల గారడి కాదు, సత్యము పలుకు తల్లి.
ఆ పాటగాడు మహా గ్రేటట!  గిన్నిస్ రికార్డూ వుందటా!  ఈ దేశములోనే పుట్టి పెరిగాడు.
కాని జాతీయగీతము మాత్రము పాడటం చేతకాదట.  ఇది ఆంధ్రోళ్ళ   గొప్పతనం!

Monday, September 9, 2013

Ganesh Chaviti

జై గణేశా
శ్రీ గణేశ, జయ గణేశ
జయ జయ విఘ్నేశ
మా  విఘ్నాలే తొలగించి
విజయాన్నే అందించు 
వరసిద్ధి వినాయక!

Friday, September 6, 2013

News - Views

ఏపి సభ - కుతంత్రాల రభస 
"రేపటి గురించి అందరు ఒకటె టెన్షన్ పడుతున్నారు కదా."
"అవును.  ఏమైతది?  ఆంధ్ర గౌర్నమెంట్, ఆంధ్రో్ల్లకే సపోర్ట్
ఇస్తారు కద.  తెలంగాన లీడర్స్ అందరిని అరెస్ట్ చేసో, మరేదో
చేసి ఆ సభ గ్రాండ్ సక్సేస్ చెస్తర్లే."
"అది సక్సెస్ అయినంత మాత్రాన తెలంగాన అగుతదా. ఏండ్ల
తరబడి నాన్చి, నాన్చి ఇప్పుడేదో ఓ నిర్ణయం ప్రకటిస్తె ఎంత
గొడవ చేస్తున్నరు.  వాళ్లే అక్కడకు వెళ్లిన వాళ్ల మీద దాడులు
చెస్తున్నరు, ఇక్కడేమో ప్రభుత్వమండ చూసుకొని మేము ఏం
చేసినా నోర్మూసుకోండి. లేకపోతే తెలంగాన రాకుండ అడ్డుకుంటం,
ఇంక ఇరవై ఐదేండ్లైనా తెలంగాన రానివ్వమి బెదిరిస్తున్నరు.
ఇసుంటోల్లు వుంటరనే రాజ్యాంగంలో అర్టికల్ 3 పెట్టిండ్రు కదా."
"కాని మన నేల మీద మనకు వ్యతిరేకంగా కార్యక్రమము బాధ
అనిపిస్తది కదా. "
"ఇంకా ఏపిగానే వుంది కద.  అందుకే వాళ్ల ఆధిపత్యం.  అరవై
ఏండ్ల కొట్లాట ముంది ఈ ముప్పై రోజల అల్లరి ఏం పనికొస్తది?
పిల్లలు అసలే నిరాశ పడొద్దు.  మనకు దమ్ముంది, ధైర్యముంది,
సహనముంది.  న్యాయం, ధర్మం మనతో వుంది.  ఎప్పటికైన
గెలుపు ధర్మము, న్యాయానిదే కద!"
"వాళ్ల అల్లరి, దౌర్జన్యము, దానికి ప్రభుత్వం సపోర్ట్ చూస్తుంటే
టెన్షెన్తొ నాకైతె హార్ట్ అట్టాక్ వస్తదేమో అనిపిస్తుంది."
"చాల్లే.  అట్లా మాట్లాడకు.  మన కోదండరామ్ గారిలా  
కూల్‍గా వుండి పని సాధించుకోవాల.
తెలంగాన ఎట్లాగన్న వస్తుంది.  కాని ఈ గొడవల వల్ల విడిపోయినంక
మనము కలిసి వుండేట్లు లేదు.  ఇన్నాల్లు ఆంధ్ర - తెలంగాన వాళ్ళు
చుట్టారికాలు కల్పుకునేటోనేళ్ళు.  నేతల వల్లనో, దోపిడి దారులవల్లనో
ప్రస్తుతము అల్లరులు అయితున్నా దీని ప్రభావము సామాన్య ప్రజల
మీద పడుతుంది.  ముందే తెలంగాన వాల్లకు ఆంధ్రోల్లంటే అనుమానము,
బాగా ఉషారోల్లని, మోసగాల్లని.  ఇప్పుడు జరిగేది చూస్తున్న వాళ్ళు లౌ
మారెజి అయితె తప్ప మాములుగ పిల్లలను ఇచ్చి పుచ్చుకోవడము చాలా
చాల తగ్గిపోతది."
"ఈ నాయకులు కాస్త తెలివిదెచ్చుకొని ప్రజలను రెచ్చగొట్టుడు మానేస్తె బాగుండు.
ఈ అల్లరులు చల్లారాలంటే కేంద్రము తొందరగ తెలంగాన బిల్లు పార్లమెంటులో
పెట్టెస్తె పనైపొతది.  పనిలోపని రాష్ట్రపతి పాలన విధిస్తె అంత సక్కగైతరు."
"చూద్దాం ఎం జరుగుతుందో?"

Wednesday, September 4, 2013

News - Views

వరకట్నాగ్నికి గంటకు ఒక స్త్రీ బలవుంతుదని నివేదికలు
చెపుతున్నాయి.  ఎన్నాళ్ళు స్త్రీలు ఇలా బలికావాలి?  ఉన్న
చట్టాలను సక్రమంగా అమలు పరిస్తె, న్యాయము సకాలములో
అందితె ఇవి ఆగిపోక తప్పదు.  కావలిసింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి,
ప్రజలలో చైతన్యము, స్త్రీ పురుషుల్లో మానవులనె సమభావము.
స్త్రీలు విద్యావంతులై, అర్థిక స్వావలంబన, ఆత్మస్థైర్యము పెంపొందించు
కుంటే వారి జీవతములో కష్టాలను ఎదుర్కొని నిబ్బరంగా బతకగలరు.
ఎవరి జీవతములో వారె నాయకులు, ఇతరులు వస్తారు, పోతారు.  ఈ
జీవతము ఏ ఒక్కరి కోసము కాదు.  తన కోసం.  తన కలలు తీర్చుకునే
కోసం.  అందుకు తానే కష్టించి సాధించాలని తెలుసుకొని, ధైర్యముతో,
స్థైర్యముతో అఖరి ఊపిరి వరకు ముందుకు సాగె కోసం.
వరకట్న చావుల గురించి విన్నప్పుడు 1994, అక్టోబర్‍లో రాసినదానిని
ఇప్పుడు ఈ బ్లాగ్‍లో పెడుతున్నాను.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బాధలు లేని బతుకు ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
కన్నవారింట బతుకు ఉయ్యాలో
ఆనందాల విరిజల్లులె ఉయ్యాలో /బతుకమ్మ/

కన్నెపిల్ల కనె కలలు ఉయ్యాలో
కమ్మని కలలే ఉయ్యాలో
కన్నవారు కడుమురిపెంగా ఉయ్యాలో
కోరుకున్నవాడితో ముడి పెట్టిరి ఉయ్యాలో /బతుకమ్మ/

కట్టుకున్న వాడు ఉయ్యాలో
కఠినాత్ముడాయె ఉయ్యాలో
కట్నాల కాంక్షలో ఉయ్యాలో
కాంతనే కష్టపెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకే ఉయ్యాలో
భారమై పోయె ఉయ్యాలో /బతుకమ్మ/

కాసులు తెమ్మని ఉయ్యాలో
కన్నవారింటికి తరిమె ఉయ్యాలో
తేలెని ఆ తల్లిని ఉయ్యాలో
చేతులార తగులబెట్టే ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకె ఉయ్యాలో
బుగ్గిపాలాయె ఉయ్యాలో /బతుకమ్మ/

కలలు కనే ఈడులో ఉయ్యాలో
కాటికే తరలి వెళ్ళే ఉయ్యాలో
కల్సి బతక వచ్చిన పడతిని ఉయ్యాలో
మట్టుబెట్టి మన్నులో కలిపారె ఉయ్యాలో /బతుకమ్మ/

ఈ కథ మారెదెప్పుడె ఉయ్యాలో
తరుణుల తలరాత మారెదెప్పుడు ఉయ్యాలో
అతివలు చదువునేర్చి ఉయ్యాలో
ఆత్మస్థైర్యముతొ మెదలాలె ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మబతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
ఆర్థిక స్వావలంబన ఉయ్యాలో
అబలను సబల చేయును ఉయ్యాలో /బతుకమ్మ/

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
బంగారు భవిష్యత్తుకు ఉయ్యాలో
ఆలోచనతో అడుగువెయ్యాలె ఉయ్యాలో /బతుకమ్మ/

స్త్రీ పురుషులు కల్సి ఉయ్యాలో
సమైక్యతతో మెదిలితె ఉయ్యాలో
సుఖశాంతులతో బతుకు ఉయ్యాలో
తీయని పాటగా సాగును ఉయ్యాలో/బతుకమ్మ/

Sunday, September 1, 2013

News - Views

ఆంధ్ర బాబూ - అవకాశ యాత్ర
పాపం, ఎర్రబెల్లి దయాకర్‍రావ్! చంద్రబాబు తెలంగాణకు
అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చాడు కాబట్టి తెదేపా
తెలంగాణలో గెలుస్తుందని, తానే తెలంగాణలో చెప్పుకోదగ్గ
నాయకుడనని, దేవుడు దయదలిస్తె చీఫ్ మినిస్టర్‍ కావచ్చని
ఆశ పెట్టుకున్నాడు.  ఇప్పుడు చంద్రబాబు యాత్రతో అది కాస్తా
తుస్సుమన్నది.  టిటిడీపి నాయకులంతా ప్రస్తుతానికి అండర్
గ్రౌండ్ పోయినా రెపో, ఎళ్లుండో ఏమి చెప్పుతారో చూడాలి.
చంద్రబాబు ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ అని పేరు బదులు
‘ఆంధ్రుల ఆత్మగౌరావ యాత్ర’ అని పెట్టుకొని వుంటె బాగుండేది.
తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి ఏండ్ల కొద్ది ఉద్యమము
చేసినా, నెలల తరబడి విద్యాసంస్థలు బందువున్నా, ఉద్యోగస్తులు
ఆరువారాలు విధులు బంద్ చేసి ఉద్యమము చేస్తున్నా, పొలీసులు
తెలంగాణ ఉద్యమకారులపై దౌర్జన్యము చేస్తున్నా, అరెస్టులు చేసి
హింసిస్తున్నా, తెలంగాణ యువకులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలు
చేసుకున్నాచంద్రబాబు ఏ మాత్రము స్పందించలేదు.  ప్రతిపక్ష నేతగా
శాసనసభలోరాష్ట్ర పరిస్థితుల గురించి, తెలంగాణలో జరుగుతున్న ప్రజా
ఉద్యమము గురించి ప్రభుత్వాన్ని ఒక్కనాడు నిలదీయలేదు.  అంతేకాదు
ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానము పెడితె ప్రభుత్వము పడకుండా పూర్తి
మద్దతు కూడ ఇచ్చాడు.  సీమాంధ్ర, తెలంగాణ రెండు కళ్ళన్నా ఆయన
తెలంగాణ కన్ను పూర్తిగా గుడ్డిదైంది.  ఉన్న ఒక కన్నుమెల్లేమో, దానికి
సెలెక్టివగా సీమాంధ్రమాత్రమే కనబడ్తది.  తెలంగాణ ఉద్యమము తీవ్రముగా
ఉన్నన్ని రోజులు విదేశాలలో టూర్లు కొట్టుకుంటు వుండటమో,  మరేదొ
వంకన సీమాంధ్రలోకాలం గడిపేటోడు.  ఎలాంటి స్పందన లేకుండా కూల్‍గా
ఏ ఫ్రీజర్‍లో వుండేవాడో!  తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్లని అస్సలే గుర్తుకు
రాదు.
కాని, సీమాంధ్రలో ఎమైనా అయితుంటె ఈ రెండు కళ్ళ ఓ గుడ్డి కన్ను, ఓ
మెల్లకన్ను ఆంధ్రబాబు హృదయము దడ,దడ కొట్టుకుంటుంది.  ఉరికి పోయి
అక్కడవాళ్లకు అండగా నిలబడుతాడు.  కేంద్రానికి రాష్ట్ర పరిస్థ్తితుల గురించి
అత్యంత అవేదనతో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు.  ఆంధ్రోల్ల బాధ ప్రపంచ
బాధగ ఫీలౌతాడు.  ఇంట్లో కాలు నిలవదు.  మేధావులతోటి, మీడియోల్లతోటి,
వాళ్ళతోటి, వీళ్ళతోటి మీటింగుల మీద మీటింగులు పెట్ట్టి మేధోమథనము చేస్తాడు.
ప్రజలే నా జీవతము, మీరు లేకపోతే నేను లేనని మీమధ్యలోనే నా జీవతమని
యాత్రలు మొదలు పెడ్తాడు.  తెలుగుజాతని దానికొ కలరిస్తాడు.  అంతకంటే
ఆంధ్ర జాతంటె కరెక్ట్ గా సరిపోతుంది.  తెలంగాణలో ప్రజలు తెలుగువారైతె
ఆయన అప్పుడెందుకు స్పందించలేదు?  తెలుగు భాష ఒక్కటనుకున్న
ఆంధ్ర తెలుగు వేరు, తెలంగాణ తెలుగు వేరు - అమెరికన ఇంగ్లషు, బ్రిటన్
ఇంగ్లీష్ వేరైనట్టు.
ఈ యాత్రకు తెలుగు ఆత్మగౌరవయాత్రంటె ఎవరు నమ్మరు కాని, ఆంధ్ర ఆత్మ
గౌరవయాత్రా అని పెట్టుకుంటే బాబు గారికి కనీసము ఆంధ్రలో అతనిపట్ల
అభిమానము ఎక్కువై అది ఓట్లై అధికారాన్ని పొందొచ్చు. 

Friday, August 30, 2013

News - Views

ప్రజాస్వామ్యం
"ఇది విన్నవా?"
"ఏంటిది?"
"కిరణ్‍కుమార్ రెడ్డి నిన్న ఓ మీటింగలో అధిష్టానానికే వార్నింగ్
ఇస్తున్నట్టు మాట్లాడిండు."
"ప్రజాస్వామ్యములో ప్రజలే నిర్ణయిస్తరు, పార్టీలు కాదన్నడు."
"అంతేనా.  లేకపోతె ప్రజలు ప్రభుత్వానికి సెలవిస్తరన్నడు."
"అవును మరి.  కరక్టె కదా.  తెలంగాన రాష్ట్రము కోసము
60 ఏండ్ల బట్టి ఇక్కడి ప్రజలు పోరాడవట్టిరి.  ప్రజల కనుకూలమైన
నిర్ణయము తీసుకోక పోతె గెలువలేమనే కదా ఆ నాడు రాజశెఖర్
రెడ్డి తెలంగాన ఎమ్మెల్యేలతో సంతకము పెట్టిచ్చి విన్నపాన్ని సోనియా
గాంధికిచ్చిండు.  తెలంగాన అన్నడనేకదా అప్పుడు కాంగ్రేసు గెలిచింది.
ఆ తర్వాత తెలుగు దేశం కూడ తెలంగాన ఎత్తుకున్నందుకు ఆ పార్టికి
 సీట్లెక్కువ రాలేదా?  ప్రజారాజ్యం బెట్టి చిరంజీవి సామాజిక తెలంగాన అని
సీట్లు కొట్టలేదు.  అసలు పిఆర్పి లేకుంటే టిడీపేనె గెలిచేదనుకుంటా .
బిజేపి కూడ ఇప్పుడు తెలంగానకు సరెనంటుంది.  అసలు
వాళ్ళ హయాంలో ఇవ్వలేక పోయినందుకు అడ్వాని  బాధపడుతు అనలేదా-
చంద్రబాబు వల్లె మేము తెలంగాన ఇవ్వలేదు.  ఇప్పుడు అనవసరంగా
కాంగ్రేసు ఆ క్రెడిట్ కొడుతుందని బిజేపోల్ల బాధ కూడ వుంది."
"అట్లంటే, జగన్‍కు సపోర్ట్ గా ఆంధ్రాలో ఎమ్మెల్యేలు రిజైన్ చేసి మళ్లి
ఎలక్షన్లో నిలుచున్నప్పుడు టిజి వెంకటేషు ఒక్కటె మొత్తుకోలేదా,
జగనుకు ఓటెస్తె రాష్ట్రము విడిపోతదని, సమైక్యంగ వుండాలంటే
కాంగ్రేసుకే ఓటెయ్యాలని.  అయినా కట్టగట్టుకొని అక్కడోళ్లు
జగన్నే గెలిపియ్యలేదా?  అంటె రాష్ట్రము విడిపోయినా వాళ్లకేమి
బాధ లేదన్నట్ట్టేగద.  అక్కడ ‘జై ఆంధ్రా’ అనేటోల్లు వున్నరు,
‘జై రాయలసీమ’నేటోల్లున్నరు, మన దగ్గర అంత ఒకటె మాట”
‘జై తెలంగాన, జై జై తెలంగాన.’"
"అవును.  మనోళ్ళందరికీ,  అక్కడ సామాన్య ప్రజలందరికి రాష్ట్రము వేరు
పడాలనేవుంది.  ‘థూ, థూ’ అన్నా ఎన్ని రోజులు పడుకుంట వుండాలని
అక్కడ మామూలోళ్ళు అనుకుంటుండ్రు.  వాళ్లకు రాజధాని వస్తె వాళ్లకు
కూడ మంచి అవకాశాలు వస్తయని.  అక్కడ, ఇక్కడ కూడ వేరు పడితె
బడుగులకు రాజ్యాధికారము వచ్చే అవకాశముందని.  ఈ బలిసినోళ్లు
చెయ్యబటికే ఈ గొడవంతా."
"ఎట్లైనా ఆంద్రాలో తెలంగాన ఇచ్చినా ఇయ్యకున్న జగని పార్టీ, తెలుగుదెశం
వస్తది.  చంద్రబాబు తెలంగానకు ఓకే అన్నా మొన్న పంచాయితి ఎలక్షన్లో
బాగానే గెలిచిండు.  అక్కడ చంద్రబాబు జెండా ఎగిరేశినా ఆశ్చర్యం లేదు.
తెలంగానలో మాత్రం తెలంగాన ఇస్తె ప్రజలు కాంగ్రేసును తప్పకుండా గెలిపిస్తరు.
లేకపోతె గుండు సున్ననే పెడ్తరు. టిఆరెస్‍నె గెలిపిస్తరు.  ఇది ప్రజాస్వామ్యము కదా.
ప్రజలే నిర్ణయిస్తరు.కిరణ్ కుమార్ రెడ్డి సొంతూల్లో కూడ గెలుస్తడో లేక ప్రజలు
సెలువిస్తరో చూడాలె."

Thursday, August 29, 2013

News - Views

వికారాంధ్ర సభ
విశాలాంధ్ర మహాసభ వాళ్ళు హైదరాబాదులో ప్రెస్ మీటింగ్ పెడితె
అది కాస్తా రసాభాసగా ముగిసిందట.  వాళ్ళేమో లెక్చర్లు ఇస్తారట.
విలేఖరులు నోర్మూసుకొని చెప్పిందంతా రాసుకొని ప్రసారము/ప్రచారము
చేయలట.  ప్రశ్నలు అడిగితే మర్యాద వుండదట.  మీడయావాళ్ళను
నోర్మూసుకోమంటే వురుకుంటారా?  ఇల్లెక్కి  మరీ కూస్తరు.  దాంతో
పోలీసుల రక్షణ వలయంలో ఆ పెద్ద మనుషులు బైట పడ్డారు.  విశాలాంధ్ర
సభ కాస్త వికారంధ్ర సభగా మిగిలింది.
విశాలాంధ్ర సభ పెద్దమనుషులు కనబడితె నాక్కూడ కొన్ని ప్రశ్నలు అడగాలని
వుంది.
- విశాలాంధ్రా అంటె ఏమిటి? అది ఎవరి గురించి పనిచేస్తుంది?
-అది తెలుగు వారికోసమైతె, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు తెలంగాణలో
తెలుగు మాట్లాడె ప్రాంతాలను కొన్నిటిని కర్ణాటకా, తమిళనాడు, మహా
రాష్ట్రా, ఒరిస్సలో కలిపినప్పుడు ఎందుకు ఊరుకున్నరు?  ఆ కలిపేసిన
జిల్లాల్లన్ని కూడా తెలంగాణలో వుంటే తెలంగాణ సీమాంధ్ర కన్నా పెద్ద
ప్రాంతము అయ్యెది కాదా?  అప్పుడు ఆంధ్ర, తెలంగాణ సమంగా వుండేవి
కదా.  అట్లావుంటే మీ అధిపత్యము చెల్లదని, తెలంగాణను చిన్న రాష్ట్రము/
ప్రాంతము చేసి ఉపాయముతో ఆధిపత్యపు దురాలోచనతో కలసినది నిజము
కాదా?
-రజాకర్లతో విసిగి, ఇండియన్ యూనియన్లో కలిసిన తెలంగాణ ప్రజలు ఇష్టము
లేకున్నా, ఆంధ్రోళ్ళు ఇచ్చిన హామీలే కాక కొన్నాళ్ళు కలిసివున్నా కష్టమనిపిస్తె
విడిపోవచ్చని కేంద్రము అన్నది నిజము కాదా?
-ఆంధ్రోల్లు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఆరక్షణలు అన్ని అటకేక్కించుడో, చెత్తబుట్టలో
వేసి తెలంగాణ ప్రజలను అన్యాయము చేసినప్పుడు విశాలాంధ్ర పెద్దమనుషులు
ఏమి చేసిండ్రు?
-తెలంగాణ ఉద్యమములో మొదటిసారి 400 మంది తుపాకి గుళ్ళకు బలి అయినప్పుడు,
వారి చదువులు దెబ్బతిని, కేసులువలన ఉద్యోగావకాశాలు కోల్పోయి నక్స్లలైట్లుగా మారి
తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి దూరమైనప్పుడు వీరంతా ఎక్కడున్నరు,
ఏంజేసిండ్రు?
-తెలుగుజాతి ఒకటిగా వుండాలని ఇప్పుడు గొంతు చించుకునేవాళ్ళు,
జై ఆంధ్ర ఉద్యమము చేసి, ముల్కిరూల్స్ తెలంగాణలో
లేకుండా రాజ్యాంగ సవరణ పట్టుకొచ్చి యదేఛ్చగ తెలంగాణ వారి ఉద్యోగాలన్నీ
శాశ్వత ప్రాతిపదికన కొల్లగొట్టడము మొదలైనప్పుడు తెలుగువారి పట్ల వుండాల్సిన
అభిమానము గౌరవము యాడికి పొయింది?  తెలుగుజాతి ఒక్కటి వుండాలనుకునే
వాళ్ళు అప్పుడు జై ఆంధ్రా ఉద్యమము ఎట్ల చేసిండ్రు?
-తెలంగాణ మలిదశ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నపుడు, ఎంతో మంది యువకులు
యువతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఒక్కసారైన ఒక్క ఓదార్పుమాట మాట్లాడిండ్రా?
తెలంగాణలో తెలుగు యువత నిరాశ నిస్పృహలకు పోయి అత్మహత్య చేసుకోకుండ
ఏ కార్యక్రమము చేసిండ్రు?
-ఉస్మానియాలో యుద్ధవాతవరణము సృష్టించి, విద్యార్థులను కొట్టి కొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి
చంపినప్పుడు, హాస్టల్ రూముల్లో వున్న విద్యార్థినలను చీకట్లో బైటకులాగి అసభ్యంగా, అమానుషంగా
ప్రవర్తించినప్పుడు ఆ తెలుగు జాతి పిల్లల గురించి ఏ మాత్రము స్పందించకుండా విశాలంధ్ర పెద్దలు ఏ
కలుగులో దాక్కున్నరు?
-ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్త్రమైనా రాజ్యాంగము ప్రకారము భారత పౌరలకు వుండె హక్కులన్ని
హైదరాబాదులో వుంటాయన్నా ఉద్యమము చేసేది కేవలము మీరు ఇన్నాళ్ళు చేస్తున్న దోపిడి ఇక
ముందు సాధ్యము కాదన్న దుగ్ధతోనే కాదా?
-ఇప్పుడు మీరు చేసేది సమైక్యాంధ్ర ఉద్యమమా లేక సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమమా? సమైక్యాంధ్ర
ప్రదేశ్ ఉద్యమములో తెలంగాణ వారు లేకుండా అది ఆంధ్ర ఉద్యమమేకాని సమైక్యాంధ్రప్రదేశ్
ఉద్యమమెట్లైతది?  ఒకవేళ సమైక్యాంధ్ర ఉద్యమమంటె, మీ ఆంధ్రోళ్ళంతా ఒక్కటి, ఇక ముందు
తెలంగాణ వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టే కుట్రవున్న మాట నిజము కాదా?

Wednesday, August 28, 2013

News - Views

కార్యదీక్ష 
మొన్న సాయంత్రము ఆహారభద్రత బిల్లు గురించి లోక్ సభలో
ఏం జరుగుతుందో చూద్దామని టివీ పెట్టాను.  పెట్టిన కాసేపటికే
శ్రీమతి సోనియా గాంధి మాట్లాడటము మొదలైంది.  అమెను లోక్
సభలో మాట్లాడుతుండగా చూడటము అదే మొదటి సారి.  హిందీలో
మొదలు పెట్టారు.  చక్కగ స్థిరంగా, గంభీరంగా మాట్లాడుతున్నారు.
కాని నాకు వింతగా అనిపించిందో విషయము.  ఆమె చేతిలో కాగితాలు
రెపరెపలాడటం.  చేతులు వణుకుతున్నాయా అనిపించింది.  ప్రపంచములో
వున్న శక్తిమంతుల జాబితాలో ఒకరు , ప్రస్తుతం ఈ దేశన్ని నడిపించేది
ఆమెనే, మాట్లాడుతుంటె కంఠంలో స్థిరత్వముంది, నిలబడటములో ఠీవి,
నిబ్బరముంది, మరి చేతుల్లో ఆ వణుకెందకు అనిపిస్తుంది? నా చూపులో
లోపమా, లేక ప్రసారములో లోపమా, లేక ఆమెకేదైనా జబ్బు వుందాని
నాకు ఒకటే డౌటు.  ఆమె మాట్లాడటము చెవుల్లో పడుతున్నా నా చూపు
లన్ని ఆమె చేతులు, చేతిలో వున్న పేపర్ల మీదే.  ఆమె ప్రసంగము పూర్తి కాక
ముందే నాకు పని వుంటే టీవి బంద్ చేసి వెళ్ళిపోయాను.
మళ్ళి రాత్రి తొమ్మిదికి టీవి పెడితె కింద స్క్రోల్ వస్తుంది.  ఆహారభద్రత
బిల్ ఓటింగ్‍కు మేడం గారు గైర్హాజరని, ఒంట్లో బాగాలేనందు వలన ఆమెను
ఆసుపత్రికి తీసుకెళ్ళ్లారని.  అప్పుడు నాకర్థమైంది, అమె చేతులో పెపర్లు
ఎందుకంత రెపరెపలాడాయో.  ఆమె పట్టుదల, ఆమె శక్తి నాకర్థమైంది.
ఆమె అనారోగ్యంగ వున్నా పార్లమెంట్‍కు వచ్చిందని, బాగా జ్వరతీవ్రత వున్న
ఒప్పిగ్గా చర్చల్లన్ని విని బిల్లు పెట్టెవరకు కూర్చుందని.  జ్వరతీవ్రత వున్న
కారణంగా నిలబడి మాట్లాడెసరికి బహుశ కళ్ళకు చీకట్లు వచ్చేసరికి తప్పని
సరై సభను విడిచి వెళ్ళవలసి వచ్చిందనుకుంటా.  గ్రేటే.  అంత అనారోగ్యంగా
వున్నా తన బాధ్యతగా బిల్లు ప్రవేశ పెట్టేకోసం గంటల కొద్ది ఒపిగ్గా కూర్చోవటం.
ఆమె అనుకుంటే సరిగ్గా సమయానికి కూడా రావచ్చు.  కాని ఒప్పిగ్గా ఇక
కూర్చోలేని స్టెజి వరకు కూర్చోవటం గొప్ప విషయమే.  మన రాజకీయ
నాయకుల్లో ఎంత మంది అట్లా వుంటారు?
ఆహారభద్రత బిల్లుకు ఇచ్చినంత ప్రాముఖ్యత మరి తెలంగాణ బిల్లుకిస్తె ఈ
తెలంగాణ ప్రజలు ఆమె తెలంగాణ ప్రదాతగ గుర్తుంచుకుంటారు.

Tuesday, August 27, 2013

News - Views

హరికృష్ణ - హరే క్రిష్ణ!
తెలంగాన ఉద్యమము పుణ్యమాని ప్రజల్లో రాజకీయ చైతన్యము,
రాజ్యాంగము గురించి ఓ పిసరంత ఙ్ఞానము పెరిగింది.  అలాగె నాక్కుడ.
హరిక్రిష్నరాజ్యసభ మెంబర్షిప్‍కు రిజైన్ చేస్తానని తండ్రి సమాధి దగ్గర ఓ
పెద్ద ఉత్తరము పెట్టి, అది మీడియాకంతా చూపెట్టి మరీ సంతకము
పెట్టాడు.  అది చూసి నేను ఇది చెల్లని కాగితములె అనుకున్నా.  ఆ
తరువాత ఆయన రిజిగ్నేషను అక్సెప్ట్ చేసిండ్రని న్యూస్ విని ఆశ్చర్యమని
పించింది.  మళ్లి స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామా ఇచ్చిండని చెప్పిండ్రు.
ఎంతో మంది కాంగ్రేసోల్లు కూడా స్పీకర్ ఫర్మాట్లో రాజీనామా ఇచ్చినా అవి
పెండింగ్‍లో పెట్టి హరిక్రిష్నది మాత్రమే అంత అర్జెంట్‍గా ఎందుకు ఆక్సేప్ట్
చేశారా అని ఆలోచించాను.  కాస్తా బుర్రకు పనిబెడితె అర్థమైపోయింది.
హరిక్రిష్నవాగ్ధాటికి స్పీకర్ కురియని బెదిరిపోయిండని నా కనిపించింది.
హరిక్రిష్నా రాజ్యసభలో మాట్లాడింది  తప్పక చూడాల్సిన ఘటన.  అమ్మో!
ఎట్ల మాట్లాడిండని!  తెలుగు జాతిగౌరవాన్ని రాజ్యసభలో తన హావభావలతో
ఎంత బాగా చూపెట్టిండని!  తెలుగులో మాట్లాడ్డం మొదలు పెట్టాడు.  "నువు
మాట్లాడెదేమిటి అది నీ సీటేనా" అని స్పీకర్ సార్ అడిగారు.
"అవును.  నాదే.  నేను తెలుగువాడిని. తెలుగులోనే మాట్లాడుతా" అని గంభీరంగా
అన్నాడు.
"మరి ముందే చెప్పాలి కద.  నాకు తెలుగు రాదు.  ఇప్పుడు ఇట్లా అంటే ఎట్లా"
"నాకు నా భాషలో మాట్లాడె హక్కులేదా" ఉరిమాడు హరిక్రిష్న.
అతని తీరుకు పక్కన కూర్చున్న తెదేపా సభ్యులు కంగారు పడి హరిక్రిష్నకు
ఏదో సర్ది చెప్పబోయిండ్రు.  ఆ పక్కన కూర్చున్న వెంకయ్య నాయుడెమో హరిక్రిష్నకే
వత్తాసుగ ఏదో అన్నడు.
అప్పుడు హరిక్రిష్న "హమ్ హిందుస్తాని, మేర భారత్ మహాన్" అంటుంటె స్పీకర్ తన
కుర్చీలో సర్దుకొని, "అయితె ఫర్వాలేదు, హిందిలో మాట్లాడ"న్నాడు.
"లేదు, లేదు నేను తెలుగులోనే మాట్లాడుతాను.  నా జాతిని...." అంటు ఓ రెండు నిమిషాలు
సీమాంధ్రకు సపోర్టగా అద్భుత హావభావ ప్రదర్శనలతో ఒకసారి అందరికి తన నటనా
చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ( రాష్ట్రము విడిపోయాక ఈ సీను ఎదైనా సీమాంధ్ర ఉద్యమ
సీనిమా తీసినప్పుడు అందులో పెడ్తె ‘వాహ్ క్యా సీన్ హై’ అని మళ్లి మళ్ళి చూస్తరు).
పాపం కురియన్ ఏం చేయలేక అయోమయం మొకమ్ పెట్టుకొని కుర్చిలో కూర్చున్నడు.
అందుకేనేమో హరిక్రిష్న స్పీకర్ ఫర్మాట్‍లో రాజీనామా ఇయ్యంగనే వెంటనే తన ఆమోద ముద్ర
వేసినట్టున్నడు.  ఇంకోసారి హరిక్రిష్న రాజ్యసభలో మాట్లాడితె ఎదురు కూర్చునే ధైర్యము
ఆయనకు లేదనుకుంటా!

Monday, August 26, 2013

News - Views

అమరణ నిరాహార దీక్ష
గాంధి పుట్టిన దేశములో సత్యాగ్రహానికి, ధర్మాగ్రహానికి అర్థాలు మారిపోతున్నాయా?
స్వార్థాగ్రహాలు, స్వలాభేక్ష దీక్షలు ఎక్కువుతున్నాయా?  నిరాహార దీక్షలు
బరువు తగ్గే ప్లాన్ లో భాగమవుతున్నాయా?  ఆమరణ దీక్షలు
రాజకీయ ప్రచార మార్గాలవుతున్నాయా?  అవుననే నాకనిపిస్తుంది.
మహాత్మాగాంధి,  ఆమరణ దీక్షతో ఎవరైనా
చెప్పుకోదగ్గ ఫలితాన్ని సాధించారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరావు
మాత్రమే.  రాజకీయ అవసరాల కోసము దీక్ష చేసినవాళ్ళను
ఎంతమందిని చూస్తున్నాము? అందులోఎంత మంది పట్టుదలగా
దీక్షకొనసాగిస్తున్నారు? దీక్ష మొదలు పెట్టిన రెండో నాటి నుండె దీక్ష
చేసెవాళ్ల ఛానల్లు గంటలు లెక్క పెడుతు ఆరోగ్యము విషమిస్తుంది,
ఎప్పుడైనా కోమాలోకు వెళ్ళొచ్చని బ్రేకింగ్ న్యూస్లు ఇస్తుంటారు.
ప్రభుత్వము కూడ ఓ రెండు రోజులు తమాషా చూసి, అరెస్ట్ చేసి
డెక్సట్రోస్, సలైన్ మొదలు పెట్టెస్తారు.  బతుకు జీవుడాని ఆ దీక్ష
చేసెవాళ్ళు "నా దీక్ష ప్రభుత్వము భగ్నం చేసింది, త్వరలోనే మరో
ఉద్యమము చేపడ్తామ"ని  చెప్పి, అందుకు శక్తి కావాలి కాబట్టి వెంటెనే ఆహారము
తీసేసుకుంటారు.  అట్లా తీసుకోని వాళ్ళకు కొన్ని తప్పని పరిస్థితిలో
ముక్కులో గొట్టమేసి దాని ద్వారా పోషకాహార మిస్తు ఏండ్లు గడెపేస్తారు -
ఇరోమ్ షర్మిలాను అరెస్ట్ చేసి వుంచినట్టు.  రాజకీయ నాయకులకు అంత
నిబద్ధత వుండటము కష్టమే.  ఒక వేళ వుంటె ఆ నాయకుడికి వున్న
అనుయాయులు చేసె రకరకాల ఆందోళనలు తగ్గించటానికి ప్రభుత్వము
తాత్కాలికంగా ఏదో ఒక హామీ ఇచ్చి గండము గట్టెకుతుంది. అలాగే కేసిఆర్
బతికి బట్ట కట్టాడు.
నాకు తెలిసినంత వరకు మన దేశ చరిత్రలో నిరాహార దీక్షలో చనిపోయిన
నాయకుడు పొట్టి శ్రీరాములే.  ఆయనను కూడ కొంత మంది స్వార్థపరులు
ఆంధ్ర రాష్ట్రము ఏర్పడ్డా, మద్రాసు కావాలనే దురుద్దేశముతో దీక్షలో కూర్చో
బెట్టారు.  అప్పట్లో బ్రిటిష్ వాళ్ళే గాంధి నిరాఆహార దీక్షలో చనిపోకుండా
జాగ్రత్త పడ్డారు.  ఆ తరువాత నెహ్రూ ప్రభుత్వము కూడా ఆ జాగ్రత్త తీసుకుంది.
మరి పొట్టి శ్రీ రాములుని ఎందుకు చనిపోనిచ్చారు?  అసలు కారణము వేరే ఏమైనా
వుందా?  ఇప్పుడు ఆంధ్రా వాళ్లు చేస్తున్న విధ్వంసము, అరాచకము చూస్తుంటె
మొదటి సారిగా నా కనుమానము వస్తుంది.  పొట్టి శ్రీరాములు అమాయకంగా
ఎవరి కుట్రలకైనా బలి అయ్యాడా?

Sunday, August 25, 2013

News - Views

ఆవు - దూడ 
"హాయ్!  ఏంటీ సర్ప్రైస్?  రా రా రా."
"ఏం లేదోయ్. ఒక రోజు సెలవు పెడితె మూడు రోజులు కల్సొస్తున్నాయని వచ్చా."
"చాలా సంతోషం.  చాల రోజులైంది కదా కల్సుకొని.
అంతా ఓ.కే నా.  ఆఫీసులో ఎట్లుంది."
"అంతా బాగె.  తెలంగాన గోడవలతో ఆఫీస్ లో పరిస్థితులంతా
మారిపోయాయి.  ఆంధ్ర తెలంగానోళ్ళు ఒకరినొకరు అనుమానంగ
చూసుకుంటున్రు.  ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలన్న ముందెనక
చూసుకొని మాట్లాడుతున్నరు.  తప్పనిసరైతెనె మాట్లాడుతున్నరు ."
"ఇట్ల అనుమానాలు పడుకుంట వుండె కంటె ఎవరికాళ్ళమైతె పని
ఒడుస్తది కదా."
"అమ్మో!  వాళ్లట్ల అనుకుంటలేరు."
"వాళ్లు తెచ్చిందేమన్న ఇక్కడుందా?  ఈడికొచ్చి ఇక్కడ ప్రజలను
దోచుకొని వాళ్ళు కూడబెట్టుకున్నరు గని."
"వాళ్ళేమంటున్నరో  తెలుసా?  దూడగ వున్నప్పుడొచ్చినము.  ఇప్పుడు
ఆవై పాలిస్తుంటె ఎట్ల వదిలి పోతమని అంటున్నరు."
"అవునవును.  మన దగ్గర అవుండే. దూడుండే.  మనొళ్లు చెపుతరు కదా,
తెలంగాణ - ఆంధ్ర విలీనమైనప్పుడు మన హైదరాబాదుకు చక్కటి రాజధానికి
కావల్సిన అన్ని హంగులతో పాటు 30 కోట్ల మిగులు బడ్జెట్ వుండెనట.
వాళ్ళకు రాజధానే లేదు. గుడారాలు తప్ప.  అందుకే ఉరుక్కుంట వచ్చిండ్రు.
అవు మనది.  దూడ మనది.  గడ్ది మనది.  నేల మనది.  వాళ్లు వచ్చినా రాకున్న
దూడ పెరగక మానుతదా? పాలియ్యకుంటదా?  జీతగాడు మన ఆవు పాలు మన
కియ్యకుండ తాగుతుండనే కదా ఈ లోల్లి మొదలైంది.  జీతగాడు ఎక్కడున్నా జీతం
కోసం పని జేస్తడు.  కావాలంటె బోనస్ అడుగుతడు.  కాని అంత నా సొంతమంటె
ఎట్ల కుదుర్తది?  అప్పుడు వాడిని ఎళ్ళగొట్టాల్సి వస్తుంది.   అదే ఇప్పుడైతుంది."
"గిన్నెళ్ల తర్వాత పొమ్మంటె ఎట్ల పోతమని అంటరు."
"ఎన్నేండ్లున్నా కిరాయికున్న ఇల్లు సోంతమంటె, సెంట్ మెంట్ అంటె సొంతదారు
ఊరుకుంటడా.  ఎట్ల ఖాళీ చేయించాలో అట్ల చేస్తడు.  కాస్త వెనుకా ముందు అంతె.
సర్లె.  ఇప్పటికిది పక్కన పెడ్దాం.  మీ పిల్లల విషయాలు చెప్పు......."

Saturday, August 24, 2013

News - Views

వార్తలు - విశ్లేషలు : మనుషులేనా?
"ఇవ్వాల న్యూస్ చూసినవా?"
"ఏమి న్యూస్?"
"అదే..ముంబైలో..."
"అవన్ని నీకెందుకు?"
"ఇది అన్యాయం కదా. ఘోరం కద.  అసలు ఆడవాళ్లకు
రక్షణే లేకుండ పోతుంది."
"రక్షణ ఏవరికి వుంది చెప్పు.  ప్రతి రోజు దోపిడి హత్యల
గురించి వింటలేమా"
"అవుననుకో.  నిర్భయ కేసు తర్వాత అంత గోడవైంది కదా.
ప్రపంచమంత తెలిసింది.  అందులో ఒకడు చచ్చిండు.  ఫాస్ట్
ట్రాక్ అన్నరు.  ఇంకేమైందో తెల్వదు.  దేశముల మాత్రం ఈ
రేపులు ప్రతిరోజు వింటనేవున్నము."
"రేపులు ఎప్పుడు లేవని?  రామాయణ, భారత కాలముల నుండి
నడుస్తనే వున్నయి."
"నువ్వేదో చెప్తవ్.  మరీ ఈ మధ్యే ఈ గాంగ్ రేపులు ఎక్కువైనై."
"అవును.  అమ్మాయిలు ఇదివరకులాగ లేరు కద.  తెలివితేటలు
ధైర్యము ఎక్కువైనయి.  కొట్లాడుతారు కద.  అందుకని ఒక్కరితో
కాదని ముగ్గురు నలుగురు కలిసి, కొట్టి భయపెట్టి చేస్తరు.  లేక
పోతె అది సాధ్యం కాదుకద."
"ఎదురు తిరుగుతరని అట్ల చేస్తరంటవా? అంటె ఎదురు తిరుగొద్దంటవా"
"అరే, నీకు కోపమెందుకు.  విషయం చెప్తున్నా.  ఎదురు తిరుగాలి, కొట్టాలి.
కుదిరితే దగ్గర ఎప్పటికి ఒక చాకు పెట్టుకొని చంపడానికి సిద్ధంగా వుండాలి.
తన ప్రాణం మీదికి వచ్చినప్పుడు చంపటములో తప్పులేదు."
"అంటె ఇంట్లో నుండి కాలు బైటపెడుతున్న అమ్మాయి వెంట చాకు తీసుకు
పోవాలంటవ్."
"తెలివైన అమ్మాయి సమయస్ఫూర్తి, పెప్పర్ స్ప్రేతో  కూడ ప్రమాదాన్ని
తప్పింకోవచ్చు."
"మరి చిన్నపిల్లల గురించి ఎట్లా?"
"పిల్లలకు తల్లిదండ్ర్లులె జాగ్రత్త చెప్పాలె.  కొత్తవాళ్ళ దగ్గరకు అసలె వెళ్లొద్దని
ఏమి ఇచ్చినా తీసుకోవద్దని చెప్పాలె.  తెలిసిన వాళ్లతో కూడ ఇంట్లోవాళ్ళు
లేకుండా కలిసి వెళ్ళోద్దని చెప్పాలె.  చిన్నపిల్లలను ఉత్తనె భయపెట్టొచ్చు.
పిల్లలు భయముతో ఏడవటము తప్ప ఎదురు తిరుగలేరు.  అయినా కూడ
రేపిస్టులు, పిల్లలు కాని పెద్ద్లలు కాని, వాళ్ళ నేరాన్ని బైటకు చెప్తారనుకున్నప్పుడు
చంపేస్తారు.  వాళ్ళు చెప్పరనుకున్నప్పుడో, లేదా చట్టమంటే అసలే భయము,
లేకపోతెనో, లేదా తాము చాల పెద్దవాళ్ళు కాబట్టి తమను ఏ న్యాయము,
చట్టము ఏమి చేయదని ధైర్యమున్నవాళ్లు చంపకుండా వదిలేస్తరు.
చిన్నపిల్లల్ను సామాన్యంగ ఒక్కడె రేపు చేయడముంటుంది."
"అసలు ఈ రోజుల్లో న్యాయము, చట్టము ఏమైనా పని చేస్తున్నయంటవా.
ఎమ్మెల్యేలు, ఎమ్పీలు సగానికి సగమంది గుండాలు, దొంగలు, డాన్లే వున్నారు.
వాళ్ళ మీదనే బోలేడు కేసులున్నయి.  ఇవన్ని చూస్తుంటే ఆడపిల్లలను కనక
పోవడమే మంచిదనిపిస్తుంది."
"అట్లనకు.  అప్పుడు కూడ తక్కువ మంది ఆడావాళ్ళుండటముతో అట్లా కూడ
ప్రాబ్లమ్ ఎక్కువె అవుతుంది.  కాకపోతె చిన్నప్పటి నుండి అబ్బాయిల పెంపకములో
ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.  మగవాళ్ళు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది, అనే భావము తీసెయ్యాలి
చదువుతో పాటు మానవత్వము, ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవించడము నేర్పాలె."
"అంతేనా?  లా &  ఆర్డ్రర్ స్ట్రిక్ట్ గా వుండాలే.  నేరస్తులు ఎవరైనా కేసు తొందరగా పూర్తి చేసి,
శిక్ష తొందరగా పడెటట్లు చూడాలె.  శిక్షలు అన్ని ఛానల్లు, పేపర్లు బాగ ప్రచారము చేయాలి.  
రాను రాను ఆడోళ్ళ బతుకులు అధ్వాన్నమౌతున్నయి.  పశువుల్లాగ ప్రవర్తించె వాళ్ళకు
మనుషుల మధ్య వుండె హక్కు వుండదు.  రేపిస్టులు ఎవరికైనా మినిమం యావజ్జీవ శిక్ష
వేయాల్సిందే.  తప్పనిసరి కేసుల్లొ మరణశిక్ష వేయ్యాలే.  పక్కవాడి ప్రాణాన్కి విలువివ్వని వాడికి
బతుకె హక్కు ఎందుకుండాలి?"
"సరెలే. ఆడపిల్లలు తప్పనిసరిగా చదువుకొని, ఆర్థిక స్వావలంబన, ఆత్మస్థైర్యము పెంచుకొవాలే.
సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ లో  చేరి కొట్లాడే శక్తి, సమయస్పూర్థి పెంచుకోవాలె.  రోడ్డు మీదకెళ్తే  
ఆక్సిడెంట్ కుఎట్లా అవకాశముందో అట్లాగె ఇవ్ టీజింగ్ కు, రేపుకు అవకాశముంటుంది.
ఎప్పుడైనా అప్రమత్తంగా వుండక తప్పదు."
"ఇట్లా రేపు చేసెటోల్లు అసలు మనుషులేనా."
"కాదు.  కాని అందరు పశువులు కాదు కదా.  దొంగతనాలు, దోపిడీలు, హత్యలు జరిగినట్టె
రేపులు కూడా జరుగుతుంటయి."
"అన్నిటికంటె రేపు హేయమైంది కాదా?  జీవాతంతము మనిషిని కుంగదీస్తుంది కదా."
"కరక్టె.  జీవతములో ఎన్నో ప్రమాదాల్లో ఇది కూడ ఒకటి.  ఇట్లాంటివి జరిగినప్పుడు
కుటుంబము, సమాజము, ప్రభుత్వము ఆ స్త్రీకి అన్ని విధాలుగ అండగా నిలువాలె."
"ఎంతైనా లా స్త్రిక్ట్ గా వుండి శిక్షలు వెంటెనె పడితేనె ఈ నేరాలు తగ్గుతాయి.  మగవాళ్ళు
ఆడవాళ్లను ‘చీజ్ బడీ మస్త్, మస్త్ ’ అనుకోకుండా వ్యక్తిగా గౌరవించటము నేర్చుకోవాలె"
"అవును"

Friday, August 23, 2013

News-views

వార్తలు - విశ్లేషలు 
సమన్యాయం
"అంతా సమన్యాయం, సమన్యాయం అంటుండ్రు.
సమన్యాయం అంటె ఏంది?"
"అందరిని సమానంగ చూసుకునుడు, ఒక్క తీరుగ
మంచిగ చూసుకునుడన్నట్టు."
"మరి ఈ మధ్య గీ విజయమ్మ సమన్యాయం అని
ఒక్క తీరుగ పాట పాడుతుంది.  గదేంది?"
"గదేందంటే...తెలంగాన వస్తుంది కదా, అందుకని
ఆంధ్రొల్లకు తను సపోర్టని ఏదో చేస్తుంది."
"అసలు ఆ ఆంధ్రోల్లు మనల్ను అన్యాయం చేస్తుండ్రనే
‘మా తెలంగాన మాగ్గావల’నే గొడవ మోదలైంది.  మన
కన్యాయము జరుగుతుందని అని రకాల కమీటీలు
కమీషన్లు చెప్పినవి కద.  ఆ క్రిష్న కమీషను కూడ
వీల్లు పెద్దమనుషుల ఒప్పందం కాన్నుంచి అన్ని హామీలు
అటకెక్కించండ్రని అందుకే తెలంగాన బాధలన్ని అని చెప్పి
తెలంగాన విడగొట్టుడుతో ఆంధ్రోల్లతొ గొడవ వచ్చిన ఎట్లైనా
ముందు వడి చేయమని ఇన్ డైరక్ట్ గా చెప్పింది.  మన
కన్యాయము జరిగింది మొర్రో అని మనము మొత్తుకుంటుంటే
ఈ సమన్యాయమేందంటా?"
"అసలే ఆడోళ్ల మాటాలకు అర్థాలే వేరంటారు. ఓట్ల కోస-"
"ఇగో.  ఆడాళ్ళో గురించి మాత్రము అట్లా మాట్లాడకు.  కావాలంటే
రాజకీయ పార్టీల మాటలకు అర్థాలే వేరను.  తెలంగానను ఆంధ్రోల్ల
పాలననుంచి విడిపించినట్టు జగన్ను చెంచల్ గూడ జైలు నుండి
విడిపించమంటుందేమో!"
"ఏమో కొత్త అర్థాలు చెపుతున్నవ్.  నీకు ఈ మధ్య రాజకీయ తెలివి
బాగనే పెరిగినట్టుంది!"

News-Views

వార్తలు - విశ్లేషలు
ఒడువని ముచ్చట 
"తెలంగాన వస్తుందంటవా?"
"వస్తదొస్తది."
"ఏమో.  రోజుకో కొత్త కత పెడుతుండ్రు ఈ ఆంద్రోల్లు."
"ఎన్ని కతలు పెట్టినా తెలంగాన రాక తప్పదు."
"పదమూడేండ్ల బట్టి ఉద్యమం నడుస్తుంది. పిల్లల చదువులు
చెడిపోతున్నయి.  జరిగే అన్యాయం ఇంక ఎక్కువనే అయి
తుంది.  మొన్నటిదాక తెలంగానకు వ్యతిరేకము కాదన్న్లొల్లు
ఇప్పుడు కేంద్రము తెలంగాన ఇస్తె మేమొద్దంటమా అన్నరు.
కాంగ్రేసోల్లు అధిష్టానం నిర్నయానికి కట్టుబడి వుంటమన్నరు.
అందరొప్పుకున్నరు కదాని కాంగ్రేసు ఒప్పుకొని తెలంగాన
ఇస్తనంటే అంతా అట్లేట్ల ఇస్తరని ఒకటె ఎగురుతున్నరు."
"ఎవలేమన్నా తెలంగాన రాక తప్పదు.  గీ అలర్లు చూసి
కాంగ్రేసు తెలంగానా ఇయ్యకుంటె రేపు బిజేపి ఇస్తది."
"అప్పుడు మాత్రం గీ సీమాంధ్రోల్లు మళ్ళి గాయి చేయకుంటరా?
రాజ్యసభల ఆ వెంకయ్యనాయుడు సీమాంధ్ర ఎంపిలకు ఎంత
సపోర్టుగ మాట్లాడినడనుకున్నవ్.  తెలంగాన విషయ మొచ్చేసరికి
మోకమెంత మాడ్చుకూచన్నడో నువు చూడలేదు."
"గవన్ని చూసి నన్ను పరెషాన్ చేయ్యకు.  ప్రజలు తెలంగాన
మర్చిపోయె ముచ్చటే లేదు.  టిఆరెస్స్ పార్టి వున్నంత వరకు
అది తెలంగానను మర్చిపోనియ్యదు.  అది కాకపోతె ఇంకో
రాజకీయ పార్టీ వస్తది.  అధికారం కోసమె కదా ప్రతి పార్టీ
తెలంగానకు జై కొట్టింది."
"కరక్టె.  కాని సీమాంధ్రోల్ల్లు మాటలు చూస్తుంటె నాకైతె టెన్షన్
పెరుగుతుంది.  ముందేమొ అధిష్టానమన్న్రరు.  ఇప్పుడామెను
ఇష్టమొచ్చినట్టు తిడుతున్నరు.  అన్నదమ్ములంటున్నరు.
మనోల్లను ఆంధ్రలో తన్నవట్టిరి.  కడుపుతోటి వున్నామే అవస్థతోటి
ఆస్పటల్కు పోతే, ఆమేమి డాక్టరమ్మో "తెలంగాన అంటేనె అసహ్యము
నీ తెలంగానలోనె చుపెట్టుకో పో" అని ఎళ్ళగొట్టిందట.  ఇక్కడ మనోల్లు
కూడ అట్ల చేస్తె ఎట్లుంటది?"
"వాల్లు ఏదో చెసినరని మనము చేస్తమా?  వాళ్లలాగ మనము కుళ్ళు
కుయుక్తులతో వుండుంటె మన పరిస్థితి ఇప్పుడు ఇట్లా వుండేదా?"
"మన మంత్రులంత చేతగానోళ్ళ లెక్కున్నరు.  అధిష్టానమేమి చెప్తే
గంతే నని ఊకుంటరు.  ‘బాంచెను కాల్మొక్తా’ని గమ్మునుంటరు.  గా
వాల్లు చూడు అధెష్టానాన్ని ఎన్నెన్ని మాటలంటుండ్రు, ఎన్నెన్ని
శాపనార్థాలు పెడుతుండ్రు.  గిదంత చూస్తుంటే కాంగ్రేసోల్లు మళ్ళి
ఎన్కకు పోతరేమోన్పిస్తుంది."
"వాల్లు మళ్ళి మళ్ళి చెపుతుండ్రు కద, తెలంగాన ఇచ్చుడు తప్పదని.
నువ్వు ఇంక మాట్లాడకు.  గా ఆంధ్ర పేపరు చదివి, టివిలు చూసి
నువ్వు పరేషానై నన్ను పరేషాని జెయ్యకు.  ఆ కేబల్ టివి కట్ చేయిస్త.
ఆంధ్రోల్ల తెలుగు పేపరు కూడ బందువెట్టిస్తా.  గా తెలంగాన పేపరు
ఒక్కటి చదివు. లేకపోతె నువ్వు రంది పడి నన్ను పరేషాని జేసి
హార్ట్ అట్టాక్ తెప్పిచ్చేటట్టునవ్."

Wednesday, August 14, 2013

Jai Samaikyaandhra

జై  ఆంధ్ర - సీమాంద్రా  

సీమాంధ్రాలో సమైక్య ఉద్యమము రెండు వారాలుగా ఆగక సాగుతుంది.
ప్రజాప్రతినిధుల ప్రేరణతో, ప్రభుత్వ ప్రోత్సాహముతో, పోలీసుల పర్యవెక్షణలో,
ఛానల్ల ప్రచార ప్రభంజనాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సమైక్య సమ్మె
సాగుతుంది జోరుగా హుషారుగా!  ప్రజల ఇక్కట్ల్లు అవసరము లేదు,
పేదలు, రోజు వారి కూలీల పొట్టకూటి గురించి పట్టింపు లేదు,
విద్యార్థుల చదవు చెడినా ఫర్వాలేదు, ప్రయాణికుల కష్టాలు తెలుసుకునే
పనిలేదు, ధరలు ఆకాశాన్నిఅంటి పేద మధ్యతరగతి వారి ఆకలి మంటల
గురించి ఆలోచించే ధ్యాసె లేదు, తోటి తెలుగు వాడిని అణచి, దోపిడి
చేసుకునే హక్కుని వదులుకునే ప్రశ్నేలేదు!  సమైక్య ఉద్యమము
ఒక ప్రాంతాన్ని, ప్రజలను దోచుకునె హక్కును వదులుకోమని
చేస్తున్న ఉద్యమము.  తెలుగుజాతని, అన్నదమ్ముల్లని సెంటి
మెంటుతో ఒక ప్రాంతాన్ని శాశ్వతంగా వలసవాసుల ఆధిపత్యానికి
లోబడి వుండె విధంగా చేసేయత్నమే ఈ సమైక్య ఉద్యమము.
సమైక్యమన్నది ఒకే స్థాయిలో, ఒకే వర్గానికి, ప్రాంతానికి చెందిన
వారి మధ్య మాత్రమే సాధ్యము.  ఇన్నేళ్ళు ఆం.ప్ర. జరిగిన ఘటనలే
ఇందుకు సాక్ష్యము.
ఇప్పుడు ఆంధ్రాలో జరిగేది జై సమైక్యాంధ్ర ఉద్యమమే కాని జై ఆంధ్ర
ప్రదేశ్ ఉద్యమము కాదు.  ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో కలిసి ఆంధ్ర
ప్రదేశ్ గా ఏర్పడప్పుడు కొన్ని ఒప్పందాలు జరిగాయి.  అవి ఆంధ్ర
రాష్ట్రము వాళ్ళు నీటి రాతలుగా మార్చి తెలంగాణ నిధులు, నీళ్ళు
వనరులు దోచుకోవటము, అది నిరాటంకంగా సాగేందుకు వాళ్ళ
ప్రాంతము వాళ్ళనే అన్నికీలక ఉద్యోగాల్లో నియమాకాలు చేసి
తెలంగాణ వారి ఉద్యోగాలను కూడ కొల్లగొట్టారు.  తెలంగాణా వారు
ఆంధ్ర దోపిడికి వ్యతిరెకంగా పోరాటము చేసి ఎన్నిఆరక్షణ హక్కులు
తెచ్చుకున్నా ఆంధ్రా పెత్తెందార్ల్రు వాటిని బుట్టదాఖలు చేసి వారి దోపిడిని
యధేచ్చగా సాగించారు.  ప్రతిసారి తెలంగాణ వాళ్ళుపోరాటము చేసి
కేంద్రము ద్వారా హక్కులను తెచ్చుకునేటప్పుడు ఆంధ్రా పాలకులు
వాటిని అమలు చేస్తామని కేంద్రములో హామి ఇచ్చిరాష్ట్రములో మాత్రము
వాటిని అటకెక్కించె వారు.
తెలంగాణ పోరాటము ఎందుకు వచ్చిందో అందరికి తెలుసు.  ఇదివరకు
ఏవో హామిలతో బుజ్జగించ యత్నించిన ఆంధ్రా పాలకులు ఈసారి మాత్రం
అలా చేయదలచుకోలేదు.  ఇన్నాళ్ళు వాళ్ళు ఈ ప్రాంతానికి చేసిన
అన్యాయాన్ని కూడ తప్పిదముగా భావించట్లేదు.  ఇప్పుడు వారు
పూర్తిగా సిగ్గువిడిచారు.  వారు చేసె సమైక్య ఉద్యమము వారు తెలంగాణకు
ఎలాంటి అస్థిత్వము లేకుండా చేయాలనే ఉద్దేశముతో చేస్తున్నది.
తెలంగాణాలో తెలంగాణ వారినే పరాయిలగా, బానిసలుగా మిగిల్చాలని
కొనసాగిస్తున్నది.  అందుకె వారు చేసేది సమైక్య ఆంధ్ర ఉద్యమము లెదా
జై సమైక్యాంధ్రా ఉద్యమము.  ఇది జై ఆంధ్రప్రదేశ్ ఉద్యమము కాదు.
వారికి కావలసింది ఆంధ్ర అస్థిత్వమె కాని తెలుగు జాతి అస్థిత్వము కాదు.
వారికి కావలసింది తెలంగాణలో చరిత్రాత్మకమైన హైదరాబాదు నగరమే
కాని తెలుగుజాతి సామరస్యము కాదు. వారికి కావలసింది తెలంగాణతో,
తెలంగాణ ప్రజలతో తెలుగుజాతిగా తెలంగాణ గడ్డమీద సహజీవనము
చేయటము కాదు,  తెలంగాణ అంతర్భాగమైన ప్రపంచ ఖ్యాతిగాంచిన
హైదరాబాదు నగరముపైన ఆధిపత్యము.  వారు నిస్సిగ్గుగా చెప్పుతున్నారు,
మాకు దక్కని హైదరాబాదు తెలంగాణాకు కూడ దక్కొద్దని తెలుగు
జాతి సోదరప్రేమ అంతా ఆ విషయానికి వచ్చెసరికి గాల్లో కల్సిపోయింది.

ఆంధ్రప్రదేశ్  తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిస్తె ఏర్పడింది.  తెలంగాణ విడి
పోతే వుండేది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్.  తెలంగాణ అంతా ఒక్కటె.  ఆంధ్రా
లోనె ప్రాంతీయ బెధాలు వున్నాయి.  ఆంధ్రా అని, కోస్తాంధ్రా అని, రాయల
సీమా అని, ఉత్తరాంధ్రా అని.  ఇన్ని ప్రాంతీయ బెధాలు, వాటి మధ్యలో
విబేధాలు వుండి కొత్తగా ఏర్పడె ఆంధ్రప్రదేశ్ లోనైన ఆంధ్రులంతా సహ
జాతి భావముతో మెదులుకుంటూ అన్ని ప్రాంతాలకు న్యాయము చేస్తు,
అభివృద్దిలో అన్నింటిని సమంగా ముందుకు తీసుకెళ్ళు సహజీవనము
చేస్తె ఎంతో ప్రగతిని సాధించవచ్చు.  సమైక్యంగా పురోగమించవచ్చు.  అట్లా
కాకుండా తెలంగాణను అణగదొక్కినట్టు అక్కడ కూడా సీమనో, ఉత్తరాంధ్రనో
వెనకబడేసినా, ఏ విధంగా అన్యాయము చేసినా అక్కడ మరో ఉద్యమము
రాక తప్పదు.  తెలుగు మాట్లాడె వారికి మరో రాష్ట్రము ఏర్పాటు చేయక
తప్పదు.
మనసులో ఏ భావము పెట్టుకొని చేసినా ఈ సమైక్యాంధ్ర ఉద్యమము ఆంధ్రాలో
అందరిలో సామరస్యము తీసుకురావాలి.  ఆంధ్రా, రాయలసీమ తెలుగు సొదరులు
సఖ్యంగా వుండాలి.  ఇప్పుడు వారు చేస్తున్నఈ సమైక్యాంధ్రా స్ఫూర్తితో వారు
రాబోవు కాలములో కలిసి వుండి ప్రపంచ ఖ్యాతి గాంచె విధంగా వారి ఆంధ్ర
ప్రదేశ్ లేదా సమైక్యాంధ్రాని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రజలంతా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
జై తెలంగాణ!  జయహో తెలంగాణ!!
జై ఆంధ్రా/సీమాంధ్రా/సమైక్యాంధ్రా!